ఆర్థిక మంత్రిత్వ శాఖ

వనరుల పంపిణీపై అవగాహన ఒప్పందం (ఎంఓయు) పై సంతకాలు చేసిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు,నార్కోటిక్స్ (ఎన్ఎసిఐఎన్), నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (ఎన్ఎడిటి)

Posted On: 24 NOV 2023 4:21PM by PIB Hyderabad

ఉత్తమ పద్ధతులు, నిపుణుల ఫ్యాకల్టీ, ట్రైనింగ్ మెటీరియల్, ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ వంటి వనరులను పంచుకోవడానికి ఉద్దేశించిన అవగాహన ఒప్పందం(ఎంఒయు) పై నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ (ఎన్ఏసీఐఎన్), నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (ఎన్ఏడీటీ) సంతకాలు చేశాయి.

ఈ అవగాహన ఒప్పందంపై ఎన్ ఎ డి టి (ట్రైనింగ్) ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ జయంత్ దిడ్డి, నాసిన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కె ఎన్ రాఘవన్,  మెంబర్ అడ్మినిస్ట్రేషన్ సిబిడిటి శ్రీ రవి అగర్వాల్, మెంబర్ (అడ్మినిస్ట్రేషన్ అండ్ విజిలెన్స్) సి బి ఐ సి శ్రీ అలోక్ శుక్లా, నాసిన్ ఎడిజి , శ్రీ రమేష్ చందర్ , రెండు అకాడమీలకు చెందిన ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.

ఉత్తమ పద్ధతులు, నిపుణులైన అధ్యాపకులు, శిక్షణా సామగ్రి , సృజనాత్మక సాంకేతికతలు వంటి వనరులను పంచుకోవడంలో సహకారం విలువను ఎన్ ఎ సి ఐ ఎన్ , ఎన్ ఎ డి పరస్పరం గుర్తిస్తాయి. పన్నులు, చట్టం,  lన్యాయ వ్యవస్థలు, వాణిజ్య ,విధానపరమైన చట్టాలు, ఆర్థిక , పరిపాలనా చట్టం, సహకార ప్రయత్నాలు, డేటా విశ్లేషణ, డార్క్ వెబ్ ఎక్స్ ప్లోరేషన్ , రిస్క్ మేనేజ్ మెంట్ , నైతికత వంటి అత్యాధునిక ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ లో వనరులు,  బోధనలతో సహా భాగస్వామ్య ప్రయోజనాల రంగాలపై ఈ సహకారం దృష్టి సారించింది.

సిబిఐసి , సిబిడిటి అధికారుల పరస్పర ప్రయోజనం కోసం వనరులు , ఉత్తమ పద్ధతులను పంచుకోవడంలో సహకారాన్ని ఏర్పరచడానికి ఈ ఎమ్ఒయు రెండు కేంద్ర శిక్షణా సంస్థలకు వీలు కల్పిస్తుంది. ఆఫీసర్ ట్రైనీల నిర్మాణాత్మక అనుబంధంతో సహా రెండు సర్వీసుల అధికారులకు పరస్పర శిక్షణా కార్యక్రమాలను అందిస్తుంది.

కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సి బి ఐ సి), , కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సి బి డి టి) 2020 జూలైలో డేటా భాగస్వామ్యంపై అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. వాణిజ్యం విలక్షణ  స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే, రెండు సంస్థల అధికారుల మధ్య విజ్ఞాన భాగస్వామ్యం , సామర్థ్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత ఎంఒయు అధికారుల శిక్షణ అవసరాలను పెంపొందిస్తుంది.  మెరుగైన రెవెన్యూ పరిపాలన కోసం సమ్మేళనాలపై  దృష్టి పెడుతుంది.

ఎన్ ఎ సి ఐ ఎన్ గురించి

 

ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ పరోక్ష పన్నులు) ఆఫీసర్ ట్రైనీలకు శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటయిన అత్యున్నత శిక్షణా సంస్థ ఎన్ఎసిఎన్, కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సిబిఐసి) కింద అధికారులు కేడర్లందరికీ సేవా శిక్షణను అందిస్తుంది. పాలసముద్రంలో నాసిన్ కొత్త క్యాంపస్ త్వరలో ప్రారంభం కానుంది. భాగస్వామ్య దేశాలతో శిక్షణ , ఇతర సామర్థ్య పెంపు వనరుల మార్పిడి ద్వారా కస్టమ్స్, డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ , ఇతర పరోక్ష పన్ను సంబంధిత అంశాలలో అంతర్జాతీయ సామర్థ్య పెంపునకు నాసిన్ ఎంతో దోహదం చేస్తోంది.

ఎన్ ఎ డి టి గురించి

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సిబిడిటి)  మిడిల్ నుండి సీనియర్ మేనేజ్మెంట్ స్థాయి అధికారులకు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఆదాయపు పన్ను) ఆఫీసర్ ట్రైనీలకు అనేక ఇన్-సర్వీస్ కోర్సులలో శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటయిన అత్యున్నత శిక్షణా సంస్థ ఎన్ఎడిటి , నాగపూర్

 

****



(Release ID: 1979870) Visitor Counter : 61