గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
2014 నుంచి పరివర్తన చెందిన పారిశుద్ధ్య రంగంః గృహనిర్మాణ మంత్రి హర్దీప్ ఎస్ పురీ
అపూర్వమైన భాగస్వామ్యంతో జన ఆందోళనగా మారిన స్వచ్ఛ భారత్ మిషన్ః హర్దీప్ ఎస్ పురీ
పరిశుభ్రమైన మరుగుదొడ్ల ఛాలెంజ్‌ను ప్రారంభించిన హర్దీప్ ఎస్ పురీ
పారిశుద్ధ్యం, అందుబాటు, నమూనాలో నవీనత & క్రియాశీలతకు ఉదాహరణగా నిలిచే మోడల్ పబ్లిక్ టాయిలెట్లను గుర్తించడం ఛాలెంజ్ లక్ష్యం
Posted On:
17 NOV 2023 3:17PM by PIB Hyderabad
భారత్ వృద్ధిని స్వచ్ఛత ఉద్యమం చొరవ మినహా మరేదీ సంగ్రహించలేదు. కేవలం 37% మంది మాత్రమే 2014 నాటికి బహిర్గత మలవిసర్జన రహితంగా (ఒడిఎఫ్) ఉంది. కానీ, 2019 నాటికి రికార్డు స్థాయి మరుగదొడ్ల నిర్మాణం ద్వారా సంతృప్త స్థాయిని సాధించామని గృహనిర్మాణం & పట్టణ వ్యవహారాలు, పెట్రోలియం & సహజవాయువుల మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురీ పేర్కొన్నారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని జరుపుకునేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గృహనిర్మాణం & పట్టణ వ్యవహారాలు, పెట్రోలియం & సహజవాయువుల (ఎంఒహెచ్ యుఎ) మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురీ ప్రసంగించారు. కార్యక్రమంలో ఎంఒహెచ్ యుఎ కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి, వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ డాక్టర్ జాక్ సిమ్, యుఎస్ఎఐడి మిషన్ డైరెక్టర్ వీణా రెడ్డి, సులభ్ ఇంటర్నేషనల్, హెచ్‌యుఎల్, యుఎన్ఐసిఇఎఫ్, బిఎంజిఎఫ్, ఐఎస్‌సి- ఫిక్కీ ప్రతినిధులు, ప్రభుత్వ తరుఫున సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ప్రతి ఏడాదీ నవంబర్ 19న వరల్డ్ టాయిలెట్ డేను జరుపుకుంటారు. ఈ వేడుక మరుగుదొడ్ల చుట్టూ ఉన్న నిషేధాలను తెంచివేసేందుకు తోడ్పడి, పారిశుద్ధ్యాన్ని ఒక ప్రపంచ అభివృద్ధి ప్రాధాన్యతగా చేయాలన్న లక్ష్యంతో జరుపుకుంటారు. అనేక పారిశుద్ధ్య, పరిశుభ్రతా ఆందోళనలను పరిష్కరించే స్వచ్ఛత ఉద్యమానికి మరుగుదొడ్లు కేంద్రంగా ఉన్నందున ఈ వేడుక భారత్‌కు విశిష్టమైంది.
2014 నుంచి పారిశుద్ధ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టడాన్ని ప్రస్తావిస్తూ, 2019 అక్టోబర్ 2 నాటికి మహాత్మా గాంధీకి నివాళిగా బహిరంగ మలవిసర్జన రహిత భారతదేశాన్ని సాధించేందుకు భారత ప్రధానమంత్రి ప్రపంచంలోనే అతిపెద్ద పారిశుద్ధ్య కార్యక్రమమైన స్వచ్ఛ భారత్ మిషన్‌ను ప్రారంభించడాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు.
స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా నగర భారత పారిశుద్ధ్య లాండ్‌స్కేప్ పరివర్తన చెందడం గురించి మాట్లాడుతూ, మిషన్ కింద ముందెన్నడూ లేని రేటున మరుగుదొడ్ల నిర్మించడం అన్నది పట్టణ ప్రాంతాలలో ఒడిఎఫ్ అన్న సాహసోపేత లక్ష్యాన్ని సాధించిందని శ్రీ పురీ అన్నారు.
ఎస్‌బిఎం-యు అతిపెద్ద ప్రవర్తనా మార్పు కార్యక్రమంగా నిలుస్తుందని శ్రీ పురీ అన్నారు. ఇది జన ఆందోళన్‌గా మారి, అపూర్వమైన ప్రజా భాగస్వామ్యాన్ని పొందిందని ఆయన పేర్కొన్నారు.
