ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రియల్ ఎస్టేట్ రంగంలో ఎంఎస్‌టీసీ అగ్రిగేటర్‌గా మారడానికి సాధ్యాసాధ్యాలను అన్వేషించాలి మరియు దేశంలోని ప్రతి రియల్-ఎస్టేట్ ఆస్తికి ఒక గుర్తింపును అందించాలి: శ్రీ.నాగేంద్ర నాథ్ సిన్హా


ఎంఎస్‌టీసీ కార్యకలాపాలకు విలువను జోడించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మరియు బ్లాక్‌చెయిన్‌లను ఏకీకృతం చేయడానికి ఇది సమయం: ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి

ఎంఎస్‌టీసీ ద్వారా ప్రాపర్టీ ఇ-వేలం మరియు టిక్కెట్ రైజింగ్ సిస్టమ్ ఎంఎస్‌టీసీ వెబ్‌పేజీ రూపంలో కస్టమర్ ఫోకస్డ్ సేవలు

Posted On: 30 NOV 2023 7:33PM by PIB Hyderabad

ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ.నాగేంద్ర నాథ్ సిన్హా ఈరోజు న్యూఢిల్లీలో రియల్ ఎస్టేట్ సినర్జీ: ఇ-కామర్స్ ద్వారా అవకాశాలను ఆవిష్కరించడంపై జరిగిన సిఐఐ-ఎంఎస్‌టీసీ  కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ఎంఎస్‌టిసి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోని అందరికి అగ్రిగేటర్‌గా మారడానికి మరియు దేశంలోని ప్రతి రియల్-ఎస్టేట్ ఆస్తికి గుర్తింపును అందించడానికి సాధ్యాసాధ్యాలను అన్వేషించాలి” అని తెలిపారు.
 

image.png

 

రియల్ ఎస్టేట్‌లో ల్యాండ్-సర్వేయర్‌ల నుండి ప్రారంభించి భూమి మరియు ఇతర వ్యాపారులకు విలువ ఇచ్చే వారి నుండి స్థానిక ఇంటెలిజెన్స్ కలిగి ఉన్న బ్రోకర్ల వరకు అందరు వాటాదారుల పూర్తి ఏకీకరణను ఎంఎస్‌టీసీ చేయగలదా అని కూడా చూడాలి. అనేక సార్లు తనను తాను ఆవిష్కరించుకున్న పిఎస్‌యు దేశంలోని ప్రతి రియల్ ఎస్టేట్ ఆస్తులను జియో-లొకేటింగ్ చేయడం ద్వారా వాటికి గుర్తింపునిచ్చే వేదికగా మారగలదా అని కూడా చూడాలి” అని శ్రీ సిన్హా అన్నారు. ఎంఎస్‌టీసీ కార్యకలాపాలకు విలువను జోడించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మరియు బ్లాక్-చెయిన్‌లను ఏకీకృతం చేయడానికి ఇది సమయం అని కూడా తెలిపారు.

ఆస్తి ఇ-వేలం మరియు టిక్కెట్ రైజింగ్ సిస్టమ్

కాన్ఫరెన్స్ ప్రారంభ సెషన్‌లో భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎంఎస్‌టీసీకు చెందిన ఎంఎస్‌టీసీ ఆస్తి ఇ-వేలం వెబ్‌పేజీ మరియు టిక్కెట్ రైజింగ్ సిస్టమ్‌ అనే రెండు ప్రత్యేక సేవలను ప్రారంభించారు.

 

image.png


ఎంఎస్‌టీసీ ప్రాపర్టీ ఇ-వేలం వెబ్‌పేజీ నుండి కొనుగోలుదారులు మరియు విక్రేతలు ఎంఎస్‌టీసీ ద్వారా నిర్వహించబడుతున్న అన్ని షెడ్యూల్డ్ మరియు రాబోయే వేలాన్ని తనిఖీ చేయవచ్చు. తద్వారా ఇది మార్కెట్‌ప్లేస్‌ను అందించడం మరియు వ్యాపార సౌలభ్యాన్ని నిర్ధారిస్తుంది. టిక్కెట్ రైజింగ్ సిస్టమ్ కింద కొనుగోలుదారుల కోణం నుండి ఉత్పన్నమయ్యే ప్రశ్నలను వినియోగదాలు తెలపవచ్చు. ఈ వ్యవస్థను ప్రారంభించడం ద్వారా అటువంటి ప్రశ్నలన్నింటినీ నిర్మాణాత్మక పద్ధతిలో పరిష్కరించాలని ఎంఎస్‌టీసీ యోచిస్తోంది.

ఈ సందర్భంగా ఎంఎస్‌టీసీ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సురీందర్ కుమార్ గుప్తా మాట్లాడుతూ ఎంఎస్‌టీసీ గత మూడున్నరేళ్లలో ₹4 వేల 268 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించిందని, అదే సమయంలో ₹24 వేల 459 కోట్ల విలువైన నిరర్థక ఆస్తులను వేలం వేసిందని పేర్కొన్నారు. "మేము ప్రాథమికంగా బి2బి కంపెనీగా ఉన్నాము. కానీ బ్యాంకింగ్ రంగంలో మేము వ్యక్తిగత వినియోగదారులకు విక్రయించడం ప్రారంభించాము తద్వారా బి2సీ కేటగిరీలోకి ప్రవేశించాము" అని శ్రీ గుప్తా తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఎంఎస్‌టీసీ యొక్క తదుపరి పెద్ద కదలికలను ప్లాన్ చేయడానికి సీఐఐ మరియు ప్రైవేట్ రంగంతో భాగస్వామ్యాన్ని ఆయన కోరారు.

“ప్రభుత్వ ప్లాట్‌ఫారమ్‌గా ఎంఎస్‌టీసీ తన ఇ-వేలం ప్లాట్‌ఫారమ్‌లో ఆస్తులను విక్రయించే విధానంలో దాని సేవలకు న్యాయమైన మరియు పారదర్శకతను తీసుకురావడానికి అనుబంధంగా ఉంది. రెసిడెన్షియల్ యూనిట్లు, ఆఫీస్ స్పేస్‌లు, రిటైల్ స్పేస్‌లు, మాల్స్ మరియు ఇతర మార్కెట్‌ప్లేస్‌లలో రిటైల్ లీజింగ్ సర్వీస్‌లలో విపరీతమైన డిమాండ్ పెరగడాన్ని మేము గమనిస్తున్నాము. మరియు ఎంఎస్‌టీసీ తన ప్లాట్‌ఫారమ్‌లో కొనుగోలుదారులు మరియు అమ్మకందారులను కనెక్ట్ చేయడం ద్వారా ఈ ఇ-కామర్స్ సేవలను అందించడానికి ఒక గొప్ప వేదిక అవుతుంది” అని  సీఐఐ ఢిల్లీ సబ్‌కమిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రియల్-ఎస్టేట్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ మరియు యూనిటీ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు,  చైర్మన్ అయిన శ్రీ హర్ష్ వర్ధన్ బన్సాల్ తెలిపారు.

 

***


(Release ID: 1981381) Visitor Counter : 87


Read this release in: English , Urdu , Hindi