శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
8వ ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకున్న సీఎస్‌ఐఆర్-ఎన్‌ఐఎస్‌సీపీఆర్
Posted On:
13 NOV 2023 12:02PM by PIB Hyderabad
8వ ఆయుర్వేద దినోత్సవాన్ని (9 నవంబర్ 2023) పురస్కరించుకుని, స్వస్తిక్ చొరవలో భాగంగా, “జీవనశైలి రుగ్మతల్లో ఆయుర్వేదం పాత్ర” అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాసాన్ని సీఎస్‌ఐఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (ఎన్‌ఐఎస్‌సీపీఆర్) నిర్వహించింది. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్‌ఏఎస్) సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. సీఎస్‌ఐఆర్-ఎన్‌ఐఎస్‌సీపీఆర్ ప్రధాన శాస్త్రవేత్త శ్రీ ఆర్.ఎస్.జయసోము అతిథులను సాదరంగా స్వాగతిస్తూ ప్రారంభ ఉపన్యాసం చేశారు. మన దైనందిన జీవితంలో, ముఖ్యంగా ప్రస్తుతం అనుకూలంగా లేని పర్యావరణ పరిస్థితుల దృష్ట్యా ఆయుర్వేదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన శ్రీ జయసోము స్పష్టం చేశారు. సీఎస్‌ఐఆర్-ఎన్‌ఐఎస్‌సీపీఆర్ శాస్త్రవేత్త డాక్టర్ పరమానంద బర్మాన్, న్యూదిల్లీలోని సెంట్రల్ ఆయుర్వేద రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పరిశోధన అధికారి (ఆయుర్వేదం) డా.సాక్షి శర్మను ముఖ్య వక్తగా సభకు పరిచయం చేశారు. సభలో మాట్లాడిన డా.శర్మ, అనారోగ్యాల నుంచి కోలుకునే ప్రక్రియ కంటే అనారోగ్యం బారిన పడని మంచి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరంపై మాట్లాడారు. సాంప్రదాయ జ్ఞానం ప్రాముఖ్యతను, వ్యక్తుల జీవనశైలిని అంచనా వేయకుండా మందులను ఆశ్రయించే సర్వసాధారణ విధానంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి, ఆయుర్వేద గడియారం, ఆహార పద్ధతులు, ఒత్తిడి సంబంధిత ఆరోగ్య సమస్యలను తగ్గించే వ్యూహాలు వంటి ఆయుర్వేదంలోని వివిధ కోణాలతో ఆమె ఉపన్యాసం సాగింది. ఉపన్యాసం అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగింది.ముఖ్య వక్తకు, ఆహుతులకు సీఎస్‌ఐఆర్-ఎన్‌ఐఎస్‌సీపీఆర్ ముుఖ్య శాస్త్రవేత్త & పీఐ/కో-ఆర్డినేటర్ డా.చారులత కృతజ్ఞతలు తెలిపారు. సీఎస్‌ఐఆర్-ఎన్‌ఐఎస్‌సీపీఆర్ ముఖ్య శాస్త్రవేత్త డా.సుమన్ రే ఆధ్వర్యంలో జరిగిన ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరంతో ఉపన్యాస కార్యక్రమం ముగిసింది.
<><><>
(Release ID: 1976706)
Visitor Counter : 82