ఈ మిషన్ మహిళలు, బాలికలు, పారిశుద్ధ్య కార్యకర్తల జీవితాలలో ఎలా సానుకూల మార్పును తీసుకువచ్చిందో మంత్రి మాట్లాడారు. మిషన్ మహిళ- అనుకూల మరుగుదోడ్లను ప్రోత్సహించిందని, సాధారణ కార్మికులను అధికారికం చేసిందని, పారిశుద్ధ్యంలో మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడం మహిళలు, బాలికల సాధికారతకు దారి తీసిందని అన్నారు. ఎస్‌బిఎం పై దృష్టి పారిశుద్ధ్య కార్మికుల భద్రత, గౌరవాన్ని తెచ్చిందని పేర్కొన్నారు.
భారత్‌లో పారిశుద్ధ్య రంగం కింద చేస్తున్న పనిని పెంచాల్సిన అవసరాన్ని పట్టణ& నగర వ్యవహారాల మంత్రి గుర్తించారు. పారిశుద్ధ్య డ్రైవ్‌ను పెంచేందుకు చేస్తున్న కృషిలో పౌర సమాజం, ఎన్జీవోలు మరింత భారీ ఎత్తున తమతో కలిసి పని చేయాలని తాము కోరుకుంటున్నామన్నారు. ఈ ఉద్యమాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్ళడంలో ప్రైవేట్ రంగ ప్రాముఖ్యతను మంత్రి పట్టి చూపారు.
సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రజల జీవితాలను స్పృశించడానికి పారిశుద్ధ్యం, పరిశుభ్రత ఒక కోణమని, దాని ప్రభావం ఎంతో సంతృప్తికరంగా ఉంటుందన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రానున్న కొద్ది సంవత్సరాలలో చెత్త కుప్పలను తొలగించడం అన్నది విశేష విషయంగా ఉంటుందని ఎంఒహెచ్‌యుఎ కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి అన్నారు. ప్రజలు తేలికగా చూడగలిగేలా మరొక స్థాయికి తీసుకువెళ్ళగలిగేలా చూసే సమయం మనకు ఆసన్నమైందని అన్నారు. ప్రక్షాళన రంగంలో చేయవలసిందే చాలా ఉందన్నారు. అభిలషనీయ మరుగుదొడ్లపై మరింత దృష్టి పెట్టాలని, అందుకు తమకు ప్రైవేటు రంగాల, ఎన్జీవోల ప్రమేయం అవసరమని ఆయన పేర్కొన్నారు.
వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు& డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ జాక్ సిమ్ మాట్లాడుతూ, పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ, అందులో గల ప్రాథమిక సమస్యకు సంబంధించిన అంతర్జాతీయ అనుభవాన్ని పంచుకుంటూ దానిని ఎబిసి - ఆర్కిటెక్చర్, బిహేవియర్ (ప్రవర్తన) క్లీనింగ్ (శుభ్రం చేయడం) ద్వారా సంగ్రహించారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన టాయిలెట్ల కోసం డిమాండ్ చేస్తే, ప్రజల అంచనాలకు తగినట్టుగా మనం ఉండాలి. కనుక, ప్రవర్తన మార్పుపై దృష్టి పెట్టడం అని ఆయన ఫోరంను ఉద్దేశించి ప్రసంగిస్తూ అన్నారు.
ఈ కార్యక్రమం నవంబర్ 19 నుంచి ఐదువారాల పరిశుభ్రమైన మరుగుదొడ్ల ఛాలెంజ్‌ను, 25 డిసెంబర్ వరకు ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం, సుపరిపాలన దినోత్సవ ప్రారంభాన్ని వీక్షించింది. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం 2023 ఇతివృత్తం, సురక్షిత పారిశుద్ధ్యం కోసం వేగవంతమైన మార్పుకు అనుగుణంగా ఈ చొరవను రూపొందించారు.
ఈ ప్రత్యేకమైన తొలి నామినేషన్ - ఆధారిత మరుగుదొడ్ల ఛాలెంజ్ సిటి/ పిటిల కార్యాచరణ మెరుగుపరచడం, స్థిరత్వాన్ని నిర్ధారించడాన్ని ఐదువారాల సుదీర్ఘ సామూహిక పరిశుభ్రత, నిర్వహణ డ్రైవ్ ద్వారా భారత్‌లోని అన్ని మరుగుదొడ్ల నిర్వహణ, పరిశుభ్రతను మెరుగుపరచడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని ఎస్‌బిఎం మరుగుదొడ్లను క్రియాశీలకం, అందుబాటులోకి తేవడం, శుభ్రమైన, పర్యావరణ అనుకూల, సురక్షిత పై దృష్టి పెట్టడం లక్ష్యంగా పెట్టుకుంది.
