వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా చూసేందుకు నిర్వహిస్తున్న విక్షిత్ భారత్ యాత్రను జార్ఖండ్‌లోని ఖుంటిలో ప్రారంభించిన ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ


పీఎం-కిసాన్ పథకం 18,000 వేల కోట్లకు పైగా 15వ విడత మొత్తాన్ని విడుదల చేసిన ప్రధానమంత్రి

24 వేల కోట్ల బడ్జెట్‌తో అమలు చేయనున్న ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహాఅభియాన్‌ను ‘జనజాతీయ గౌరవ్ దివస్’ సందర్భంగా ప్రారంభించిన ప్రధానమంత్రి

జార్ఖండ్‌లో సుమారు రూ. 7,200 కోట్ల విలువైన ప్రాజెక్టులకు జాతికి అంకితం చేసి శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి

Posted On: 15 NOV 2023 6:44PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం కింద రూ. 18,000 కోట్లకు పైగా 15వ విడతను జార్ఖండ్‌లోని ఖుంటి నుండి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విడుదల చేశారు.  దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి అమలు చేస్తున్న పథకం కింద ప్రధానమంత్రి ఈ మొత్తాన్ని విడుదల చేశారు.  ప్రతి సంవత్సరం జనజాతీయ గౌరవ్ దివస్‌గా జరుపుకునే 'భూమి తండ్రి' శ్రీ భగవాన్ బిర్సా ముండా పుట్టినరోజు సందర్భంగా 15వ  విడత మొత్తాన్ని ప్రధానమంత్రి విడుదల చేశారు.  ఈ సందర్భంగా గిరిజన ప్రజల  సమగ్ర అభివృద్ధి కోసం   రూ. 24,000 కోట్ల బడ్జెట్‌తో కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న  పీఎం జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. జార్ఖండ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  శ్రీ మోదీ జార్ఖండ్‌లో రైలు, రోడ్డు, విద్య, బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు వంటి బహుళ రంగాల్లో  రూ. 7200 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న ప్రాజెక్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేసి వాటిని  దేశానికి అంకితం చేశారు.

వేదిక వద్దకు చేరుకున్న ప్రధానికి గిరిజన కళాకారులు సాదర స్వాగతం పలికారు. ప్రధానమంత్రి పాల్గొన్న కార్యక్రమంలో  వేలాది మంది రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు ఆన్‌లైన్‌లో కార్యక్రమాన్ని వీక్షించారు.  కార్యక్రమంలో జార్ఖండ్ గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ హేమంత్ సోరెన్, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా తదితరులు పాల్గొన్నారు.

స‌మావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి రాంచీలోని ఉలిహ‌తు గ్రామం, స్వాతంత్ర్య స‌మ‌ర మ్యూజియం సందర్శనకు గుర్తు చేసుకున్నారు. జన జాతీయ గౌరవ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శ్రీ మోదీ  శుభాకాంక్షలు తెలిపి ప్రముఖ   విప్లవకారుడు భగవాన్ బిర్సా ముండా కు నివాళులర్పించారు. జార్ఖండ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి రాష్ట్ర ఏర్పాటులో మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి చేసిన కృషిని గుర్తు చేశారు. . జార్ఖండ్ రాష్ట్రంలో ఇప్పుడు 100 శాతం విద్యుదీకరించిన రైలు మార్గాలు ఉన్నాయని ఆయన తెలిపారు. 

భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా శక్తి, వ్యవసాయ శక్తి, యువశక్తి పేద, మధ్యతరగతి శక్తి అనే నాలుగు స్తంభాలకు పూర్తి సహకారం అందించాల్సి ఉంటుందని  శ్రీ మోదీ స్పష్టం చేశారు. . లక్షలాది మంది ప్రజలను పేదరికం కోరల నుంచి బయటకు  తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  పారిశుద్ధ్యం, ఎల్‌పిజి కనెక్షన్లు, ఆరోగ్య సంరక్షణ వంటి అవసరమైన సేవలను మెరుగుపరచడానికి అమలు చేస్తున్న చర్యలను ఆయన వివరించారు.భ‌విష్య‌త్తులో బలహీనవర్గాలకు చెందిన ప్రతి ఒక్కరికీ  ప్ర‌భుత్వ ప‌థ‌కాల ద్వారా  ప్రయోజనం కలిగే విధంగా కార్యక్రమాలు అమలు జరిగేలా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. గిరిజన వర్గాల సంక్షేమం , అభివృద్ధి కోసం ప్రధానమంత్రిగా  అటల్ బిహారీ వాజపేయి  చేసిన కృషిని శ్రీ మోదీ వివరించారు. ప్రత్యేక  బడ్జెట్‌తో గిరిజన వర్గాల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను శ్రీ వాజపేయి ఏర్పాటు చేశారని తెలిపారు. శ్రీ వాజపేయి స్పూర్తితో పని చేస్తున్న తమ ప్రభుత్వం గిరిజన బడ్జెట్ ను  ఇప్పుడు  6 రెట్లు పెంచిందని  ఆయన పేర్కొన్నారు. పీఎం జన్మాన్  పథకం కింద  ప్రభుత్వం ఆదిమ తెగలను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపిన శ్రీ మోదీ , వీరిలో చాలా మంది ఇప్పటికీ అడవుల్లో నివసిస్తున్నారని అన్నారు. . 22 వేలకు పైగా గ్రామాల్లో లక్షలాది మంది జనాభా ఉన్న 75 గిరిజన , ఆదిమ తెగలను ప్రభుత్వం గుర్తించిందని  ప్రధాన మంత్రి తెలిపారు. వివరాల సేకరణకు పరిమితం కాకుండా గిరిజన, ఆదిమ తెగల అభివృద్ధికి కృషి జరగాలన్నారు.   గిరిజన, ఆదిమ తెగల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం  రూ.24,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని శ్రీ మోదీ ప్రకటించారు. 

ఈరోజు  పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 15 వ విడత కింద  2,75,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలకు నేరుగా జమ చేశామని శ్రీ మోడీ ప్రకటించారు. . పశువుల పెంపకం దారులు,మత్స్యకారులకుకిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నప్రభుత్వం పశువులకు ఉచిత టీకాలు వేయడానికిరూ. 15,000 కోట్లు కేటాయించిందని ప్రధానమంత్రి వివరించారు. , మత్స్య సంపద యోజన కింద చేపల పెంపకానికి ఆర్థిక సహాయం అందించడానికి, 10,000 కొత్త రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేయడానికి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని అన్నారు.  ఈ చర్యలు మార్కెట్లను మరింత అందుబాటులోకి తీసుకు వచ్చి  రైతులకు ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా అమలు జరుగుతాయన్నారు.  2023ని అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరంగా పాటిస్తున్నారని తెలిపిన శ్రీ మోదీ శ్రీ అన్న వంటి భారతీయ ఉత్పత్తులను విదేశీ మార్కెట్‌లలో ప్రోత్సహించడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. 

, రైతులను ఆదుకోవడానికి, గిరిజన ప్రజల  సమగ్ర అభివృద్ధికి భరోసా కల్పించడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు తెలియజేసే విధంగా కార్యక్రమం జరిగింది. అట్టడుగు వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం అమలు చేస్తున్న కారక్రమాల్లోభాగంగా  కేంద్ర ప్రభుత్వం  15వపీఎం -కిసాన్ విడత వాయిదా విడుదల చేసి  పీఎం జన జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ను ప్రారంభించింది. 

 

***


(Release ID: 1977284) Visitor Counter : 130