శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

జనవరిలో 9వ భారత అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్-2023 (ఐఐఎస్ఎఫ్)


- జనవరి 17-20, 2024 వరకు హర్యానాలోని ఫరీదాబాద్‌లో నిర్వహణ

- 'అమృత్ కాలంలో ప్రజలకు చేరువగా సైన్స్ అండ్ టెక్నాలజీ' అనే ఇతివృత్తంతో ఏర్పాటు

Posted On: 15 NOV 2023 11:07AM by PIB Hyderabad

9వ విడత ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ఎఫ్) -2023ని జనవరి 17-20, 2024 వరకు హర్యానాలోని ఫరీదాబాద్‌లో నిర్వహించనున్నారు. భారతదేశపు ఈ మెగా సైన్స్ ఫెయిర్ ఫరీదాబాద్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి చెందిన క్యాంపస్ ఆఫ్ ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (టిహెచ్ఎస్టీఐ) మరియు రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ (ఆర్సీజీ)లో జరుగుతుంది. 'అమృత్ కాలంలో ప్రజలకు చేరువగా సైన్స్ అండ్ టెక్నాలజీ' అనే ఇతివృత్తంతో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఐఐఎస్ఎఫ్- 2023 విద్యార్థులు, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పరిశ్రమ నిపుణులు, వ్యవస్థాపకులు మరియు సైన్స్ కమ్యూనికేటర్‌ల వంటి విభిన్న స్థాయి ప్రజలను ప్రేరేపించడానికి గాను ఒక వేదికను అందించడమే లక్ష్యంగా నిర్వహించనున్నారు.  ఐఐఎస్ఎఫ్ -2023లో పాల్గొనేవారికి మరియు భాగస్వామ్యపక్షాల వారికి సాధారణ ప్రజలకు విభిన్న ప్రయోజనాలను అందించే శాస్త్రీయ విజయాలను ప్రదర్శించడానికి ఇందులో మొత్తం 17 థీమ్‌లు ఉంటాయి. భాగస్వామ్య పక్షాల వారికి జాతీయ మరియు అంతర్జాతీయ నిపుణులతో కూడిన సెమినార్‌లు, స్పీకర్‌లతో పరస్పర చర్చలు, ప్రదర్శనలు, పోటీలు, వర్క్‌షాప్‌లు, జ్ఞాన-భాగస్వామ్య కార్యకలాపాలు, సాంకేతిక ప్రదర్శనలు మొదలైన వాటిని ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయనున్నారు. ఐఐఎస్ఎఫ్ సంపన్న భారతదేశం యొక్క పురోగతి కోసం సైన్స్, టెక్నాలజీ మరియు ఆవిష్కరణలలో సృజనాత్మకతను పెంపొందించడానికి అంకితం చేయబడింది. విజ్ఞాన భారతి సహకారంతో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ యొక్క సహకార ప్రయత్నాల ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో ఈ కార్యక్రమం చేపట్టబడింది. 2015 నుండి భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఎనిమిది ఎడిషన్ల ఐఐఎస్ఎఫ్ నిర్వహించబడింది.  కాలక్రమంతో ఇది మెగా సైన్స్ ఫెస్టివల్‌గా విస్తరించింది. 2021 సంవత్సరంలో ఐఐఎస్ఎఫ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అంతర్భాగంగా నిర్వహించబడుతోంది.

 

****



(Release ID: 1977246) Visitor Counter : 84