భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
స్వచ్ఛత ప్రత్యేక కార్యక్రమం 3.0 ని విజయవంతంగా అమలు చేసిన భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ
ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పార్లమెంట్ సభ్యుల నుంచి అందిన సూచనలు పరిష్కరించి, పరిశుభ్రత కోసం 62 కార్యక్రమాలు నిర్వహించిన భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ
Posted On:
13 NOV 2023 12:12PM by PIB Hyderabad
స్వచ్ఛత ప్రత్యేక కార్యక్రమం 3.0 ని భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ విజయవంతంగా అమలు చేసింది. కార్యక్రమంలో భాగంగా న్యూ ఢిల్లీలోని పృథ్వీ భవన్‌లోని ప్రధాన కార్యాలయం , దేశంలోని వివిధప్రాంతాల్లో పనిచేస్తున్న పది సంస్థల్లో మంత్రిత్వ శాఖ లక్ష్యాల మేరకు కార్యక్రమాలు అమలు చేసింది.
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2, 2023న కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛత ప్రత్యేక ప్రచారం 3.0 ప్రారంభించింది. కార్యక్రమం 2023 అక్టోబర్ 31 వరకు అమలు జరిగింది.సుపరిపాలన కోసం సంస్థాగతంగా స్వచ్ఛత సాధించి, పెండింగ్ లో ఉన్న ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడం, వ్యర్థాలను తొలగించడం పనికి రాని/ ఉపయోగించని ఫైళ్లను తొలగించడం, కొత్తగా పని స్థలాన్ని అందుబాటులోకి తేవడం లక్ష్యంగా స్వచ్ఛత ప్రత్యేక కార్యక్రమం 3.0 ని అమలు చేయాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛత ప్రత్యేక కార్యక్రమం 3.0 ని భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ విజయవంతంగా అమలు చేసింది.
స్వచ్ఛత ప్రత్యేక కార్యక్రమం 3.0 ని అమలు చేయడానికి ముందు భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్. ఎం. రవిచంద్రన్ శాఖ సీనియర్ అధికారులతో 2023 సెప్టెంబర్ నెలలో సమావేశం నిర్వహించి ప్రణాళిక రూపొందించారు. ప్రణాళికలో భాగంగా భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ, శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న సంస్థలు 62 కార్యక్రమాలు నిర్వహించాయి. 2023 అక్టోబర్ 31 వరకు అమలు జరిగిన కార్యక్రమంలో 7,375 చదరపు అడుగుల స్థలాన్ని తిరిగి వినియోగం లోకి తీసుకు వచ్చారు.ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించిన మంత్రిత్వ శాఖ పాఠశాలలు, బీచ్‌లు, బస్టాప్‌లు, హాస్పిటల్ కాంప్లెక్స్‌లు, చెరువులు, పార్కులు మొదలైన ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించింది. పనికిరాని వస్తువుల విక్రయం ద్వారా శాఖ 5,04,333 రూపాయల ఆదాయం ఆర్జించింది.
ఫిట్ ఇండియా కార్యక్రమం మంత్రిత్వ శాఖలో అమలు జరిగేలా చూసేందుకు మంత్రిత్వ శాఖ స్వచ్ఛత ప్రత్యేక కార్యక్రమం 3.0 లో చర్యలు చేపట్టింది. ఉద్యోగుల కోసం ఒక పాత గదిని క్రీడల కోసం సిద్ధం చేశారు. దీనిలో టేబుల్ టెన్నిస్, క్యారమ్, చెస్ ఆడేందుకు, యోగా చేసేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. మంత్రిత్వ శాఖ ఉద్యోగులు, సిబ్బంది మధ్య సంపూర్ణత, సామర్థ్యం, స్నేహాన్ని పెంపొందించడానికి లక్ష్యంగా ఈ సౌకర్యాలు అభివృద్ధి చేశారు. మధ్యాహ్న భోజన సమయం, సాయంత్రం పని వేళలు ముగిసిన తర్వాత రెండు గంటలపాటు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. రిక్రియేషన్ రూమ్ ని అక్టోబర్ 30న మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ రవిచంద్రన్ ప్రారంభించారు.
కార్యాలయ వ్యర్థాల సేకరణ, విభజన కోసం మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో 3Rs (తగ్గించు,పునర్వినియోగం, రీ సైకిల్) కియోస్క్ ఏర్పాటయింది. కార్యక్రమంలో పట్టణ స్థానిక సంస్థలు పాల్గొన్నాయి. మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత పెంపొందించి, అవగాహన కల్పించడానికి వ్యర్థాలతో తయారు చేసిన ఉత్పత్తులను స్వయం సహాయక బృందాలు ప్రదర్శించాయి.
నెల రోజుల పాటు అమలు చేసిన కార్యక్రమంలో మంత్రిత్వ శాఖ 9,577 భౌతిక, 524 ఎలక్ట్రానిక్ ఫైళ్లను సమీక్షించింది, వీటిలో 2,662భౌతిక ఫైళ్లు, 20 ఎలక్ట్రానిక్ ఫైళ్లను తొలగించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పెండింగ్ లో అన్ని ప్రజా ఫిర్యాదులను (38 దరఖాస్తులు, 17 అప్పీళ్లు) , పార్లమెంట్ సభ్యుల నుంచి అందిన అన్ని సూచన (6) లను మంత్రిత్వ శాఖ పరిష్కరించింది.
స్వచ్ఛత ప్రత్యేక కార్యక్రమం 3.0 సాధించిన ప్రగతి, అమలు జరుగుతున్న తీరుపై https://scdpm.nic.in/)లో మంత్రిత్వ శాఖ పొందుపరిచింది. మంత్రిత్వ శాఖ హ్యాండిల్స్ @moesgoiలో 121 సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా ప్రజలకు అందించారు. . వీటిలో ట్విట్టర్ లో 33, ఫేస్‌బుక్‌లలో 33, ఇన్‌స్టాగ్రామ్‌లో 30 కూలో 25 పోస్ట్‌లు ఉన్నాయి. @moesgoi సోషల్ మీడియా ద్వారా (నవంబర్ 01, 2023 నాటికి) ప్రత్యేక కార్యక్రమం వివరాలను 45,000 పైగా ప్రజలు వీక్షించారు.
న్యూ ఢిల్లీలోని లోధి రోడ్‌లోని పృథ్వీ భవన్‌లోని ప్రధాన కేంద్రంగా భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ పనిచేస్తోంది. మంత్రిత్వ శాఖ పరిధిలో పూణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ, హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, గోవాలోని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్, చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, కేరళలోని నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, న్యూఢిల్లీలోని భారత వాతావరణ శాఖ, నోయిడాలోని మధ్యస్థ-శ్రేణి వాతావరణ సూచన జాతీయ కేంద్రం పనిచేస్తున్నాయి. న్యూ ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ, కొచ్చిలోని సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ CMLRE చెన్నైలోని నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్, బోర్‌హోల్ జియోఫిజిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ (BGRL), కరాడ్, మహారాష్ట్ర. అనుబంధ కార్యాలయాలుగా పనిచేస్తున్నాయి.
***
(Release ID: 1976667)
Visitor Counter : 73