రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దియోఘర్ ఎయిమ్స్ లో 10,000వ జన ఔషధి కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి


దేశంలో జన ఔషధి కేంద్రాల సంఖ్యను 10,000 నుంచి 25,000కు పెంచేందుకు రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి

వచ్చే మూడేళ్లలో మహిళా స్వయం సహాయక సంఘాలకు 15,000 డ్రోన్లు పంపిణీ చేయడానికి 'డ్రోన్ దీదీ' కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని

డియోఘర్ లోని రామల్దిహ్ గ్రామాన్ని సందర్శించి పంట పొలంలో డ్రోన్ ద్వారా నానో యూరియా పిచికారి ప్రత్యక్ష ప్రదర్శన ను వీక్షించిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

Posted On: 30 NOV 2023 5:35PM by PIB Hyderabad

 దేవ్ ఘర్ లోని ఎయిమ్స్ లో 10,000 వ జన ఔషధి కేంద్రాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు  ప్రారంభించారు. దేశంలో జన ఔషధీ కేంద్రాల సంఖ్యను 10 వేల నుంచి 25 వేలకు పెంచడానికి అమలు చేయనున్న ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా   ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి  ప్రారంభించారు. విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

10,000వ జన్ ఔషధి కేంద్రాన్ని జాతికి అంకితం చేయడానికి  డియోఘర్‌లోని ఎయిమ్స్ లో ఏర్పాటైన కార్యక్రమంలో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ  మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. లబ్ధిదారులతో డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడారు.  పంట పొలంలో డ్రోన్ ద్వారా ఇఫ్కో  నానో యూరియా స్ప్రే  ప్రత్యక్ష డ్రోన్ ప్రదర్శనను డాక్టర్ మన్సుఖ్ మాండవియా  డియోఘర్‌లోని రామల్దిహ్ గ్రామంలో చూసారు. 

 ఆరోగ్యకరమైన భారతదేశం నిర్మాణం తక్కువ ఖర్చుతో సులభంగా ఆరోగ్య సంరక్షణ ను  అందుబాటులోకి తీసుకు రావడానికి  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ఒక ముఖ్య కార్యక్రమంగా జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. ప్రజలకు  అందుబాటు ధరల్లో మందులు అందుబాటులోకి తెచ్చేందుకు జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

దేశం వివిధ ప్రాంతాలలో  జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు  చేయడానికి దేశంలో 2000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దేశంలో ప్రతి ప్రాంతంలో జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు అయ్యేలా చూసేందుకు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, వ్యక్తిగత నిర్వహణలో ఏర్పాటు అవుతున్నాయి. తాజాగా ఈ క్రింది నాలుగు ప్రాంతాల్లో జన ఔషధి కేంద్రాలు ప్రారంభమయ్యాయి. 

i. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, డియోఘర్, రాంపూర్, జార్ఖండ్

ii. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి ప్రధాన రహదారిలో ఉన్న వత్సవాయి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం 

iii. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్  1 నిర్మల ప్లాజా, A బ్లాక్, 1A ఫారెస్ట్ పార్క్ లో జన్ ఔషధీ కేంద్రం

iv. మహారాష్ట్ర కొల్లాపూర్ జిల్లా పల్హానా బ్లాక్ లో బల్ భీమ్ వద్ద జన్ ఔషధీ కేంద్రం

వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన కార్యక్రమంలోజన్ ఔషధీ లబ్ధిదారులతో  ప్రధానమంత్రి  మాట్లాడారు. జన్ ఔషధీ కేంద్ర యజమాని శ్రీమతి రుచి కుమారి, జన్ ఔషధీ కేంద్ర వినియోగదారుడు శ్రీ  సోనా చంద్ మిశ్రాతో ప్రధానమంత్రి మాట్లాడారు. జన్ ఔషధీ మందుల వల్ల కలిగే ప్రయోజనాలను, ప్రజలకు తగ్గే ఖర్చు పై వీరిద్దరూ తమ అభిప్రాయాలను ప్రధానమంత్రికి తెలిపారు. 

2024 మార్చి  నాటికి జన్ ఔషధీ కేంద్రాల సంఖ్యను 10,000కు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, లక్ష్యం కంటే ముందే 10,000 జనౌషధి కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించింది. గత 9 సంవత్సరాల కాలంలో కేంద్రాల సంఖ్య 100 రెట్లు పెరిగింది.  2014లో 80 జన్ ఔషధీ కేంద్రాలు మాత్రమే ఉండేవి.  ఇప్పుడు దేశంలో దాదాపు అన్ని జిల్లాల్లో  దాదాపు 10000 కేంద్రాలు పనిచేస్తున్నాయి.  2023 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా 25,000 ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు (PMBJK) ఏర్పాటు చేస్తామని  ప్రకటించారు.సౌకర్యాన్ని మరింత విస్తరించి దేశంలో అన్ని ప్రాంతాల్లో 2026 మార్చి నాటికి   25,000 ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు (PMBJK) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. 

ఆరోగ్య సంరక్షణ సౌలభ్యం, వ్యవసాయ శ్రేయస్సు రెండింటినీ పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జనౌషధి కేంద్రాల సహకారంతో  సమాజ శ్రేయస్సు కోసం సమగ్ర విధానాన్ని అమలు చేయడానికి రంగం సిద్ధమయ్యింది.ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో ఏర్పాటు అయ్యే   జనౌషధి కేంద్రాలు విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమంలో ఆరోగ్య సంరక్షణ పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.. 

నాణ్యమైన జనరిక్ ఔషధాలను అందరికీ అందుబాటు ధరల్లో అందుబాటులో ఉంచాలని లక్ష్యంతో  ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన (PMBJP)ని కేంద్ర ఫార్మాస్యూటికల్స్ శాఖ, రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ   ప్రారంభించింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఇప్పటికే 9900 కు పైగా   జన ఔషధి కేంద్రాలు పనిచేస్తున్నాయి.  ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన కింద  బాస్కెట్‌లో 1963 మందులు, అన్ని ప్రధాన చికిత్సలకు అవసరమయ్యే  293 శస్త్రచికిత్స పరికరాలు అందుబాటులో ఉన్నాయి. 

 

***


(Release ID: 1981395) Visitor Counter : 151


Read this release in: English , Urdu , Hindi , Tamil