సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
మేఘాలయలో ఊపందుకున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర
వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి తెలుసుకున్న గ్రామస్తులు
Posted On:
18 NOV 2023 8:09PM by PIB Hyderabad
సమాచారం, విద్య, కమ్యూనికేషన్ (ఐఇసి) వాన్‌లను వివిధ బ్లాకులకు చెందిన గ్రామస్థులు ఉత్సాహంగా ఆహ్వానిస్తూ , వాటితో నిమగ్నం కావడంతో మేఘాలయలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర (విబిఎస్‌వై) ఊపందుకుంటోంది. ఈ వాన్లు మారుమూల గ్రామాలకు కూడా ప్రయాణిస్తూ కేంద్రం అందిస్తున్న పథకాల లాభాల గురించి అవగాహనను పెంచుతున్నాయి. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు ఐఇసి వ్యాన్‌ల వద్దకు చేరుకుని, వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలు, బ్యాంకులు, చమురు కంపెనీల నుంచి వచ్చిన ప్రతినిధులతో సంభాషిస్తూ బ్యాంకు రుణాలు, ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజన గురించి చురుకుగా ప్రశ్నలు వేసి, సమాచారం అడిగారు.
తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో పైనుర్స్లా, మావ్‌పట్, సోహియాంగ్ బ్లాకులు ఒక్కొక్క దానిలో రెండు గ్రామాల చొప్పున ఐఇసి వాన్లు కవర్ చేశాయి. నాబార్డ్, కృషి వికాశ్ కేంద్ర, గ్యాస్ కంపెనీ, నేషనల్ ఫర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల తోడ్పాటుతో పలు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సేవలను అందించడంతో పాటుగా, లబ్ధిదారులకు అటువంటి పథకాల లాభాల పట్ల అవగాహనను పెంచేందుకు కృషి చేశారు.
ఇటువంటి కార్యక్రమాలనే పశ్చిమ జయంతియా హిల్స్ జిల్లాలోని థడ్లాస్కీన్ బ్లాకు కింద ఉమ్లాంగ్‌షోర్ & ముఖ్లా నోన్‌గ్రిమ్ గ్రామ పంచయతీలలో కూడా నిర్వహించారు. విబిఎస్‌వై స్థలంలోకూడిన అనేకమంది లబ్ధిదారులకు కేంద్రం అమలు చేస్తున్న లాభదాయక పథకాల గురించి వివిధ ప్రభుత్వ విభాగాల ప్రతినిధులు వివరించారు.
ప్రతిష్ఠాత్మక పథకాలు, తొమ్మిదేళ్ళుగా సాగుతునన్న కార్యక్రమాల గురించి సమగ్ర అవలోకనాన్ని ప్రదర్శిస్తూ, పెద్ద సంఖ్యలో ప్రజలను ఆకర్షించాయి. అక్కడ పెద్ద సంఖ్యలో చేరిన లబ్ధిదారులు ప్రభుత్వ చొరవల గురించి తమ దృక్పధాన్ని పంచుకున్నారు. వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి సమాచారం గల కరపత్రాలను, చేతిపుస్తకాలను, కేలెండర్ 2024ను అక్కడికక్కడ ప్రజలకు పంచిపెట్టారు.
జనజాతీయ గౌరవ్ దివస్ (నవంబర్ 15, 2023)న ప్రారంభమైనన యాత్ర పారిశుద్ధ్య సౌకర్యాలు, ఆర్ధిక సేవలు, విద్యుత్ కనెక్షన్లు, అణగారినవర్గాలకు గృహనిర్మాణం, ఆహార భద్రత, పౌష్టికాహారం, ఆరోగ్య సంక్షేమం, స్వచ్ఛమైనన తాగు నీరు నుంచి నాణ్యమైన విద్య వరకు అర్హులైన లబ్ధిదారులకు అత్యవసర సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అవగాహనను పెంచడం, లాభాలను చవరి మైలు వరకు బట్వాడా చేయడంపై ఈ యాత్ర దృష్టి పెట్టింది.
***
(Release ID: 1978064)
Visitor Counter : 67