ఆర్థిక మంత్రిత్వ శాఖ
నవంబర్ 2023లో జీఎస్టీ రాబడి రూ.1,67,929 లక్షల కోట్లతో అత్యధిక వృద్ధి రేటు నమోదు, గత ఏడాదిలో ఇదే నెలతో పోలిస్తే 15 శాతం వృద్ధి
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆరవసారి రూ. 1.60 లక్షల కోట్ల మార్కును దాటిన స్థూల జీఎస్టీ వసూళ్లు
2023-24 ఆర్థిక సంవత్సరంలో నవంబర్, 2023 వరకు జీఎస్టీ సేకరణ గత ఏడాది
ఇదే నెలతో పోలిస్తే 11.9 శాతం పెరుగుదల
Posted On:
01 DEC 2023 6:30PM by PIB Hyderabad
2023, నవంబర్ నెలలో స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,67,929 కోట్లు నమోదయింది. అందులో సీజీఎస్టీ రూ.30,420 కోట్లు కాగా, ఎస్జీఎస్టీ రూ. 38,226 కోట్లు, ఐజీఎస్టీ రూ.87,009 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ. 39,198 కోట్లతో కలిపి) సేకరించారు. సెస్ రూ. 12,274 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన ₹ 1,036 కోట్లతో కలిపి) అయింది.
ఐజీఎస్టీ నుండి సీజీఎస్టీకి రూ. 37,878 కోట్లు, ఎస్జీఎస్టీకి రూ. 31,557 కోట్లు ప్రభుత్వం సెటిల్ చేసింది. రెగ్యులర్ సెటిల్మెంట్ తర్వాత 2023, నవంబర్ లో కేంద్రం, మరియు రాష్ట్రాల మొత్తం ఆదాయం సీజీఎస్టీకి రూ. 68,297 కోట్లు, ఎస్జీఎస్టీకి రూ. 69,783 కోట్లు ఆదాయం తేలింది.
2023, నవంబర నెల ఆదాయాలు గత సంవత్సరం ఇదే నెలలో జీఎస్టీ రాబడి కంటే 15% ఎక్కువగా ఉన్నాయి. 2023-24లో నవంబర్ 2023 వరకు ఏ నెలలోనైనా అత్యధికంగా ఉన్నాయి. ఈ నెలలో దేశీయంగా వచ్చే ఆదాయాలు లావాదేవీలు (సేవల దిగుమతితో సహా) గత సంవత్సరం ఇదే నెలలో ఈ మూలాల నుండి వచ్చిన ఆదాయాల కంటే 20 శాతం ఎక్కువ. 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్ల మార్కును అధిగమించడం ఇది ఆరవసారి. నవంబర్, 2023తో ముగిసే 2023-24 ఆర్థిక సంవత్సరం [రూ.13,32,440 కోట్లు, సగటున నెలకు రూ.1.66 లక్షల కోట్లు)లో... 2023, నవంబర్ తో ముగిసే 2022-23 ఆర్థిక సంవత్సరానికి స్థూల జీఎస్టీ సేకరణ కంటే 11.9 శాతం ఎక్కువ [ రూ.11,90,920 కోట్లు, సగటున నెలకు రూ. 1.49 లక్షల కోట్లు].
ప్రస్తుత సంవత్సరంలో నెలవారీ స్థూల జీఎస్టీ ఆదాయాల ధోరణిని దిగువ పట్టిక సూచిస్తుంది. 2022, నవంబర్ తో పోలిస్తే 2023, నవంబర్ నెలలో ప్రతి రాష్ట్రంలో సేకరించబడిన జీఎస్టీ రాష్ట్రాల వారీ గణాంకాలను టేబుల్-1 చూపుతుంది. నవంబర్ 2023 వరకు ప్రతి రాష్ట్రం సెటిల్‌మెంట్ అనంతర జీఎస్టీ రాబడి రాష్ట్రాల వారీ గణాంకాలను టేబుల్-2 చూపుతుంది.
పట్టిక: స్థూల జీఎస్టీ వసూళ్లు (రూ.కోట్లలో)
2023 నవంబర్ లో రాష్ట్ర స్థాయి జీఎస్టీ వృద్ధి :[1]
(రూ.కోట్లలో)
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
|
నవంబర్-22
|
నవంబర్ -23
|
వృద్ధి (%)
|
జమ్మూ కాశ్మీర్
|
430
|
469
|
9%
|
హిమాచల్ ప్రదేశ్
|
672
|
802
|
19%
|
పంజాబ్
|
1,669
|
2,265
|
36%
|
చండీగఢ్
|
175
|
210
|
20%
|
ఉత్తరాఖండ్
|
1,280
|
1,601
|
25%
|
హర్యానా
|
6,769
|
9,732
|
44%
|
ఢిల్లీ
|
4,566
|
5,347
|
17%
|
రాజస్థాన్
|
3,618
|
4,682
|
29%
|
ఉత్తర ప్రదేశ్
|
7,254
|
8,973
|
24%
|
బీహార్
|
1,317
|
1,388
|
5%
|
సిక్కిం
|
209
|
234
|
12%
|
అరుణాచల్ ప్రదేశ్
|
62
|
92
|
48%
|
నాగాలాండ్
|
34
|
67
|
99%
|
మణిపూర్
|
50
|
40
|
-21%
|
మిజోరాం
|
24
|
33
|
37%
|
త్రిపుర
|
60
|
83
|
39%
|
మేఘాలయ
|
162
|
163
|
1%
|
అస్సాం
|
1,080
|
1,232
|
14%
|
పశ్చిమ బెంగాల్
|
4,371
|
4,915
|
12%
|
ఝార్ఖండ్
|
2,551
|
2,633
|
3%
|
ఒడిశా
|
4,162
|
4,295
|
3%
|
ఛత్తీస్గఢ్
|
2,448
|
2,936
|
20%
|
మధ్యప్రదేశ్
|
2,890
|
3,646
|
26%
|
గుజరాత్
|
9,333
|
10,853
|
16%
|
దాద్రా నగర్ హవేలీ, దామన్ & దయ్యు
|
305
|
333
|
9%
|
మహారాష్ట్ర
|
21,611
|
25,585
|
18%
|
కర్ణాటక
|
10,238
|
11,970
|
17%
|
గోవా
|
447
|
503
|
12%
|
లక్షద్వీప్
|
0
|
0
|
-15%
|
కేరళ
|
2,094
|
2,515
|
20%
|
తమిళనాడు
|
8,551
|
10,255
|
20%
|
పుదుచ్చేరి
|
209
|
228
|
9%
|
అండమాన్ నికోబార్ దీవులు
|
23
|
31
|
37%
|
తెలంగాణ
|
4,228
|
4,986
|
18%
|
ఆంధ్రప్రదేశ్
|
3,134
|
4,093
|
31%
|
లడఖ్
|
50
|
62
|
25%
|
ఇతర ప్రాంతం
|
184
|
222
|
21%
|
కేంద్ర పరిథి
|
154
|
223
|
45%
|
మొత్తం
|
1,06,416
|
1,27,695
|
20%
|
***
(Release ID: 1981796)
Visitor Counter : 176