ఆర్థిక మంత్రిత్వ శాఖ
అత్యంత నాణ్యమైన పట్టణ మౌలిక సదుపాయాల కల్పన, సేవల అందుబాటును మెరుగుపరచడం, సమర్ధపాలనా వ్యవస్థను ప్రోత్సాహానికి మద్దతు తెలిపేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబికి), భారత ప్రభుత్వానికి మధ్య కుదిరిన రుణ ఒప్పందం.
Posted On:
13 NOV 2023 4:20PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం, ఈరోజు ఆసియా అభివవవృద్ధి బ్యాంకుతో విధాన ఆధారిత 400 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ మొత్తాన్ని భారత్ అమలు చేస్తున్న పట్టణ సంస్కరణలలో భాగంగా,
అత్యున్నతస్థాయి పట్టణ మౌలిక సదుపాయాలను కల్పించడానకి, సేవల అందుబాటును మెరుగుపరచడానికి, పాలనా వ్యవస్థను మరింత మెరుగు పరచడాన్ని ప్రోత్సహించడానికి దీనిని ఉపయోగిస్తారు.
సుస్థిర పట్టణాభివృద్ధి , సేవల అందుబాటు , రెండవ ఉపకార్యక్రమం కింద కుదిరిన ఈ ఒప్పందంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ఆర్థిక వ్యవహారాల సంయుక్త కార్యదర్శి శ్రీమతి జుహి ముఖర్జీ భారత ప్రభుత్వం తరఫున సంతకం చేయగా, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి) తరఫున ఇండియా రెసిడెంట్ మిషన్ , కంట్రీ డైరక్టర్ టకెయో కొనిషి సంతకం చేశారు.
సుస్థిర పట్టణాభివృద్ధి ఉప కార్యక్రమం 1ను 2021లో ఆమోదించారు. ఇందుకు 350 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయంతో దీనిని చేపట్టారు. పట్టణ సేవలు మెరుగు పరచడానికి జాతీయ స్థాయి విధానాలు, మార్గదర్శకాలు రూపొందించారు. మరో ఉప కార్యక్రమం –2 పెట్టుబడుల ప్రణాళిక, సంస్కరణల కార్యాచరణను రాష్ట్రాలు, స్థానిక సంస్థల (యుఎల్బి) ల స్థాయికి తీసుకువెళుతుంది.
రుణ ఒప్పందం సంతకం తర్వాత , శ్రీమతి ముఖర్జీ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం భారతప్రభుత్వ పట్టణాలకు సంబంధించిన వ్యూహానికి మద్దతు నిస్తోందన్నారు. ఇది పట్టణ సంస్కరణలపై దృష్టిపెడుతుందని.
ఆ రకంగా పట్టణాలు ,నగరాలు మరింత నివాసయోగ్యంగా, ఆర్ధిక వృద్ధి కేంద్రాలుగా , సమ్మిళిత అభివృద్ధితో పురోగమించే విధంగా, సుస్థిర మౌలిక సదుపాయాలపై దృష్టి కేంద్రీకరిస్తుందని తెలిపారు.
“సబ్ ప్రోగ్రామ్ 2 రాష్ట్రాలు చేపట్టిన సంస్కరణలకు, పట్టణ స్థానిక సంస్థలు చేపట్టిన సంస్కరణలకు మద్దతు నిస్తుంది. అలాగే జాతీయ ఫ్లాగ్షిప్ కార్యక్రమం అటల్ మిషన్ ఫర్ రిజువినేషన్, అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (
(అమృత్) 2.0 ఆచరణకు, సార్వజనీన నీటిరఫరా, పారిశుధ్యం లక్ష్యసాధనకు మద్దతు నిస్తుందని శ్రీ కొనిషి అన్నారు.
“ఈ ఉప కార్యక్రమం ఈ మిషన్ కు సంబంధించిన ఇతర లక్ష్యాలకు కూడా మద్దతు నిస్తుంది. ఇది నీటి వృధాను అరికడుతూ , పట్టణ స్థాయిలో నీటి భద్రతకు వీలు కల్పిస్తుంది. అలాగే మురుగు నీటిని శుద్ధి
చేసి వాటిని గృహేతర అవసరాలకు వాడడం, జలవనరులను పునరుత్తేజితం చేయడం, భూగర్భ జలాలు నిరంతరాయంగా పుష్కలంగా ఉండేట్టు చూడడం’’ వంటివి ఇందులో ఉన్నాయి.
ప్రత్యేకించి, పట్టణ, స్థానిక సంస్థలు నియమనిబంధనలను రూపొందించడం ద్వారా ఆధునికతను ప్రోత్సహిస్తాయి.అలాగే భూసేకరణ, శివారు ప్రాంతాల అభివృద్ధి,
పట్టణ ప్రాంతాల ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరోక ప్రాంతానికి సులభంగా వెళ్లేందుకు వీలు కల్పించడం, రవాణా సంబంధిత అభివృద్ధి, ఆర్ధికాభివృద్ధికి సంబంధించి పటిష్టమైన ప్రణాళికతో రూపుదిద్దుకున్న కేంద్రాలు వంటివి ఉన్నాయి.
ఈ సమీకృత ప్రణాళికా ప్రక్రియలో వాతావరణం, విపత్తులనుంచి తట్టుకునేలా చూడడం, ప్రకృతి ఆధారిత పరిష్కారాలను ప్రోత్సహించడం, పట్టణ పర్యావరణాన్ని మెరుగుపరచడం, నగరాల అభివృద్ధి,
అదనపు రాబడిని సమకూర్చుకోవడం ద్వారా ఆర్థిక సుస్థిరతను పొందడం వంటివి ఇందులో ఉన్నాయి.దీనికి తోడు, నగరాల వ్యవస్థలో వివిధ సంస్కరణలు తీసుకురావడం ద్వారా అవి తమ రాబడిని పెంచుకునేందుకు అంటే ఆస్థిపన్ను, ఇతర యూజర్ చార్జీల ద్వారా రాబడి పెంచుకునేలా చేయడం ద్వారా వాటి అభివృద్ధికి అవసరమైన రుణాలు పొందే స్థోమతను వాటికి కల్పించేలా చూడడం జరుగుతుంది. ఈ చర్యలు వాటిపనితీరును మెరుగుపరచడంతో పాటు, వాటి ఖర్చును హేతుబద్ధం చేస్తుంది.ఇది వాణిజ్యపరమైన రుణాలు సమకూర్చుకోవడానికి, మునిసిపల్ బాండ్ల జారీకి, సబ్ సావరిన్ రుణపత్రాల జారీకి, పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యానికి, నగర మౌలిక సదుపాయాల పెట్టుబడులలో
ఏర్పడిన అంతరాన్ని తొలగించడానికి ఇది ఉపకరిస్తుంది.
***
(Release ID: 1976818)
Visitor Counter : 81