వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ ఎఫ్ వై 2023-24లో ఎనిమిది నెలల కంటే తక్కువ కాలంలో రూ 2 లక్షల కోట్ల స్థూల వ్యాపార విలువ మైలురాయిని సాధించింది


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీ ఎం వీ సగటున రోజుకు ₹850 కోట్లతో గణనీయమైన వృద్ధిని సాధించింది.

Posted On: 13 NOV 2023 4:03PM by PIB Hyderabad

ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ (జీ ఈ ఎం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది నెలల కంటే తక్కువ వ్యవధిలో స్థూల వాణిజ్య విలువ (జీ ఎం వీ)లో ₹2 లక్షల కోట్లను అధిగమించడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం (2022-23) లో రోజుకు సగటు జీ ఎం వీ లో కూడా గణనీయమైన వృద్ధిని సాధించింది మరియు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రోజుకు ₹850 కోట్లకు చేరుకుంది.

 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ముఖ్యమైన జీ ఎం వీ సాధనకు  కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర సంస్థలు మొత్తం వ్యాపారం లో 83% తో  గణనీయమైన పాత్ర పోషించారు.

 

అలాగే, జీ ఈ ఎం మిగిలిన 17%  రాష్ట్ర ప్రభుత్వాల  భాగస్వామ్యం తో పౌర సేకరణ కొనుగోళ్లలో దేశవ్యాప్తంగా తన  ప్రభావాన్ని  మరింత నొక్కి చెబుతుంది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, ఒడిశా, బీహార్, అస్సాం, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గణనీయమైన మొత్తంలో సేకరణ ఆర్డర్‌లను ఇచ్చాయి.

 

కేంద్ర మరియు రాష్ట్ర సంస్థల జీ ఈ ఎం మధ్య    సామరస్యపూర్వకమైన సహకారం లో ఉభయ ప్రయోజనం ఉంది, ఇది జీ ఈ ఎంని అపూర్వమైన విజయవంతమైన శిఖరాలకు నడిపిస్తుంది.

 

సేవల రంగంలోకి జీ ఈ ఎం  విస్తరణ దాని ప్రగతి లో కీలక  పాత్ర పోషించింది.  సేవల విభాగం,  ఆర్డర్ విలువ పెరుగుదలలో గత 3 సంవత్సరాలలో అద్భుత వృద్ధితో జీ ఈ ఎం విజయగాథలో ప్రకాశవంతమైన అధ్యాయం. ఎఫ్ వై 21-22లో 23% నుండి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 46%కి పెరిగి, ప్లాట్‌ఫారమ్ ద్వారా లావాదేవీలు జరిపిన మొత్తం ఆర్డర్ విలువలో సేవల రంగం అద్భుతమైన పెరుగుదలను ప్రదర్శించింది.

 

ఈ అత్యుత్తమ సాఫల్యం ప్లాట్‌ఫారమ్ యొక్క వేగవంతమైన వృద్ధిని మాత్రమే కాకుండా భారతదేశం అంతటా ప్రజా సేకరణను మార్చడంలో దాని కీలక పాత్రను ప్రతిబింబిస్తుంది. జీ ఈ ఎం యొక్క అపూర్వమైన వృద్ధికి పౌర కొనుగోళ్ల ప్రక్రియలలో సమర్థత మరియు పారదర్శకత పట్ల దాని నిబద్ధత కారణమని చెప్పవచ్చు.  విస్తృత శ్రేణి ఉత్పత్తులు మరియు సేవలు సులువుగా మరియు ఖర్చు ఆదా పద్ధతిలో ఉండటం వల్ల ప్రభుత్వ ఏజెన్సీలు  వినియోగించుకోవడానికి వీలు కల్పిస్తుంది.

 

దాదాపు 312 సేవా కేటగిరీలు మరియు 11,800 కంటే ఎక్కువ ఉత్పత్తి వర్గాల యొక్క విభిన్న కేటలాగ్‌లను ఈ పోర్టల్ ప్రదర్శిస్తుంది.  ప్రభుత్వ కొనుగోలుదారుల యొక్క మారుతున్న అవసరాలకు తగిన విధంగా అన్ని స్థాయిలకు అనుగుణంగా పోర్టల్ సన్నద్ధం గా ఉంది. 

