ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

సాయుధ దళాల వైద్య కళాశాల, పూణేలో టెలీ-మానస్ సెల్ స్థాపించబడింది

Posted On: 01 DEC 2023 5:59PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మద్దతుతో పూణేలోని ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీలో ప్రత్యేక టెలి-మానస్ సెల్ ఏర్పాటు చేయబడింది. ఈ సెల్‌ను ఈరోజు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, పీ వీ ఎస్ ఎం, యూ వై ఎస్ ఎం, ఏ వీ ఎస్ ఎం, ఎస్ ఎం, వీ ఎస్ ఎం ప్రారంభించారు. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు శ్రీమతి ఇంద్రాణి కౌశల్ మరియు నిమ్హాన్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రతిమా మూర్తి కూడా పాల్గొన్నారు. ఈ సెల్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ యొక్క టెలీ మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్‌వర్కింగ్ అక్రాస్ స్టేట్స్ (టెలి మనస్) యొక్క అనుబంధ సంస్థ గా పనిచేస్తుంది.

 

నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా, టెలీ మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్‌వర్కింగ్ అక్రాస్ స్టేట్స్ (టెలి మనస్)ని కేంద్ర ఆర్థిక మంత్రి 2022 కేంద్ర బడ్జెట్‌లో 1 ఫిబ్రవరి, 2022న ప్రకటించారు మరియు డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ (డి ఎం హెచ్ పీ)యొక్క డిజిటల్ విభాగంగా 10 అక్టోబర్, 2022న నిమ్హాన్స్‌లో జరిగిన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ వేడుకలో కర్ణాటక గవర్నర్ ప్రారంభించారు. 14416  టోల్-ఫ్రీ నెంబర్ ద్వారా ప్రతి రాష్ట్రం మరియు యూ టీ లో 24 x 7 టెలి మెంటల్ హెల్త్ సదుపాయాన్ని సమగ్రంగా మరియు సమ్మిళితం గా పనిచేయాలని టెలీ-మానస్ భావిస్తోంది.

 

భారత సైన్యం ఎదుర్కొంటున్న ప్రత్యేక ఒత్తిళ్లను గుర్తించి సాయుధ బలగాల లబ్ధిదారులకు సమగ్ర ఆరోగ్య సంరక్షణను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.  కార్యరంగ వాతావరణం, సాంస్కృతిక సవాళ్లు మరియు ప్రాంతీయ సంఘర్షణల నిర్దిష్ట ఒత్తిళ్లతో పని చేసే సాయుధ దళాలలో మానసిక ఆరోగ్య సంరక్షణ సేవలకు ప్రత్యేక విధానం అవసరం. సాయుధ దళాలలోని సేవా సిబ్బంది మరియు వారి కుటుంబాల మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం స్పష్టంగా ప్రభుత్వం గుర్తించింది. సాయుధ దళాల సిబ్బంది మానసిక సమస్యలను పరిష్కరించడంలో ప్రత్యేక సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ టెలి మనస్ సెల్ ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించాలని నిర్ణయించింది.

 

ప్రస్తుతం నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా కింద, 34 రాష్ట్రాలు/యూటీల ద్వారా 46 ఫంక్షనల్ టెలి మనస్ సెల్‌లు 20 విభిన్న భాషల్లో సేవలు అందుబాటులో ఉన్నాయి. టెలి మనస్ హెల్ప్‌లైన్ అక్టోబర్ 2022లో ప్రారంభించినప్పటి నుండి 4 లక్షల 70 వేల కంటే ఎక్కువ కాల్‌లను స్వీకరించింది మరియు ఒక రోజులో 2000 కంటే ఎక్కువ కాల్‌లను నిర్వహిస్తోంది.

 

***



(Release ID: 1981797) Visitor Counter : 75


Read this release in: English , Urdu , Hindi , Marathi