పరిశుభ్రత, అందుబాటు, నమూనాలో నవీనత, క్రియాశీలతకు ఉదాహరణగా ఉండే మోడల్ పబ్లిక్ టాయిలెట్లను గుర్తించడాన్ని క్లిన్ టాయిలెట్స్ ఛాలెంజ్ లక్ష్యంగా పెట్టుకుంది. తమ ఉత్తమ సిటి/ పిటిల నమూనాలను యుఎల్‌బిలు, పారా స్టేటల్ సంస్థలు, ప్రైవేటు సంస్థలు నామినేట్ చేయవచ్చు. ప్రతి దరఖాస్తుదారు కేవలం ఒక టాయిలెట్ నమూనాను నామినేట్ చేయాలి. ప్రత్యేక ఒ&ఎం నమూనా కలిగి, ఉత్తమంగా పని చేస్తున్న నమూనాలను కూడా 1 నుంచి 10 డిసెంబర్ 2023వరకు నామినేట్ చేయవచ్చు. నామినేషన్ ఫార్మ్ మైగవ్ పోర్టల్‌పై 1 డిసెంబర్ నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ ఛాలెంజ్ ద్వారా ఎంఒహెచ్‌యుఎ ఎంపిక చేసిన ఉత్తమ మోడల్ టాయిలెట్లకు జాతీయ గుర్తింపు లభించడమే కాక, 2024లో విడుదల చేయనున్న ప్రచురణలో ప్రచురితమవుతుంది.
నగర పారిశుద్ధ్య సంక్లిష్ట సవాళ్ళను పరిష్కరించేందుకు, ఎంఒహెచ్‌యుఎ ఎస్‌బిఎం-యు 2.0 కోసం భాగస్వాముల ఫోరంను కూడా ప్రారంభించింది. అభివృద్ధి భాగస్వాములు, ఆ రంగాల భాగస్వాముల నుంచి ప్రక్షాళన రంగం, అంతర్జాతీయ నిధుల సంస్థలు తదితరాలతో అనుబంధం కలిగిన కార్పొరేట్లు, పిఎస్‌యులు, అనుబంధ మంత్రిత్వ శాఖలు/ విభాగాలు ఆవల భాగస్వాములను కలిగి ఉండాలని ఫోరం యోచిస్తోంది.
వ్యర్ధ నిర్వహణ మౌలిక సదుపాయాలు, సేవలు, ఒ&ఎం నమూనాలు, కమ్యూనికేషన్, చేరువకావడం, సాంకేతికత, ఐటి తోడ్పాటు, విజ్ఞాన నిర్వహణ, సామర్ధ్య నిర్మాణం, ఐఇసి/ బిసిసి, పరిశోధన, అధ్యయనం తదితరాలు సహా పలు సంభావ్య రంగాలలో సహకారం కోసం భాగస్వాముల ఫోరంను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సురక్షితమైన పరిశుద్ధ్యం చుట్టూ కేంద్రీకృతమై అనేక ఆసక్తికరమైన అంశాలపై లోతైన చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమం సందర్భంగా, ఆడియో విజువల్ మాధ్యమం ద్వారా ఆకర్షణీయ, పరిశుభ్రమైన పబ్లిక్ సౌకర్యాల దిశగా మార్పును సూచిస్తూ నూతన అభిలషణీయ టాయిలెట్లకు నమూనాలను ఎన్‌బిసిసి ప్రదర్శించింది.
ఇండియా శానిటేషన్ కోయిలేషన్, హిందుస్తాన్ యునీలివర్ లిమిటెడ్, సులభ్ ఇంటర్నేషనల్, జిఐడబ్లయుఎ, ప్రైవేట్ సంస్థలు, విద్య, ఆర్&డి సంస్థలు తదితర వివిధ అభివృద్ధి భాగస్వాములు, కార్పొరేట్లు పారిశుద్ధ్యం, కమ్యూనిటీ టాయిలెట్లు/ పబ్లిక్ టాయిలెట్ల ప్రయాణంలో తమ అనుభవాలను పంచుకున్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ రంగ భాగస్వాములు, అభివృద్ధి భాగస్వాములు, రాష్ట్ర, నగర అధికారులు & కార్పరేట్ల నుంచి 1000మంది పాల్గొన్నారు.
***
(Release ID: 1977776)
Visitor Counter : 71