సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
కళలు, కళాకారుల మధ్య సోదరభావం ప్రోత్సహించేలా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రపంచ వేదిక
- ఎర్రకోటలో "ఇండియా ఆర్ట్, ఆర్కిటెక్చర్ & డిజైన్ బినాలే" పేరిట నిర్వహణ
- డిసెంబర్ 8న ఈ ప్రపంచ వేదిక ప్రారంభం
- కార్యక్రమంలో భాగంగా ప్యానెల్ చర్చలు, వర్క్‌షాప్‌లు, ఆర్ట్ బజార్‌తో పాటు ప్రదర్శనలు
- ప్రజల సందర్శనార్థం డిసెంబర్ 9 నుండి 15 వరకు తెరవబడతాయి
- కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పెవిలియన్లు 31 మార్చి 2024 వరకు ప్రదర్శనలో ఉంటాయి
- పురాతన, ఆధునిక, సమకాలీన మరియు సాంకేతికతతో నడిచే కళ, ఆర్కిటెక్చర్ మరియు డిజైన్‌లో విస్తరించి ఉన్న మన దేశం యొక్క కళాత్మక వారసత్వం యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పడానికి బినాలే ఒక వినూత్న కార్యక్రమం: శ్రీమతి. మీనాక్షి లేఖి
Posted On:
17 NOV 2023 4:27PM by PIB Hyderabad
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ రెడ్ ఫోర్ట్లో ఇండియా ఆర్ట్, ఆర్కిటెక్చర్ మరియు డిజైన్ బినాలే 2023ని నిర్వహిస్తోంది, దీనిని డిసెంబర్ 8, 2023న ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవం, ప్రముఖుల సందర్శన తరువాత కార్యక్రమంలో భాగంగా ప్యానెల్ చర్చలు, వర్క్‌షాప్‌లు, ఆర్ట్ బజార్లు నిర్వహిస్తారు. డిసెంబర్ 9 నుండి 15 వరకు నిర్వహించబడతాయి. ఆ సమయంలో ప్రజలు ప్రదర్శనలను తిలకించేందుకు, వాటిలో పాలు పంచుకొనేందుకు అనుమతించనున్నారు. అంతర్జాతీయ కళాకారులు, వాస్తుశిల్పులు మరియు డిజైనర్ల ముఖ్య ప్రసంగాలు, పబ్లిక్ ఆర్ట్ ఇన్‌స్టాలేషన్‌లు, ఆర్ట్ బజార్ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు బినాలే యొక్క ప్రధాన ఆకర్షణలుగా నిలువనున్నాయి. బినాలేలో భాగంగా ఏర్పాటు చేసిన పెవిలియన్లు మార్చి 31, 2024 వరకు ప్రదర్శించబడతాయి. గతంలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్‌పో & ఫెస్టివల్ ఆఫ్ లైబ్రరీస్ వంటి గత ఈవెంట్‌ల విజయాన్ని ఆధారంగా చేసుకుని, వెనిస్, సావో పాలో మరియు దుబాయ్‌లలో జరిగిన వేడుకలను పోల్చదగినట్టుగా ఒక ప్రముఖ గ్లోబల్ సాంస్కృతిక కార్యక్రమాన్ని రూపొందించడానికి బినాలే ప్రయత్నిస్తుంది. ఎర్రకోటతో సహా భారతదేశంలో ఐదు సాంస్కృతిక ప్రదేశాలను నెలకొల్పాలన్న ప్రధాన మంత్రి ఆదేశానుసారం ప్రేరణ పొందిన ఐఏఏడీబీ'23 భారతదేశం యొక్క విభిన్న కళలు, వాస్తుశిల్పం మరియు డిజైన్‌ను హైలైట్ చేయడానికి వీలుగా ఒక వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఈ రోజు ఇక్కడ నేషనల్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం కర్టెన్ రైజర్విలేకరుల సమావేశంలో సాంస్కృతిక మరియు విదేశాంగ శాఖ సహాయ మంత్రి శ్రీమతి. మీనాక్షి లేఖి కార్యక్రమ వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ, సాంప్రదాయ కళాకారులు, సమకాలీన డిజైనర్లు, క్యూరేటర్లు మరియు ఆలోచనాపరులు వంటి విభిన్న శ్రేణిని బినాలే ప్రదర్శిస్తుందని అన్నారు. పురాతన, ఆధునిక, సమకాలీన మరియు సాంకేతికతతో నడిచే కళ, వాస్తుశిల్పం మరియు రూపకల్పనలో విస్తరించి ఉన్న మన దేశ కళాత్మక వారసత్వం యొక్క గొప్పదనాన్ని చాటిచెప్పేలా జరుపుకోవడానికి బినాలే ఒక వినూత్న కార్యక్రమం అని మంత్రి వివరించారు. