వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్ అన్న యోజ‌న (పిఎంజికెఎవై) కింద ఉచితంగా ఆహార ధాన్యాల‌ను అందిస్తున్న కేంద్రం


ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ అన్న యోజ‌న కింద రాష్ట్రాల‌లో నిర్దేశిత డిపోవ‌ర‌కు ఆహార ధాన్యాల సేక‌ర‌ణ‌, కేటాయింపు, ర‌వాణా కోసం ఆహార స‌బ్సిడీని భ‌రాయిస్తున్న భార‌త ప్ర‌భుత్వం

Posted On: 15 NOV 2023 6:12PM by PIB Hyderabad

నిరుపేద ల‌బ్ధిదారుల‌పై ఆర్ధిక భారాన్ని తొల‌గించి, దేశ‌వ్యాప్తంగా జాతీయ ఆహార భ‌ద్ర‌త చ‌ట్టం (2013)ని ఏక‌రీతిగా, స‌మ‌ర్ధ‌వంతంగా అమ‌లు చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌ధాన‌మంత్రి  గ‌రీబ్ క‌ళ్యాణ్ అన్న యోజ‌న (పిఎంజికెఎవై) కింద అంత్యోద‌య అన్న యోజ‌న (ఎఎవై) కుటుంబాల‌, ప్రాధాన్య‌త ప‌రివారాల‌ (పిహెచ్‌హెచ్‌) ల‌బ్ధిదారుల‌కు  ఆహార ధాన్యాల‌ను 1 జ‌న‌వ‌రి 2023 నుంచి ఒక ఏడాదిపాటు ఉచితంగా అందిస్తోంది.
అంద‌బాటు, భ‌రించ‌గ‌లిగే శ‌క్తి, నిరుపేద‌ల‌కు హ‌క్కుగా ఆహార ధాన్యాల అందుబాటు వంటి అంశాల‌ను  జాతీయ ఆహార భ‌ద్ర‌త చ‌ట్టం, 2013 (ఎన్ఎఫ్ఎస్ఎ) బ‌లోపేతం చేసి, జాతీయ ఆహార భ‌ద్ర‌త చ‌ట్టం 2013ను (ఒక దేశం- ఒక ధ‌ర - ఒక రేష‌న్‌) ఏక‌రీతిగా, స‌మ‌ర్ధ‌వంతంగా, ఖ‌చ్చితంగా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది. రాష్ట్రాల‌లో ఎఫ్‌సిఐకి ఆహార స‌బ్సిడీ, వికేంద్రీకృత సేక‌ర‌ణ (డిసిపి)కి ఆహార రాయితీ  అనే రెండు ఆహార స‌బ్సిడీ ప‌థ‌కాల స‌హాయంతో రాష్ట్రాల‌లోని నిర్దేశిత డిపో వ‌ర‌కు ఆహార‌ధాన్యాల‌ను సేక‌రించి, కేటాయించి, ర‌వాణా, పంపిణీ చేయ‌డం కోసం ఆహార స‌బ్సిడీని కేంద్ర ప్ర‌భుత్వం పూర్తిగా భ‌రిస్తోంది. ఆహార భ‌ద్ర‌తా చ‌ట్టం, 2013 స‌మ‌ర్ధ‌వంతమైన‌, ఏక‌రీతి అమ‌లు కోసం ఈ రెండు ప‌థ‌కాల‌ను ప్ర‌ధాన మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ అన్న యోజ‌న (పిఎంజికెఎవై) కింద క‌లిపివేయ‌డంతో పాటుగా దేశంలో ఆహార భ‌ద్ర‌తా నెట్‌వ‌ర్క్‌ను బ‌లోపేతం చేయ‌డం ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప‌థ‌కం కింద ల‌క్ష్యిత ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ (టిపిడిఎస్) ద్వారా ఉచిత ఆహార ధాన్యాల‌ను 1 జ‌న‌వ‌రి 2023 నుంచి పంపిణీ చేయ‌డం ప్రారంభించారు. ఎన్ఎఫ్ఎస్ఎ ల‌బ్ధిదారుల‌కు ఆహార ధాన్యాలను ఉచితంగా అందించేందుకు అయ్యే అద‌నపు ఖ‌ర్చును భార‌త ప్ర‌భుత్వం భ‌రిస్తుంది.   
గ్రామీణ జనాభాలోని 75%కి, ప‌ట్ట‌ణ జ‌నాభాలో 50% జ‌నాభాకు జాతీయ ఆహార భ‌ద్ర‌తా చ‌ట్టం ఆహార భ‌ద్ర‌త‌ను అందిస్తుంది. 2011 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం వీరి సంఖ్య 81.5 కోట్ల వ్య‌క్తులుగా ఉంది. ఈ చ‌ట్టం కింద స‌మాజంలోని బ‌ల‌హీన‌, నిరుపేద వ‌ర్గాల‌కు ఈ ల‌బ్ధి అందించేందుకు క‌వ‌రేజ్ విస్త్ర‌తంగా ఉంది. పిఎంజికెఎవై కింద ఉచిత ఆహార ధాన్యాల‌ను పంపిణీ చేసేందుకు ఈ చ‌ట్టం కింద రాష్ట్రాలు/  కేంద్ర ప్ర‌భుత్వ ప్రాంతాలు ప్ర‌స్తుతం ఉద్దేశించిన 81.35కోట్ల క‌వ‌రేజీలో 80.48 కోట్ల ల‌బ్ధిదారుల‌ను గుర్తించాయి. 

 

***


(Release ID: 1977258) Visitor Counter : 78


Read this release in: English , Urdu , Hindi , Bengali