ఆయుష్

సాంప్రదాయ, పరిపూరక వైద్య విధానాల అభివృద్ధికి ఒప్పందంపై సంతకాలు చేసిన ఆయుష్ మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)

Posted On: 18 NOV 2023 5:30PM by PIB Hyderabad

*ప్రపంచ స్థాయిలో  సాంప్రదాయ, పరిపూరక వైద్య విధానాల అభివృద్ధిలో ఒప్పందం  మొదటి దశ  ఒక మైలురాయిగాఉంటుంది..  ఆయుష్.మంత్రిత్వ శాఖ కార్యదర్శి 

*  ఒప్పందం భారతదేశ జాతీయ ఆరోగ్య వ్యవస్థ ప్రధాన స్రవంతి లోకి సాంప్రదాయ, పరిపూరక వైద్య విధానాలు భాగంగా చేర్చి   ప్రపంచ ఆరోగ్య లక్ష్యాలను లక్ష్యాల సాధనకు సహకరిస్తుంది... డబ్ల్యూహెచ్ఓ    బ్రూస్ ఐల్వార్డ్,  యూనివర్సల్ హెల్త్ కవరేజ్, లైఫ్ కోర్స్ విభాగం,,ఏడీజీ 

* జాతీయ ఆరోగ్య వ్యవస్థలో సాంప్రదాయ, పరిపూరక వైద్య విధానాల    ప్రామాణీకరణ, నాణ్యత, భద్రత వంటి అంశాలను సమగ్రపరచడం,  వాటిని అంతర్జాతీయ స్థాయిలో వ్యాప్తి చేయడం ప్రధాన లక్ష్యంగా ఒప్పందం అమలు 

* సాంప్రదాయ, పరిపూరక వైద్య విధానాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించేందుకు ప్రణాళిక అమలు చేయనున్న ఆయుష్ మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ 

* సాంప్రదాయ, పరిపూరక వైద్య విధానాల వారసత్వాన్ని పరిరక్షించి \, సాంప్రదాయ, పరిపూరక వైద్య విధానాలకు ఆధునీకరణ మేళవించి ప్రపంచవ్యాప్త గుర్తింపు కోసం కృషి చేయనున్న ఆయుష్ మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ

.... 

సాంప్రదాయ, పరిపూరక వైద్య విధానాల అభివృద్ధికి ఆయుష్ మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అవగాహన ఒప్పందంపై నిన్న జెనీవాలో ఆయుష్ మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)  సంతకాలు చేశాయి. సాంప్రదాయ, పరిపూరక వైద్య వ్యవస్థలకు   నాణ్యత ,భద్రతా ప్రమాణాలు రూపొందించి  జాతీయ ఆరోగ్య వ్యవస్థలో ఏకీకృతం చేయడానికి,  అంతర్జాతీయ స్థాయిలో సాంప్రదాయ, పరిపూరక వైద్య విధానాలకు గుర్తింపు లభించేలా చేయడానికి ఒప్పందం కింద ఆయుష్ మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యక్రమాలు అమలు చేస్తాయి. జాతీయ ఆరోగ్య వ్యవస్థ  ప్రధాన స్రవంతిలో సాంప్రదాయ, పరిపూరక వైద్య విధానాలను అనుసంధానించడానికి ప్రయత్నాలు జరుగుతాయి.  ఈ లక్ష్యాన్నిసాధించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారంతో   ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ స్ట్రాటజీ 2025-34ని  డబ్ల్యూహెచ్‌ఓ సిద్ధం చేస్తుంది. 

 'సిద్ధ' వైద్య విధానంగా గుర్తింపు పొందిన పరిపూరక వైద్య రంగంలో శిక్షణ , అభ్యాస వ్యవస్థను బలోపేతం చేయడం, సాంప్రదాయ, పరిపూరక వైద్య ఔషధాల జాబితా కోసం మార్గదర్శకాలు రూపొందించడం, భద్రత తదితర అంశాలకు ఒప్పందంలో ప్రాధాన్యత ఇచ్చి తగిన కార్యక్రమాలు అమలు చేస్తారు.  ఆగ్నేయాసియాలో లభిస్తున్న మూలికల వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ  సహకారంతో మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేస్తుంది. జాతీయ ఆరోగ్య వ్యవస్థ, జీవవైవిద్యం, ఔషధ మొక్కల సంరక్షణ మరియు నిర్వహణ మొదలైనవాటితో సాక్ష్యం-ఆధారిత సాంప్రదాయ,పరిపూరకరమైన ఔషధాలను ఏకీకృతం చేయడానికి ఈ ఒప్పందం కింద కార్యక్రమాలు అమలు జరుగుతాయి. 

ఆయుష్ మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం పట్ల  కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ హర్షం వ్యక్తం చేశారు.  భారతదేశం ప్రాచీన కాలం నుండి అనేక సంప్రదాయ, ప్రత్యామ్నాయ వైద్య విధానాల సంస్కృతికి కేంద్రంగా గుర్తింపు పొందిందన్నారు.  జాతీయ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి మంత్రిత్వ శాఖ చేస్తున్న అమలు చేస్తున్న అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తోందన్నారు.   ఆరోగ్య సంరక్షణ సేవల రంగంలో భారతదేశానికి ప్రపంచ గుర్తింపు లభించి,  భారతదేశంలో మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహిస్తాయన్నారు.

ఒప్పందం మొదటి దశ 2023-28ల మధ్య అమలు జరుగుతుందని   ఆయుష్ కార్యదర్శి  వైద్య రాజేష్ కోటేచా తెలిపారు.  సాంప్రదాయ, పరిపూరక వైద్య విధానాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకు రావడానికి ఒప్పందం సహకరిస్తుందన్నారు. సాంప్రదాయ, పరిపూరక వైద్య విధానాలను  జాతీయ ఆరోగ్య వ్యవస్థ  ప్రధాన స్రవంతిలోకి తీసుకు రావడానికి ఒప్పందం సహకరిస్తుందని  ప్రపంచ ఆరోగ్య సంస్థ  యూనివర్సల్ హెల్త్ కవరేజ్ మరియు లైఫ్ కోర్స్ డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ బ్రూస్ ఐల్వార్డ్ అన్నారు. ఒప్పందంపై  భారత ప్రభుత్వం తరపున  ఐక్యరాజ్యసమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధి ఇంద్ర మణి పాండే సంతకం చేశారు. , “ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ వైద్య వ్యవస్థలను బలోపేతం చేయడానికి, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల అమలులో భారతదేశం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఇంద్ర మణి పాండే అన్నారు. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ  ఆయుష్ మంత్రిత్వ శాఖల మధ్య  రెండు 'ప్రాజెక్ట్ సహకార ఒప్పందాలు' కుదిరాయి.  యోగా, ఆయుర్వేదం, యునాని, పంచకర్మ వంటి సంప్రదాయ వైద్య విధానాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు 2016 లో తొలి ఒప్పందం కుదిరింది. , ఆయుర్వేదం, యునాని, సిద్ధ వైద్య విధానాలను బలోపేతం చేసేందుకు 2017 లో రెండో ఒప్పందం కుదిరింది.

 

స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ తరపున ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి శ్రీ ఇంద్ర మణి పాండే, ప్రపంచ ఆరోగ్య సంస్థ  తరపున యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అండ్ లైఫ్ కోర్స్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బ్రూస్ ఐల్వార్డ్ ఒప్పందంపై సంతకాలు చేశారు. (Release ID: 1978063) Visitor Counter : 52