మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ ఇండియా 2023 ను మంగళవారం ప్రారంభించనున్న కేంద్ర మత్స్య శాఖ మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా
రొయ్యలు, చేపల పెంపకం ద్వారా సంపద సృష్టి అంశంపై సదస్సు
రొయ్యలు, చేపల పెంపకంపై నిపుణులు, మార్కెట్ వర్గాలు, సంబంధిత వర్గాల మధ్య సదస్సులో చర్చలు
Posted On:
19 NOV 2023 2:43PM by PIB Hyderabad
అహ్మదాబాద్‌లోని గుజరాత్ సైన్స్ సిటీలో మంగళవారం నుంచి రెండు రోజుల పటు గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ ఇండియా 2023 జరుగుతుంది. కేంద్ర మత్స్య , పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పర్షోత్తం రూపాల సదస్సును ప్రారంభిస్తారు. రొయ్యలు, చేపల పెంపకం ద్వారా సంపద సృష్టి అనే అంశంపై సదస్సులో చర్చలు, సమావేశాలు జరుగుతాయి. సదస్సులో నిపుణులు, మార్కెట్ వర్గాలు, సంబంధిత వర్గాల ప్రతినిధులు పాల్గొంటారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ సహాయ శాఖ మంత్రులు డాక్టర్ ఎల్ మురుగన్ డాక్టర్ సంజీవ్ కుమార్ బల్యాన్, దాదాపు 10 దేశాలకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థలు, మత్స్యకార సంఘాలు, మత్స్యకారులు, ఇతర ప్రముఖులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు.
గుజరాత్ వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య, ఆవుల పెంపకం శాఖ మంత్రి శ్రీ. రాఘవ్‌జీభాయ్ పటేల్, కేంద్ర మత్స్యశాఖ కార్యదర్శి డాక్టర్ అభిలక్ష్ లిఖి, ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ విభాగం భారతదేశ విభాగం అధిపతి టకాయుకీ హగివారా సదస్సులో ప్రసంగిస్తారు. మత్స్య శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ. సాగర్‌మెహ్రా స్వాగత ఉపన్యాసం పలుకుతారు. మత్స్య శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి నీతు కుమారి వరుసగా వందన సమర్పణ చేస్తారు.
గుజరాత్‌లో మత్స్య రంగం అభివృద్ధికి సహకరించనున్న రాష్ట్ర ఇన్‌ల్యాండ్ రిజర్వాయర్ లీజింగ్ పాలసీని ఈ సందర్భంగా విడుదల చేస్తారు. సదస్సు ప్రారంభ కార్యక్రమంలో గుజరాత్ రాష్ట్ర మత్స్య విధానంపై అధికారిక ప్రకటన వెలువడుతుంది. ప్రమాదంలో మరణించిన వారికి జీవిత బీమా నష్ట పరిహారం చెక్కులు అందించి, కేసీసీ కార్డులు పంపిణీ చేసి, లబ్ధిదారులకు ట్రాన్స్‌పాండర్‌ల సహాయక వ్యవస్థ ను అందిస్తారు. సదస్సులో భాగంగా , 'స్టేట్ ఫిషెస్ ఆఫ్ ఇండియా' బుక్‌లెట్ , మత్స్య సంపద వివరాలతో హ్యాండ్‌బుక్ విడుదల చేస్తారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా అవార్డులు ప్రదానం చేస్తారు.
కేంద్ర మంత్రి నేతృత్వంలో అంతర్జాతీయ రౌండ్ టేబుల్:
సదస్సులో భాగంగా నిర్వహించే అంతర్జాతీయ రౌండ్ టేబుల్ సమావేశానికి కేంద్ర మంత్రి శ్రీ అంతర్జాతీయ రౌండ్ టేబుల్ అధ్యక్షత వహిస్తారు. రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ దేశాలు, వివిధ అంతర్జాతీయ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొంటారు. సమావేశంలో వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సమస్యలతో సహా అనేక సవాళ్ల పై చర్చలు జరిపి మత్సయా రంగం అభివృద్ధికి అమలు చేయాల్సిన అంతర్జాతీయ సహకార ప్రయత్నాలపై చర్చలు జరుగుతాయి. ఫ్రాన్స్ వ్యవసాయ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న కౌన్సెలర్ . మోనిక్ ట్రాన్ , నార్వే నుంచి క్రిస్టియన్ రోడ్రిగో వాల్డెస్ కార్టర్, ఆర్టి భాటియా కుమార్, ఆస్ట్రేలియా హైకమిషన్ మొదటి కార్యదర్శి (వ్యవసాయం) డాక్టర్ రిచర్డ్ నియాల్, రష్యాకి చెందిన మురాటోవ్ సెర్గీ, అడియాతులిన్ ఇలియాస్, షాగుషినా అన్నా, బ్రెజిల్ రాయబార కార్యాలయం ట్రేడ్ ప్రమోషన్ విభాగం అధిపతి వాగ్నర్ ఆంట్యూన్స్, గ్రీస్ రాయబారి డిమిట్రిస్ ఐయోనౌ., స్పెయిన్ కౌన్సెలర్ బొర్జా వెలాస్కో తుడూరి ,న్యూజిలాండ్ కౌన్సెలర్ (వ్యవసాయం) మెలానీ ఫిలిప్స్, జింబాబ్వే డిప్యూటీ అంబాసిడర్ పీటర్ హోబ్వానీ సదస్సులో పాల్గొంటారు. దాదాపు 50 భారతీయ మిషన్లు కూడా వర్చువల్ విధానంలో సదస్సులో పాల్గొంటాయి.