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం రోజువారీ ఇతివృత్తాల చుట్టూ నిర్వహించబడుతుంది, ప్రతి ఒక్కటి భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం యొక్క విభిన్న అంశాలను ప్రదర్శించడానికి ఉద్దేశించబడింది. వ్యక్తిగత మరియు డిజిటల్ ఎగ్జిబిషన్‌లు, ఇంటరాక్టివ్ ఇన్‌స్టాలేషన్‌లు, సెషన్‌లు మరియు ప్యానెల్ చర్చలను సమిళితం చేసే ఆకర్షణీయమైన అనుభవాన్ని అందించే ఏడుగురు గౌరవనీయమైన క్యూరేటర్‌లు ఐఏఏడీబీ'23లో పాలుపంచుకుంటారు. ప్రతి ఎగ్జిబిషన్‌తో పాటు మొత్తం ఈవెంట్ కోసం సమగ్ర కాఫీ టేబుల్ బుక్‌తో పాటు నిపుణులైన క్యూరేటెడ్ కేటలాగ్‌లు ఉంటాయి. ఈవెంట్‌లోని క్యూరేటెడ్ పెవిలియన్‌లు భారతదేశ సాంస్కృతిక వారసత్వం యొక్క విభిన్న అంశాల ద్వారా మనోహరమైన అనుభూతిని అందిస్తాయి. మిస్టర్ ఆదిత్య ఆర్య "ప్రవేష్" ద్వారా సందర్శకులకు ద్వారాలను, గేట్‌వేల ప్రతీకలను గురించి మర్గనిర్దేశం చేస్తారు. శ్రీమతి అంజ్చితా బి నాయర్ "బాగ్-ఎ-బహార్"ను రూపొందించారు, ఇది ఉద్యానవనాలను విశ్వాలుగా భావించే ఒక పెవిలియన్. శ్రీ అమిత్ పస్రిచా ఆలయాల కలకాలం రూపకల్పన మరియు నిర్మాణ స్థితిస్థాపకతను గురించి తెలియజేసేలా "స్థైపత్య"ను చేపట్టారు. "సంప్రవా" శ్రీ రతీష్ నందా, శ్రీ విక్రమ్‌జిత్ రూపరాయ్ చేత నిర్వహించబడింది, శ్రీమతి శిఖా జైన్ మరియు శ్రీమతి అడ్రియానా ఎ. గారెటా భారతదేశ స్వాతంత్య్రానంతర నిర్మాణ వైభవాన్ని చాటిచెప్పే "విస్మయ" అనే పెవిలియన్‌ను ప్రదర్శింస్తారు. శ్రీ అనుభవ్ నాథ్ జానపద కళలు మరియు డిజైన్ సంప్రదాయాలను అన్వేషిస్తూ "దేశజ్"ని ముందుకు తీసుకువస్తారు. చివరగా, శ్రీమతి స్వాతి జాను "సమత్వ"ను ఆర్కిటెక్చర్‌లో మహిళల సహకారం యొక్క అన్వేషణను క్యూరేట్ చేస్తారు. వీటితో పాటు, ఐఏఏడీబీ'23 కోసం తమ పనిని సోషల్ మీడియాలో ఓపెన్ కాల్ ద్వారా సమర్పించవలసిందిగా మంత్రిత్వ శాఖ కళాకారులు మరియు క్యూరేటర్‌లను కూడా ఆహ్వానించింది. దీనికి ప్రతిస్పందనగా మంత్రిత్వ శాఖకు 560 ప్రశ్నలు మరియు 260 సమర్పణలు వచ్చాయి, వాటిలో 150 ఎంట్రీలు ఎంపిక చేయబడ్డాయి. ఇవి వేదిక వద్ద ప్రదర్శించబడతాయి. చేరిక కోసం ఐఏఏడీబీ'23యొక్క ఆదేశంతో కలిపి, లలిత కళా అకాడమీలో డిసెంబర్ 9 నుండి స్టూడెంట్ బినాలే కూడా నిర్వహించబడుతోంది మరియు సృజనాత్మకత మరియు కల్పనలను ప్రదర్శించడానికి అభివృద్ధి చెందుతున్న ప్రతిభకు వేదికగా ఉపయోగపడుతుంది. ఇండియా ఆర్ట్, ఆర్కిటెక్చర్ & డిజైన్ బినాలే ఒక ప్రత్యేకమైన ఈవెంట్‌గా ఏర్పాటు చేయబడింది, ఇది అభివృద్ధి చెందుతున్న కళాకారులకు వేదికను అందించడం ద్వారా కళాకారులు మరియు డిజైనర్ల సంఘాన్ని సమీకరించే లక్ష్యంతో ఉంది.
కళ, ఆర్కిటెక్చర్ మరియు డిజైన్‌లో అభ్యాసకుల మధ్య సంభాషణను పెంపొందించడం ద్వారా సాంస్కృతిక మరియు సృజనాత్మక పరిశ్రమలకు శక్తినివ్వడం దీని లక్ష్యం.
****
(Release ID: 1977951)
Visitor Counter : 78