మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచ దక్షిణాది వాణి 2వ సదస్సు యొక్క విద్యా మంత్రుల సమావేశానికి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ నాయకత్వం వహిస్తున్నారు.


భవితకు మానవ వనరుల సంసిద్ధత అనే అంశంపై ప్రత్యేక దృష్టి తో సెషన్

ఎన్ ఈ పీ ( జాతీయ విద్యా విధానం)2020 అనేది ఒక తాత్విక పత్రం, ఇది అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ఒక నమూనా గా పనిచేస్తుంది: శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

భాగస్వామ్య ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం మరియు ఉమ్మడి వ్యూహాలను రూపొందించడం, విద్య మరియు నైపుణ్యాభివృద్ధి యొక్క జంట పునాది స్తంభాలను ప్రభావితం చేయడం అత్యవసరం: శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

Posted On: 17 NOV 2023 5:42PM by PIB Hyderabad

న్యూ ఢిల్లీలో ఈరోజు జరిగిన ప్రపంచ దక్షిణాది వాణి 2వ సదస్సులో  భాగంగా విద్యా మంత్రుల సమావేశానికి కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షత వహించారు. 'అందరి విశ్వాసంతో అందరి ప్రగతి కోసం ' అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ సదస్సు లో ముఖ్యంగా విద్యా రంగంలోని క్లిష్టమైన అంశాలను ప్రస్తావించారు. ‘మానవ వనరులను భవిష్యత్తుకు సిద్ధం చేయడం’ అనే అంశంపై విద్యాశాఖ మంత్రులు చర్చించారు.

 

దక్షిణాది ప్రపంచం– బోట్స్‌వానా, బ్రూనై దారుస్సలాం, జార్జియా, ట్యునీషియా, ఇరాన్, లావో పిడిఆర్, మలావి, మయన్మార్, రిపబ్లిక్ ఆఫ్ పలావ్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ సావో టోమ్ మరియు ప్రిన్సిప్, అల్బేనియా, మలేషియా, జింబాబ్వే, కామెరోబ్వే -  నుండి 14 దేశాల మంత్రులు/ప్రముఖులు పాల్గొన్నారు. సెషన్‌లో వారి అంతర్దృష్టులను పంచుకున్నారు.

 

 శ్రీ ధర్మేంద్ర ప్రధాన్  మంత్రులను స్వాగతించారు మరియు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచ దక్షిణాది వాణి ని అగ్రగామి గా మార్చడానికి భారతదేశం యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించారు.

 

జీ 20 విద్యా మంత్రుల సమావేశంలో ఈ సమస్యలపై చర్చలకు నాయకత్వం వహించడంలో భారతదేశం యొక్క కీలక పాత్రను హైలైట్ చేసిన శ్రీ ప్రధాన్, నిలకడైన, సమానమైన, సమగ్రమైన మరియు సుస్థిరమైన విద్య మరియు నైపుణ్యం పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో సహకార ప్రయత్నాల ప్రాముఖ్యతపై ఉద్ఘాటించారు. జీ 20 న్యూ ఢిల్లీ నాయకుల ప్రకటన మానవ మూలధన అభివృద్ధిలో పెట్టుబడి యొక్క ప్రాముఖ్యతను గుర్తించింది.

 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలవుతున్న భారతదేశ జాతీయ విద్యా విధానం (ఎన్ ఈ పీ) 2020, భారతదేశ అభ్యాసం మరియు నైపుణ్యం రంగాలలో సంపూర్ణ పరివర్తనను ఎలా తీసుకువస్తోందో శ్రీ ప్రధాన్ పాల్గొన్న మంత్రులకు తెలియజేశారు. ఎన్ ఈ పీ ఒక తాత్విక పత్రంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు సమగ్ర వ్యూహాలు మరియు  విధానాలను అభివృద్ధి చేయడానికి ఒక నమూనా గా పనిచేస్తుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. భాగస్వామ్య ఆకాంక్షల ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన శ్రీ ప్రధాన్, విద్య మరియు నైపుణ్యాభివృద్ధి యొక్క జంట పునాది స్తంభాలను ప్రభావితం చేస్తూ ఉమ్మడి వ్యూహాలకు పిలుపునిచ్చారు.

 

విదేశీ విద్యామంత్రులు తమ ప్రసంగాలలో, తమ విజయగాథలు, ఎదుర్కొన్న సవాళ్లు మరియు వాటిని పరిష్కరించడానికి వ్యూహాలను పంచుకున్నారు. దక్షిణాది ప్రపంచ దేశాల మధ్య విద్య మరియు నైపుణ్యం రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడానికి భారతదేశం చేస్తున్న కృషిని వారు  అభినందించారు.

 

భాగస్వామ్య దేశాలకు చెందిన విద్యా మంత్రులు నాణ్యమైన విద్య ద్వారా అందుబాటులో ఉండే, సమానమైన, సమగ్రమైన మరియు సుస్థిరమైన భవిష్యత్తు కోసం కలిసి పని చేయవలసిన అవసరాన్ని అంగీకరించారు. మానవ మూలధన అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పడం మరియు ప్రపంచ నైపుణ్యాల విభజనను పరిష్కరించడానికి, పరిశ్రమ యొక్క డిమాండ్‌లకు అనుగుణంగా భవిష్యత్తులో సిద్ధంగా ఉన్న శ్రామికశక్తిని సృష్టించేందుకు నైపుణ్యం, పునః శిక్షణ మరియు ఉన్నతశిక్షణ అవకాశాలను అందించాల్సిన అవసరాన్ని మంత్రులు అంగీకరించారు.

