శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

భారతదేశంలో విమాన ప్రయాణం ఇక ఎంత మాత్రం సంపన్నుల విలాసయానం కాదన్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్.


ఏరో నాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఎ.ఇజెస్.ఐ) 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన
కార్యక్రమంలో మాట్లాడుతూ డాక్టర్ జితేంద్ర సింగ్,, విమాన ప్రయాణం సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే చెందుతుందన్నారు.

ఉడాన్ (ఉదే దేశ్ కా ఆమ్ నాగరిక్), విమానాశ్రయాలను రెట్టింపు చేయడం, తక్కువ ధరకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తేవడం వంటి దార్శనిక చర్యల ద్వారా

సామాన్యుడకి విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయన్న కేంద్ర మంత్రి.

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి మానవ సహిత మిషన్ గగన్ యాన్ ప్రయోగం 2025లో జరుగుతుందన్న మంత్రి.

2035 నాటికి ఇండియాకు స్వంత అంతరిక్ష కేంద్రం అందుబాటులోకి వస్తుందని, 2040 లో భారతీయుడు చంద్రుడిపై కాలుమోపుతాడని తెలిపిన మంత్రి.

‘‘2047 లో ఎయిరో స్పేస్ , ఏవియేషన్ ” పేరుతో నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్ , ఇండియా తన విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకునేందుకు,

పరస్పర సహకారానికి చూపుతున్న శ్రద్ధ, అంకిత బావానికి ఇది నిదర్శనమని చెప్పిన మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్.

Posted On: 18 NOV 2023 3:00PM by PIB Hyderabad

ఇండియాలో విమాన ప్రయాణం ఇక ఎంతమాత్రం సంపన్నులకు మాత్రమే పరిమితమైనది కాదని కేంద్ర శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాఖ సహాయమంత్రి(స్వతంత్ర), ప్రధానమంత్రి కార్యాలయ సహాయమంత్రి, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఏయిరో నాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఎఇఎస్ఐ) 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి,
విమాన ప్రయాణాన్ని సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చిన ఘనత, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకే చెందుతుందని అన్నారు. ప్రధానమంత్రి దార్శనికత, ఉడాన్ (ఉదే దేశ్ కా ఆమ్ నాగరిక్), విమానాశ్రయాలను రెట్టింపు చేయడం,
తక్కువ ధరకు విమాన ప్రయాణం వంటి వాటి ద్వారా సామాన్యులకు విమాన ప్రయాణం అందుబాటులోకి వచ్చిందని మంత్రి అన్నారు.  హవాయి చెప్పులు ధరించిన సామాన్యుడు , హవాయీ జహాజ్ (విమానయానం) చేస్తుండడం ఇప్పుడు విమానాశ్రయాలలో కనిపిస్తున్న సాధారణ దృశ్యంగా మంత్రి అభివర్ణించారు.

సామాన్యుడికి విమానయానం అందుబాటులోకి రావడం తక్కువ ప్రయాణ చార్జీల మాత్రమే కాక, విమానాశ్రయాల సంఖ్య దాదాపు రెట్టింపు కావడం వల్ల కూడా సాధ్యమైంది. గత 9 సంవత్సరాలలో విమానాశ్రయాలు రెట్టింపు అయ్యాయి. 2014లో 75 విమానాశ్రయాలు ఉండగా ప్రస్తుతం అవి 150 కి చేరాయి.
ఏయిరో నాటికల్, అంతరిక్ష రంగాల గురించి ప్రస్తావిస్తూ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, మానవ సహిత గగన్ యాన్ ప్రయోగం 2025లో జరుగుతుందన్నారు. 2035 నాటికి ఇండియాకు స్వతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పడుతుందని,
2040 నాటికి భారతీయుడు చంద్రమండలంపై కాలు మోపుతాడని చెప్పారు.
ఎయిరో నాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఎఇఎస్ఐ) నూతన ఆవిష్కరణలకు వేదికగా ఉంటూ వస్తోంది. ఇది పరస్పర సహకారానికి, దేశంలో విమానయాన రంగ పురోభివృద్ధికి, ఇది ఎంతో దోహదం చేస్తున్నదన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 9–10 సంవత్సరాలలో ఇండియా శాస్త్ర సాంకేతిక రంగంలో , ప్రత్యేకించి, విమానయాన, గగనతల రంగంలో అద్భుత ప్రగతి సాధించిందని మంత్రి తెలిపారు. ఇది భారతదేశ అంకితభావానికి, సాధ్యమైనంత మేరకు కృషిచేయడంలో పట్టుదలకు ఇది నిదర్శనమన్నారు. 2020లో అంతరిక్ష రంగానికి తలుపులు తెరిచిన క్రమంలో ప్రస్తుతం 150 డీప్ టెక్ స్టార్టప్ లు ఈ రంగంలో పనిచేస్తున్నాయన్నారు. 2014 లో ఇలాంటివి కేవలం నాలుగైదుమాత్రమే ఉండేవని గుర్తుచేశారు. మనం భవిష్యత్ను తరచి చూసినపుడు, ఏయిరో స్పేస్ టెక్నాలజీలో ఇండియా మరింత ఉన్నత స్థాయికి ఎదగనుంది. ప్రభుత్వం ఈ విషయంలో శాస్త్రవేత్తలకు మద్దతుగా నిలుస్తున్నది. వారికి అవసరమైన వనరులు,

