సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

సీజీటీఎంఎస్ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది, 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేవలం 7 నెలల్లో 1 లక్ష కోట్లు రూపాయల క్రెడిట్ గ్యారెంటీని ఆమోదించింది - కేంద్ర మంత్రి శ్రీ నారాయణ్ రాణే

Posted On: 24 NOV 2023 6:53PM by PIB Hyderabad

మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) సెక్టార్‌కు ఒక పెద్ద ఊపు ఇవ్వడంలో భాగంగా  మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ( సీజీటీఎంఎస్ఈ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో కేవలం 7 నెలల్లో 1 లక్ష కోట్ల రూపాయల క్రెడిట్ గ్యారంటీని ఆమోదించింది . మునుపటి ఆర్థిక సంవత్సరం 2022-23 లో, 12 నెలల్లో ఇదే సాధించడం జరిగింది. 
 

ఎక్స్‌లో సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ విషయాన్ని ప్రకటిస్తూ, కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ నారాయణ్ రాణే,  సీజీటీఎంఎస్ఈ అద్భుతమైన విజయానికి గర్వాంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఎంఎస్‌ఎంఈలను ఆదుకోవడంతో పాటు వారికి అందుబాటు ధరలో రుణాలు అందించడంలో ప్రభుత్వం చూపుతున్న తిరుగులేని నిబద్ధతకు ఈ ఘనతకు  నిదర్శనమని ఆయన అన్నారు.

ఎంఎస్‌ఎంఈలకు, ప్రత్యేకించి అనధికారిక రంగంలోని వారికి క్రెడిట్ ప్రవాహాన్ని సులభతరం చేయడంలో  సీజీటీఎంఎస్ఈ కీలక పాత్ర పోషిస్తోంది. క్రెడిట్ గ్యారెంటీ ఆమోదాల వేగవంతమైన వేగం  ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక సహాయాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం చురుకైన చర్యలను ప్రతిబింబిస్తుంది, తద్వారా దేశంఆర్థిక అభివృద్ధికి వారి సహకారాన్ని పెంచుతుంది.

సీజీటీఎంఎస్ఈ  అద్భుత విజయానికి గౌరవనీయు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తిరుగులేని మద్దతు, దూరదృష్టి గల నాయకత్వమే కారణమని శ్రీ రాణే పేర్కొన్నారు. ఈ మైలురాయిని సాధించడంలో ప్రధాని వ్యూహాత్మక మార్గదర్శకత్వం, ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేయడంలో అంకితభావం కీలక పాత్ర పోషించాయి.

సీజీటీఎంఎస్ఈ మొత్తం బృందాన్ని కూడా అభినందించారు.  కేవలం 7 నెలల్లోనే 1 లక్ష కోట్ల రూపాయల క్రెడిట్ గ్యారెంటీని ఆమోదించిన ఘనత సాధించిందని పేర్కొన్నారు. .   సీజీటీఎంఎస్ఈ, ఎంఎస్ఎంఈ రంగానికి ఇది ఒక ముఖ్యమైన మైలురాయి.

 

*****


(Release ID: 1979881) Visitor Counter : 77


Read this release in: English , Urdu , Hindi , Marathi