సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ప్రాంతీయ చిత్రాలకు ప్రత్యేక దినాలు: భారతీయ అద్భుత వైవిధ్యానికి ఇఫి (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా)గౌరవం.
అందరినీ అలరించిన దేశ తూర్పు ప్రాంత చిత్రాలు
దక్షిణాది చిత్రాలు పొన్నియనల్ సెల్వన్ 2, కథాల్కూ ఇఫి ప్రదర్శనలో స్థానం.
54 వభారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐ.ఎఫ్.ఎఫ్.ఐ) కేవలం అంతర్జాతీయ సినిమా ప్రతిభను ప్రదర్శింపచేసే వేదిక మాత్రమే కాదు,
మన దేశంలోని వివిధ ప్రాంతాల చలనచిత్రాల వైవిధ్యతను పట్టి చూపే గొప్ప ఉత్సవం కూడా.
ప్రాంతీయ సినిమాలను గౌరవించే గొప్ప సంప్రదాయం గల ఇఫి చిత్రోత్సవంలో ప్రస్తుతం గోవాలో జరుగుతున్న 54వ చిత్రోత్సవంలో
కొన్ని రోజులను భారతదేశంలోని వివిధ భాషలకు చెందిన చలన చిత్రాలను ప్రదర్శించేందుకు కేటాయించారు.
ఈనెల 22 వ తేదీ నుంచి దేశ ప్రాంతీయ చలన చిత్రాల ప్రదర్శన ప్రారంభమైంది. ముందుగా దేశ తూర్పు ప్రాంతం నుంచి
ఇండియన్ పనోరమా సెక్షన్ లో చిత్రాల ప్రదర్శన ప్రారంభమైంది. బెంగాలి, ఒడియా, అస్సామీస్, మణిపురి, ఇతర
ఈశాన్య ప్రాంతాల మాండలికాలకు చెందిన చిత్రాలు ఇందులో ముఖ్యపాత్ర వహించాయి. ఉత్పల్ బోర్పుజారి దర్శకత్వం వహించిన,
అస్సామీ చిత్రం బరౌర్ క్జాంగర్ , షిల్పికా బార్డోలి దర్శకత్వం వహించిన ,మిజో చిత్రం మావ్: ది స్పిరిట్ డ్రీమ్స్ ఆఫ్ చెరా,
హిమాంశు శేఖర్ ఖటావ్ దర్శకత్వం వహించిన ఒడియా చిత్రం , ద సీ అండ్ సెవన్ విలేజెస్, కౌశిక్ గంగూలీ దర్శకత్వం వహించిన బెంగాలీ చిత్రం అర్ధాంగిని, వంటి కొన్ని చిత్రాలు
ఈనెల 22వ తేదీన ఇఫి చలనచిత్రోత్సవంలోని వివిధ ప్రాంగణాలలో ప్రదర్శనకు నోచుకున్నాయి.
ఈ చలనచిత్రోత్సవంలో దేశవ్యాప్తంగా గల వివిధ ప్రాంతాల చిత్రాలను ప్రదర్శించనున్నారు. అందులో
నవంబర్ 23న సౌత్ –1 కింద, తమిళం, మళయాళం చిత్రాలు
నవంబర్ 24న ఉత్తరాదికి సంబంధించి, పంజాబ్, డోగ్రి, భోజ్పురి, రాజస్థాని, ఉర్దు, చత్తీస్ఘరి చిత్రాలు
నవంబర్ 25న పశ్చిమ ప్రాంతానికి సంబంధించి : కొంకణి, మరాఠి, గుజరాతి చిత్రాలు.
నవంబర్ 26న దక్షిణాది 2 కు సంబంధించి : కన్నడ, తెలుగు చిత్రాలు ప్దదర్శిస్తారు.
