ఆయుష్

ఆయుష్ రంగంలో వ్యవస్థాపకత అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది.. కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీ శర్వానంద్ సోనోవాల్


డిసెంబర్ 1 నుంచి 5 వరకు తిరువనంతపురంలో అంతర్జాతీయ ఆయుర్వేద ఉత్సవం

Posted On: 01 DEC 2023 5:24PM by PIB Hyderabad

అంతర్జాతీయ  ఆయుర్వేద ఉత్సవాన్ని తిరువనంతపురంలో కేంద్ర ఆయుష్, ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ  మంత్రి శ్రీ శర్వానంద్ సోనోవాల్ ఈరోజు  ప్రారంభించారు. సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ సైన్స్  సోషల్ యాక్షన్ సహకారంతో నిర్వహిస్తున్న అంతర్జాతీయ  ఆయుర్వేద ఉత్సవం డిసెంబర్ 5 వరకు జరుగుతుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో ఆయుర్వేద రంగంలో సాధించిన ప్రగతి, ఆయుర్వేదం ప్రయోజనాలు ప్రపంచ దేశాలకు తెలియజేయడానికి అంతర్జాతీయ  ఆయుర్వేద ఉత్సవం నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.. ఆయుష్ రంగంలో అభ్యాసకులు,వాటాదారులు ఆవిష్కరణకు ప్రాధాన్యత ఇచ్చి  సహకార స్ఫూర్తితో పని చేయాలని ఆయన సూచించారు. 

  డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న  అంతర్జాతీయ ఆయుర్వేద ఉత్సవంలో వివిధ దేశాలకు చెందిన  ఆయుర్వేద పరిశోధకులు, ప్రముఖులు పాల్గొంటున్నారు.

శ్రీ సోనోవాల్ జాతీయ ఆరోగ్య మేళాను కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి  శ్రీ  వి.మురళీధరన్,  ఆయుష్ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా తో కలిసి ప్రారంభించారు.కార్యక్రమంలో   ఆయుష్ మంత్రిత్వ శాఖలోని ఇతర అధికారులు పాల్గొన్నారు.  అంతర్జాతీయ ఆయుర్వేద ఉత్సవం, ఆరోగ్య ఎక్స్‌పోతో పాటు ఈ మేళా నిర్వహిస్తున్నారు. పురాతన జ్ఞానం, ఆధునిక పురోగతి మధ్య అంతరాన్ని తగ్గించడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో  చురుగ్గా పాల్గొనాలని నిపుణులు,పరిశోధకులకు శ్రీ సోనోవాల్ విజ్ఞప్తి చేశారు.

ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తూ సహకార స్పూర్తితో పనిచేయాలని  ఆయుష్ అభ్యాసకులు, సంబంధిత వర్గాలకు ఆయుష్ మంత్రి సూచించారు.  ఆయుష్ రంగంలో ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడే వారికి కూడా ప్రభుత్వం సౌకర్యాన్ని కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఆయుష్ రంగంలో వ్యవస్థాపకత అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపిన  శ్రీ శర్వానంద్ సోనోవాల్ ఆయుష్ రంగంలో  స్టార్టప్‌లను స్థాపించడానికి యువ పారిశ్రామికవేత్తలకు అపారమైన అవకాశాలు  ఆయన అన్నారు.

 అభివృద్ధి చెందుతున్న ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవడంలో భారతదేశ సాంప్రదాయ వైద్యం, ముఖ్యంగా ఆయుర్వేద వైద్య విధానాలు కీలకంగా ఉంటాయని  విదేశాంగ శాఖ సహాయ మంత్రి శ్రీవి  మురళీధరన్ అన్నారు. ఇటీవల నీతి ఆయోగ్ నిర్వహించిన  అధ్యయనంలో సంప్రదాయ వైద్య వ్యవస్థ పటిష్టత వెల్లడైందన్నారు.  

ఆయుష్ శాఖ కార్యదర్శి శ్రీ వైద్య రాజేష్ కోటేచా దేశంలో నాణ్యమైన విద్య రంగంలో సాధించిన ప్రగతిని వివరించారు. విద్యా ప్రమాణాలు మెరుగు పరచడానికి ఎన్సిఎంఎం చేసిన   కృషిని ఆయన అభినందించారు. జాతీయ ఆయుష్ మిషన్ ద్వారా ప్రజారోగ్యంలో సాధించిన ప్రగతిని ఆయన వివరించారు. అనేక జిల్లాల్లో ఆయుష్ కేంద్రాలు  విస్తరిస్తున్నాయని ఆయన అన్నారు.  శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించడం, కీలకమైన క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం, సంప్రదాయం ఔషధ వ్యవస్థల్లో సాక్ష్యం-ఆధారిత పద్ధతులు ప్రోత్సహించడానికి  ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న  పరిశోధనా మండలి ద్వారా కృషి జరుగుతుందని అన్నారు. సహకార అధ్యయనాలు , ముఖ్యంగా ఇంటిగ్రేటివ్ మోడల్‌లలో చురుకుగా పాల్గొంటున్ననిపుణులను  ఆయన అభినందించారు. 

 

***



(Release ID: 1981806) Visitor Counter : 61


Read this release in: English , Urdu , Hindi , Tamil