ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రభుత్వ విభాగాల లో మరియు సంస్థల లో క్రొత్త గా ఉద్యోగాల లో నియమించిన వ్యక్తుల కు 51,000 కు పైగా నియామక లేఖల ను  రోజ్ గార్ మేళా లో భాగంగా  నవంబరు 30 వ తేదీ నాడుపంపిణీ చేయనున్న  ప్రధాన మంత్రి


ఉద్యోగాల కల్పన కు అత్యున్నత ప్రాధాన్యాన్ని ఇవ్వాలన్నప్రధానమంత్రి యొక్క వచన బద్ధత ను నెరవేర్చే దిశ లో ఒక అడుగు గా ‘రోజ్ గార్ మేళా’ ఉంది

క్రొత్త గా ఉద్యోగాలలో నియామకం జరిగిన వారు అభి వృద్ధి చెందినభారతదేశం తాలూకు ప్రధాన మంత్రి దృష్టికోణాన్ని సాకారం చేయడం లో తోడ్పడనున్నారు

క్రొత్త గా ఉద్యోగాల లో నియామకం జరిగిన వారు ‘కర్మయోగి ప్రారంభ్’ అనే ఆన్ లైన్ మాడ్యూల్  ద్వారా వారంతట వారు శిక్షణను కూడా పొందనున్నారు

Posted On: 28 NOV 2023 5:03PM by PIB Hyderabad

ఉద్యోగాల లో క్రొత్త గా నియమించిన వారికి సంబంధించిన 51,000 కు పైచిలుకు నియామక లేఖల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 నవంబరు 30 వ తేదీ నాడు సాయంత్రం పూట నాలుగు గంటల కు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా పంపిణీ చేయనున్నారు. ఉద్యోగ నియామకం జరిగిన వ్యక్తుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ప్రసంగించనున్నారు.

 

 

రోజ్ గార్ మేళా ను దేశ వ్యాప్తం గా 37 ప్రాంతాల లో నిర్వహించడం జరుగుతుంది. వివిధ కేంద్ర ప్రభుత్వాల విభాగాల తో పాటు ఈ కార్యక్రమానికి సమర్థన ను అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల లో/కేంద్రపాలిత ప్రాంతాల లో ఈ నియామకాలు చోటు చేసుకొంటున్నాయి. దేశ వ్యాప్తం గా ఎంపిక చేసి క్రొత్త గా ఉద్యోగం లో నియమించినటువంటి వారు ప్రభుత్వం లోని ఆదాయ విభాగం, దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్య విభాగం, పాఠశాల విద్య మరియు అక్షరాస్యత ల విభాగం, ఆర్థిక సేవ ల విభాగం, రక్షణ మంత్రిత్వ శాఖ, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ లతో పాలు గా శ్రమ మరియు ఉద్యోగం మంత్రిత్వ శాఖ తదితర వివిధ మంత్రిత్వ శాఖల లో /విభాగాల లో చేరనున్నారు.

 

 

ఉద్యోగాల కల్పన కు అత్యున్నత ప్రాధాన్యాన్ని ఇచ్చే విషయం లో ప్రధాన మంత్రి యొక్క వచన బద్ధత ను నెరవేర్చే దిశ లో ఒక అడుగు గా రోజ్ గార్ మేళా ఉందని చెప్పాలి. ఉద్యోగాల కల్పన ను పెంపొందింప జేయడం లో ఒక ఉత్ప్రేరకం వలె రోజ్ గార్ మేళా పనిచేయగలదన్న భావన ఉంది. అంతేకాక యువతీ యువకుల సశక్తీకరణ తో పాటు గా దేశాభివృద్ధి లో పాలుపంచుకోవడం లో సార్థకం కాగల అవకాశాల ను కూడా వారికి ఈ రోజ్ గార్ మేళా అందిస్తుందన్న భావన సైతం ఉంది.

 

 

క్రొత్తగా నియామకం జరిగిన వారు వారి యొక్క వినూత్నమైనటువంటి ఆలోచనలు మరియు వారి యొక్క నిర్దిష్ట విధి సంబంధి సామ్థ్యాల తో ఇతర అంశాల కు తోడు, దేశం పారిశ్రమికం గా, ఆర్థిక పరం గా మరియు సామాజిక పరం గా అభివృద్ధి చెందడాన్ని బలపరచే బాధ్యత లో ఊతాన్ని అందిస్తూ తద్ద్వారా అభివృద్ధి చెందిన భారతదేశం (‘వికసిత్ భారత్’) సాధన కు సంబంధించిన ప్రధాన మంత్రి దృష్టికోణం సాకారం కావడం లో వారి వంతు తోడ్పాటు ను కూడా అందించనున్నారు.

 

 

క్రొత్త గా ఉద్యోగాల లో నియామకం జరిగిన వారు ఐజిఒటి కర్మయోగి పోర్టల్ ( iGOT Karmayogi portal ) కు చెందిన ఒక ఆన్ లైన్ మాడ్యూల్ అయినటువంటి కర్మయోగి ప్రారంభ్ద్వారా వారంతట వారు గా శిక్షణ ను పొందే అవకాశాన్ని కూడా దక్కించుకోనున్నారు. 800 కు పైగా ఇ-లర్నింగ్ పాఠ్యక్రమాల ను ఐజిఒటి కర్మయోగి పోర్టల్ ద్వారా ఎక్కడయినా ఏ డివైస్ నుండి అయినానేర్చుకొనే ఫార్మేట్ లో అందుబాటు లో కి తీసుకు రావడమైంది.

 

 

***


(Release ID: 1980719) Visitor Counter : 90