మౌలిక సదుపాయాలు కల్పించి పరిశోధనలను ప్రోత్సహిస్తున్నది. ఇటీవల ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం తో ఎయిరో స్పేస్ రంగ రూపురేఖలు మారిపోతున్నాయ. దేశీయంగా తయారీ, ఆవిష్కరణలు పుంజుకుంటున్నాయి అని మంత్రి తెలిపారు.
భారతీయ ఎయిరో స్పేస్ రంగం చెప్పుకోదగిన స్థాయికి చేరుకుందని అంటూ మంత్రి, ఈ రంగంలో మున్నెన్నడూ లేనంతటి విజయాలు సాధించామన్నారు.చంద్రయాన్ –3, మార్స్ ఆర్బిటర్ మిషన్, ఆదిత్య ఎల్ 1,
అలాగే రానున్న రోజులలో ఇస్రో చేపట్టనున్న గగన్యాన్, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందనున్న తేలికపాటి పోరాట యుద్ద విమానం తేజన్, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో డి.ఆర్.డి.ఒ రూపొందించే క్షిపణి వ్యవస్థ, కీలకమైనవన్నారు. వీటికి తోడు,
ప్రభుత్వరంగం,ప్రైవేటు  పరిశ్రమలు, స్టార్టప్లు, మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు,అంతర్జాతీయ వేదికలపై మన శక్తిసామర్ద్యాలను ప్రదర్విస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. సంపూర్ణ శాస్త్ర విజ్ఞానం, సంపూర్ణ ప్రభుత్వం, సంపూర్ణ సమాజం తో అంతర్జాతీయ స్థాయిలో వీటిని ముందుకు తీసుకుపోతున్నట్టు ఆయన తెలిపారు.

2047 లో ,
ఎయిరో స్పేస్ , ఏవియేషన్ పేరుతో నిర్వహిస్తున్న ఈ  ఈ అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్, మన విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడానికి, కొలాబరేషన్ల విషయంలో మనకు గల అంకిత భావానికి, పట్టుదలకు నిదర్శనమని మంత్రి తెలిపారు.
ఎఇఎస్ ఉజ్వల చరిత్రను, భారత దేశ ప్రగతికి అది చేసిన కృషిని ఉత్సవంలా జరుపుకుంటున్నామని,శాస్త్ర సాంకేతిక రంగంలో మనకు మనం మరింత అంకితమయ్యేందుకు , గొప్ప ఆలోచనలకు, వినూత్న ఆవిష్కరణలకు,
ఎయిరో స్పేస్ టెక్నాలజీ రంగంలో కలిసిపనిచేస్తూ, ఇండియాను ఈ రంగంలో నాయకత్వ స్థాయిలో నిలపడానికి ఇది దోహదం చేస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

ఈ సదస్సు , ఎగ్జిబిషన్ విజయవంతం కావాలని డాక్టర్ జితేంద్ర సింగ్ ఆకాంక్షించారు. అలాగే ఎయిరో నాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ముందు ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. మన ఉజ్వల భారతావని,
ఎయిరో స్పేస్ రంగంలో నూతన శిఖరాలు అధిరోహించాలని, ఎవరూ స్పృశించని శాస్త్ర విజ్ఞాన రంగంలో ఆవిష్కరణలతో ముందుకు పోవాలని, మన దేశశాస్త్ర విజ్ఞాన ఘన వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని డాక్టర్ జితేంద్ర ఆకాంక్షించారు.

 

***



(Release ID: 1978655) Visitor Counter : 53