భారత పోటీ ప్రోత్సాహక సంఘం
కేరట్‌లేన్‌లో అదనపు వాటా కొనుగోలు చేసేందుకు టైటన్‌కు సీసీఐ ఆమోదం
प्रविष्टि तिथि:
21 NOV 2023 7:49PM by PIB Hyderabad
కేరట్‌లేన్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో (కేరెట్‌లేన్) అదనపు వాటాను కొనుగోలు చేయడానికి టైటన్ కంపెనీ లిమిటెడ్‌కు (టైటన్) 'కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా' (సీసీఐ) ఈ రోజు ఆమోదం తెలిపింది.
కేరట్‌లేన్ అనేది టైటన్ అనుబంధ సంస్థ. ప్రస్తుత ప్రతిపాదన ద్వారా, మిథున్ పదం సచేతి, సిద్ధార్థ పదం సచేతి, పదంచంద్ సచేతి నుంచి కేరట్‌లేన్‌లో 27.18% వాటాను టైటన్ కొనుగోలు చేస్తుంది.
టైటన్ ఒక పబ్లిక్ నమోదిత సంస్థ. నగలు, కళ్లద్దాలు, సెంట్లు, ఫ్యాషన్ ఉపకరణాలు, భారతీయ దుస్తులు వంటి జీవనశైలి బ్రాండ్స్‌తో వ్యాపారాలు చేస్తోంది.
టైటన్ అనుబంధ సంస్థ అయిన కేరట్‌లేన్, మన దేశంలో రత్నాలు, ఆభరణాల తయారీ, విక్రయాల వ్యాపారం చేస్తోంది. ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.
సీసీఐ నుంచి వరణాత్మక ఆదేశం రావలసి ఉంది.
***
(रिलीज़ आईडी: 1978924)
आगंतुक पटल : 107