 

సాంకేతిక మౌలిక సదుపాయాలకు ఉన్న అడ్డంకులను పరిష్కరించడం ద్వారా మరియు సాంకేతిక పర్యావరణ వ్యవస్థలు మరియు అభ్యాస వనరులను అభివృద్ధి చేయడానికి అభ్యాసకులందరికీ డిజిటల్ విభజనను అధిగమించడానికి  సరసమైన మరియు సులభంగా స్థానిక భాషలతో సహా అందుబాటులో ఉండే విధంగా సమిష్టిగా కృషి చేయడం లో భాగస్వామ్య నిబద్ధతను విద్యా మంత్రులు పునరుద్ఘాటించారు. విద్యను ప్రోత్సహించడంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు మరియు విద్యా సిబ్బంది అందరి ప్రధాన పాత్రను వారు నొక్కిచెప్పారు అలాగే ఉపాధ్యాయులు మరియు సిబ్బంది వారి వృత్తిలో అభివృద్ధి చెందడానికి వీలు కల్పించే సామర్థ్య పెంపు మరియు పరస్పర విదేశీ శిక్షణ కార్యక్రమాలతో సహా విద్యావరణాన్ని మెరుగుపరచవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

 

నాణ్యమైన బోధన, అభ్యాసం మరియు నైపుణ్యాన్ని ప్రోత్సహించడంతోపాటు విద్యా సంస్థల మధ్య విద్యాపరమైన సహకారాన్ని పెంపొందించడంతోపాటు విద్యార్థి మరియు అధ్యాపకుల పరస్పర విదేశీ శిక్షణ కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు సహకార పరిష్కారాలు, ఆవిష్కరణలు, ఉత్తమ విధానాలను పంచుకోవడం వంటి వాటిని ప్రోత్సహించేందుకు మంత్రులు అంగీకరించారు.

 

తోటి విదేశీ విద్యామంత్రుల విలువైన ఆలోచనలను అభినందిస్తూ, సమిష్టి కృషితో, దక్షిణ-దక్షిణ సహకారం శక్తి నుండి బలానికి పెరుగుతుందని శ్రీ ప్రధాన్ తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచ శ్రేయస్సు, సమానమైన ప్రపంచం మరియు ఉజ్వలమైన ప్రపంచ భవిష్యత్తు కోసం భారతదేశం ‘అందరి అభివృద్ధి కోసం, ప్రతి ఒక్కరి నమ్మకంతో కలిసి’ పని చేస్తుందని ఆయన తెలిపారు.

 

2023 జనవరిలో తొలి ప్రపంచ దక్షిణాది వాణి సదస్సు సందర్భంగా నిర్మించిన పునాదిపై ఈ సదస్సు నిర్మించబడింది, ఇది  దక్షిణాది ప్రపంచం లోని 125 దేశాల వాణులు మరియు ప్రయోజనాలను సమైక్య వాణిగా చేయడంపై దృష్టి సారించింది, ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ముఖ్య ప్రాధాన్యతలను సమస్యలను ముఖ్యంగా విద్య మరియు నైపుణ్యం అభివృద్ధి కి సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో భారతదేశం యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది, 

 

 ప్రపంచ దక్షిణాది వాణి 2వ సదస్సు వివిధ జీ 20 సమావేశాల ఫలితాలను పంచుకోవడానికి, మునుపటి సదస్సు నుండి అందుకున్న వేగాన్ని కొనసాగించడానికి మరియు సమ్మిళిత మరియు సమానమైన అంతర్జాతీయ అభివృద్ధి కోసం భాగస్వామ్య ఆకాంక్షలను సాధించడానికి మార్గాలను చర్చించడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది. డిజిటల్ విభజనను అధిగమించడానికి డిజిటల్ సాంకేతికతలను ఉపయోగించడం మరియు జీవితం, సాంకేతిక మరియు వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహకారాన్ని బలోపేతం చేయడంపై కూడా చర్చలు దృష్టి సారించాయి. సదస్సు ఫలితాలు 22 నవంబర్ 2023న భారతదేశం నిర్వహించే రాబోయే జీ 20 వర్చువల్ సమ్మిట్‌లో చర్చలను ప్రభావితంజేస్తాయని భావిస్తున్నారు.

 

సదస్సు సందర్భంగా 8 మంత్రివర్గ సమావేశాలు జరిగాయి. సదస్సు, ' అందరి ప్రగతి కోసం, అందరి విశ్వాసంతో' అనే థీమ్‌తో, భారతదేశం జీ 20 అధ్యక్షత ఉన్న కాలంలో వివిధ జీ 20 సమావేశాలలో సాధించిన కీలక ఫలితాలను దక్షిణాది ప్రపంచ దేశాలతో పంచుకోవడంపై దృష్టి సారిస్తుంది. 2వ ప్రపంచ దక్షిణాది వాణి సదస్సు లో దక్షిణాది ప్రపంచ దేశాల సభ్యుల నుండి వచ్చే ముఖ్య ఆలోచనలను మరియు సూచనలను  22 నవంబర్ 2023న భారతదేశం నిర్వహించబోయే తదుపరి జీ-20 వర్చువల్ సదస్సు లో వివరిస్తారు.

 

****


(Release ID: 1977775) Visitor Counter : 87