తమ దేశాలకు చెందిన ఉన్నత స్థాయి దౌత్య బృందాలు సడీస్సులో పాల్గొంటాయని 10కి పైగా దేశాలు ధృవీకరించాయి. దాదాపు 50 మంది ఇతర విదేశీ దౌత్యవేత్తలు వర్చువల్ విధానంలో సదస్సులో పాల్గొంటారు. ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ ,ఐక్యరాజ్య సమితి ఆహరం, వ్యవసాయం సంస్థ, బే ఆఫ్ బెంగాల్ ఇంటర్-గవర్నమెంటల్ ప్రోగ్రామ్, మెరైన్ స్టీవార్డ్‌షిప్ కౌన్సిల్ (MSC) సహా దాదాపు 10 ప్రసిద్ధ అంతర్జాతీయ సంస్థలు కూడా అంతర్జాతీయ సదస్సులో పాల్గొంటున్నాయి. వివిధ రాష్ట్రాల . రాష్ట్ర మత్స్యశాఖ మంత్రులు, వివిధ దేశాల రాయబారులు, శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు, మత్స్య సంఘాలు ,బ్యాంకర్లతో సహా పలు ప్రముఖులు సమావేశానికి హాజరవుతారు.
ప్రదర్శన
అంతర్జాతీయ సదస్సులో స్టార్టప్‌లు, ఎగుమతిదారులు, మత్స్య సంఘాలు ప్రాసెసింగ్ పరిశ్రమలతో సహా 210 కంటే ఎక్కువ జాతీయ,అంతర్జాతీయ ప్రదర్శనకారులు వారి ఉత్పత్తులు, సాంకేతిక అంశాలు, సాధించిన విజయాలు, , వినూత్న పరిష్కారాలతో ప్రదర్శన నిర్వహిస్తారు.సంస్థలు,, స్టార్టప్‌లు, అసోసియేషన్‌లు,సహకార సంఘాలు, స్వయం సహాయక బృందాలు, చిన్న-మధ్యతరహా మత్స్య పరిశ్రమలు ఒకే వేదికపైకి రావడానికి ,తమ ఉత్పత్తులు, సేవల శ్రేణిని ప్రదర్శించడానికి ఇది ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది.
సదస్సులో భాగంగా మత్స్యమంథన్ పేరుతొ నిర్వహించే సాంకేతిక సదస్సులో జాతీయ,అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటారు. పరిశ్రమ వాటాదారులు, విధాన రూపకర్తల మధ్య పరస్పర చర్చలు జరుగుతాయి. ప్రభుత్వం నుంచి ప్రభుత్వం (G2G), వ్యాపారం నుండి ప్రభుత్వం (B2G) మరియు వ్యాపారం నుంచి వ్యాపారం (B2B) ద్వైపాక్షిక సమావేశాలు ఏర్పాటు చేశారు. అత్యాధునిక మత్స్య, ఆక్వాకల్చర్ సాంకేతికతలను ప్రదర్శించే ప్రదర్శన నిర్వహిస్తారు. . మత్స్య రంగంలో వస్తున్న మార్పులపై 10 ప్రత్యేకంగా ప్రదర్శించేందుకు ప్రత్యేక పెవిలియన్‌ను ఏర్పాటు చేస్తారు.
మత్స్యకారులు, చేపల పెంపకందారులు, చేపల విక్రేతలు, విదేశీ ప్రతినిధులు, పెట్టుబడిదారులు, స్థానిక సంఘాలు, మత్స్య సహకార సంఘాల ప్రతినిధు, ఫిషరీస్ స్టార్టప్‌లతో సహా 5,000 మందికి పైగా లు ఈ సదస్సుకు హాజరవుతారు. అంతర్జాతీయ నాయకులు, సాంకేతిక పెట్టుబడిదారులు, పరిశోధన మరియు అభివృద్ధి సంస్థలు, పరికరాల తయారీదారులు, ఎగుమతి కౌన్సిల్‌లు, మత్స్య సంఘాలు, ఆర్థిక సంస్థలు, అంతర్జాతీయ ఫిషింగ్ పరిశ్రమ సంస్థలు మరియు ఆక్వాకల్చర్ ఫార్మాస్యూటికల్స్ న్యూట్రాస్యూటికల్స్ కూడా రెండు రోజుల పాటు జరిగే పాల్గొంటారు. గుజరాత్ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన 4000 మందికి పైగా మత్స్యకారులు సదస్సులో పాల్గొనే అవకాశం ఉంది.
***
(Release ID: 1978181)
Visitor Counter : 62