తమిళచిత్రం పొన్నియిన్ సెల్వన్ –2కు ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించగా, అవార్డ్లు పొందిన దర్శకుడు జియో బేబీ దర్శకత్వం వహించిన మళయాళం చిత్రం కాథాల్ను భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో 23న ప్రదర్శిస్తారు. దీనిని కల్కి కృష్ణమూర్తి ఇదే పేరుతో రాసిన నవల ఆధారంగాదీనిని రూపొందించారు.పొన్నియన్ సెల్వన్ చోళ రాజ్యానికి చెందిన యువరాజు ఆదిత్య కరికాళన్ కు పేద అనాథ, దేవదాసి నందినికిమధ్య నడిచిన విషాదాంత ప్రేమకథాచిత్రాన్ని తెరకెక్కించారు. వీరి మధ్యచిన్ననాటి నుంచి సాగిన ప్రేమ రాజరికం కారణంగా దూరం అవుతుంది. యువ నందినిని , కరికాలన్ కు దూరం చేసేందుకు ఆమెను ఆ రాజ్యం నుంచి దూరంగా పంపించేస్తారు.అప్పటినుంచి కరికాలన్ పిచ్చివాడిగా మారిపోతాడు. ఆ తరువాతి కథలో చక్రవర్తి సుందర చోళర్కు వ్యతిరేకంగా కుట్రపన్నుతుంది.పాండ్యరాజు వీరపాండ్యన్ను చంపినందుకు ఆమె ఈ రకంగా ప్రతీకారానికి సిద్ధమవుతుంది. చోళ రాజ్య కోశాధిపతి పెరియ పజువెట్టరాయర్ను వివాహం చేసుకుని ఆమె చోళరాజ్యంలోకి అడుగుపెడుతుంది. ఇక ఆ తర్వాత వారసత్వం కోసం చారిత్రక , రాచరిక , రాజకీయ అధికార పోరు, ప్రతీకారం, ప్రేమ, చోళ రాజ్యం నిలబడడం వంటి ఎన్నో అంశాలు ఇందులో పొందుపరిచారు.
కాథల్– ప్రముఖ మలయాళం నటుడు మమ్ముట్టి, స్వలింగసంపర్కుల పట్ల ఎలాంటి ఆలోచనాధోరణితో ఉంటుందో తెరకెక్కించారు. ఈ చిత్రంలో కథానాయకుడు జార్జి దేవస్సి, సహకార బ్యాంకులో ముఖ్య ఉద్యోగి. అతను తన భార్య ఒమానాతోకలిసిఉంటున్నాడు. అతని కుమార్తె ఫెమి. జార్జి తండ్రి దేవస్సి. ఒక రోజు ఆదివారం ఉదయం,ప్రార్థనలు ముగిసిన తర్వాత,జార్జి ముందుముందు జరగనున్న పంచాయతీ ఎన్నికలలో పోటీచేయాలనుకుంటారు. అందుకు నామినేషన్ పత్రాలు సిద్ధం చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే,రెండు రోజుల తర్వాత అతని భార్య ఒమానా కుటుంబ న్యాయస్థానంలో విడాకుల పిటిషన్ వేస్తూ, జార్జి స్వలింగసంపర్కుడని, తంకన్తో గత కొద్ది సంవత్సరాలుగా సంబంధం కొనసాగిస్తున్నాడని పిటిషన్ లో పేర్కొంది.తంకన్ అదే గ్రామంలో డ్రైవింగ్ స్కూలు నడుపుతున్నాడు. జార్జికి స్నేహితుడు.ఈ కథ కుటుంబంలో, సమాజంలో జరుగుతున్న వివిధ సంఘటనలను,ప్రస్తావిస్తుంది.
ఇఫి 2023, ఈ చిత్రప్రదర్శనను సందర్శించి అద్భుత భారతీయ చిత్రాలను వీక్షించాల్సిందిగా పిలుపునిచ్చింది.
మరిన్ని వివరాలకు https://iffigoa.org/
***
(Release ID: 1979375)