జీ ఈ ఎం తన వాటాదారుల  మద్దతుతో ₹5.93 లక్షల కోట్ల జీ ఎం వీని అధిగమించింది. జీఎమ్‌లో మొత్తం లావాదేవీల సంఖ్య కూడా 1.8 కోట్లు దాటింది.

 

అదనంగా, సమ్మిళితం మరియు ప్రాప్యత పట్ల జీ ఈ ఎం యొక్క అచంచలమైన అంకితభావం దాని దూరదృష్టికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇ-గ్రామ్ స్వరాజ్‌తో ప్లాట్‌ఫారమ్ యొక్క నిరంతర ఏకీకరణ, పంచాయతీ-స్థాయి సేకరణను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది దాని నిబద్ధతను నొక్కిచెప్పడమే కాకుండా, అట్టడుగు స్థాయి నిర్వహణలో ఖర్చులను ఆదా చేస్తూ మారుమూల విక్రేతలతో అనుసంధానతలో  అసమానమైన నైపుణ్యాన్ని కూడా ప్రదర్శిస్తుంది. ఈ విశేషమైన ప్రయత్నం భారతదేశ ప్రభుత్వ సేకరణపై  తీవ్ర ప్రభావాన్ని ప్రదర్శిస్తూ, జీ ఈ ఎం యొక్క ప్రభావాన్ని పెంచుతుంది.

 

మార్కెట్‌లో సమ్మిళిత మరియు వైవిధ్యత ను పెంపొందించడానికి జీ ఈ ఎం యొక్క బహుముఖ విధానం కూడా దాని విజయానికి తోడ్పడింది.  ప్రత్యేకించి చిన్న మరియు మధ్యతరహా సంస్థలు, మహిళా వ్యాపారవేత్తలు, స్టార్టప్‌లు మరియు చేతివృత్తులవారు వంటి అట్టడుగున ఉన్న అమ్మకందారుల ప్రత్యేక అవసరాలు మరియు పరిమితులను దృష్టి లో వుంచుకొని ప్లాట్‌ఫారమ్ తన సేవలు అందిస్తుంది.  సంస్థల పరిమాణం మరియు ప్రజాదరణతో సంబంధం లేకుండా సరైన వ్యాపార అవకాశాలను అందించాలనే ఉద్దేశ్యంతో దీని విధానాలు రూపొందించబడ్డాయి. ప్లాట్‌ఫారమ్ ద్వారా లావాదేవీలు జరిపిన మొత్తం ఆర్డర్ విలువలో దాదాపు 49%  ఎం ఎస్ ఈ లకు అందించబడింది. కేవలం 7 నెలల్లో, 45000 కంటే ఎక్కువ ఎం ఎస్ ఈ లు జీ ఈ ఎం లో  అధీకృత విక్రేతలు/సర్వీస్ ప్రొవైడర్లుగా నమోదు చేసుకున్నారు.

 

2016 నుండి ప్రభుత్వం ₹45,000 కోట్లకు పైగా ఆదా  చేయడం ద్వారా ఖర్చు ఆదాపై అంకితభావంతో వ్యవహరించడం జీ ఈ ఎం విజయం యొక్క ముఖ్య లక్షణం. ఆర్థిక సర్వే 2021-22 ప్రకారం, 22లో 10కి ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల కంటే జీ ఈ ఎం లో సరుకుల ధరలు 9.5% తక్కువగా ఉన్నాయి. జీ ఈ ఎం యొక్క పరివర్తన ప్రయాణం అత్యాధునిక సాంకేతికత మరియు ఆవిష్కరణల ద్వారా పారదర్శకత, సామర్థ్యం మరియు సమ్మిళితకు నిదర్శనం.

 

జీ ఈ ఎం అభివృద్ధి చెందుతూనే ఉంది, ఇది భారత ప్రభుత్వం యొక్క డిజిటల్ పరివర్తన మరియు దేశీయంగా తయారు చేయబడిన ఉత్పత్తులు మరియు సేవల వినియోగాన్ని ప్రోత్సహించే "మేక్ ఇన్ ఇండియా" చొరవకు మూలస్తంభమైంది.

 

***


(Release ID: 1976814) Visitor Counter : 76