సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
'సమగ్ర డిజిటల్ ప్రకటనల విధానం 2023' ని ఆమోదించిన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
డిజిటల్ యుగంలో ప్రభుత్వ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించడానికి వీలు కల్పించే విధంగా 'సమగ్ర డిజిటల్ ప్రకటనల విధానం 2023' రూపకల్పన
Posted On:
10 NOV 2023 12:06PM by PIB Hyderabad
'సమగ్ర డిజిటల్ ప్రకటనల విధానం 2023' కి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. 'సమగ్ర డిజిటల్ ప్రకటనల విధానం 2023' వల్ల కేంద్ర ప్రభుత్వ ప్రకటనల విభాగం అయిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కి విస్తరిస్తున్న డిజిటల్ మీడియా రంగంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించడానికి అధికారం లభిస్తుంది. ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తున్న వివిధ పథకాలు,విధానాలకు సంబంధించిన సమాచారానికి విస్తరిస్తున్న డిజిటల్ మీడియా రంగంలో విస్తృత ప్రచారం కల్పించి, వివిధ రంగాలకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కు అవకాశం లభిస్తుంది.
అభివృద్ధి చెందుతున్న డిజిటల్ మీడియా రంగం పెద్ద సంఖ్యలో వీక్షకులను కలిగివుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పనిచేస్తున్న డిజిటల్ మీడియా రంగంలో తక్కువ ఖర్చుతో ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలు, విధానాలను గుర్తించిన వర్గాలకు సమర్ధంగా చేరడానికి వివిధ విధానాలు అందుబాటులో ఉంటాయి. ఇటీవల కాలంలో డిజిటల్ మీడియా రంగాన్ని వినియోగిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్ ఇండియా కార్యక్రమానికి ఇంటర్నెట్, సోషల్, డిజిటల్ మీడియా వినియోగిస్తున్న ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది. 2023 జనవరి-మార్చి కాలానికి సమందించి ట్రాయ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో ఇంటర్నెట్ వ్యాప్తి 880 మిలియన్లకు పైగా ఉంది. 2023 మార్చి నాటికి టెలికాం చందాదారుల సంఖ్య 1172 మిలియన్లకు పైగా ఉంది.
నూతన విధానం ప్రకారం ఓటిటీ, వీడియో ఆన్ డిమాండ్ స్పేస్ వ్యవస్థలో ఏజెన్సీలు, సంస్థలను ఎంప్యానెల్ చేయడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అధికారం లభిస్తుంది. డిజిటల్ ఆడియో ప్లాట్‌ఫారమ్‌ల ఎంపానెల్‌మెంట్ ద్వారా పాడ్‌క్యాస్ట్‌లు, డిజిటల్ ఆడియో ప్లాట్‌ఫారమ్‌లకు పెరుగుతున్న శ్రోతలను కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కారక్రమాలు చేరుతాయి. నూతన విధానం ద్వారా ఇంటర్నెట్ వెబ్‌సైట్‌లను ఎంప్యానెల్ చేసే ప్రక్రియను హేతుబద్ధీకరించడానికి, మొదటిసారిగా మొబైల్ అప్లికేషన్‌ల ద్వారా ప్రజలకు సంబంధించిన ప్రచార సందేశాలను ప్రసారం చేయడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కు అధికారం లభిస్తుంది. ప్రజల మధ్య సమాచార వ్యాప్తి చేయడంలో సామాజిక మాధ్యమాల పాత్ర గణనీయంగా పెరిగింది. నూతన విధానం వల్ల సామాజిక మాధ్యమాల్లో కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కు ప్రభుత్వ ప్రకటనలు జారీ చేసే అధికారం లభిస్తుంది. వివిధ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఎక్కువ మందికి చేరేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కు అవకాశం కల్పించడంతో పాటు డిజిటల్ మీడియా ఏజెన్సీలను ఎంప్యానెల్ చేయడానికి నూతన విధానం అధికారం ఇస్తుంది.
విస్తరిస్తున్న డిజిటల్ మీడియా రంగం ప్రాధాన్యత గుర్తించిన నూతన విధానం చట్టబద్ధంగా ఏర్పాటయ్యే కమిటీ ఆమోదంతో డిజిటల్ మీడియా రంగంలో నూతన ఒరవడి సృష్టించడానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కు అవకాశం కల్పిస్తుంది. పారదర్శక విధానంలో అమలు అయ్యే విధంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ డిజిటల్ అడ్వర్టైజ్‌మెంట్ పాలసీ, 2023 రూపొందింది. పారదర్శకత, సామర్థ్యాలకు ప్రాధాన్యత ఇస్తూ రేటు నిర్ధారణ కోసం పోటీ బిడ్డింగ్ విధానం అమలు అవుతుంది.
ఈ ప్రక్రియ ద్వారా నిర్ధారించిన రేట్లు మూడు సంవత్సరాల పాటు చెల్లుబాటులో ఉంటాయి. అన్ని అర్హత కలిగిన ఏజెన్సీలకు రేట్లు వర్తిస్తాయి.
ప్రస్తుత డిజిటల్ యుగంలో అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/విభాగాలు ప్రత్యేక సోషల్ మీడియా హ్యాండిల్‌లను కలిగి ఉన్నాయి. వీటి ద్వారా ప్రసారం అవుతున్న ఇన్ఫోగ్రాఫిక్స్, వీడియోలు హ్యాండిల్ చందాదారులకే పరిమితంఅవుతున్నాయి. నూతన విధానం వల్ల ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు , విభాగాల ప్రచార కార్యక్రమాల విస్తృతి పెరుగుతుంది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మీడియా యూనిట్ అయిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ప్రకటనలు విడుదల చేస్తుంది. సంబంధిత వర్గ;లతో విస్త్రుత్వ స్థాయిలో చర్చలు, సంప్రదింపులు జరిపిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డిజిటల్ అడ్వర్టైజ్‌మెంట్ పాలసీ 2023ని రూపొందించింది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలు, ప్రజా సంక్షేమ విధానాల వివరాలు ఎక్కువ మంది ప్రజలకు చేరుతాయి.
కేంద్ర సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, విధానాల గురించి అవగాహన కల్పించడం , సమాచారాన్ని వ్యాప్తి చేయడం కోసం కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మీడియా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పనితీరు మార్చుకుంటున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఎక్కువ మంది ప్రజలకు కార్యక్రమాలు అందుబాటులోకి తెచ్చేందుకు ఆధునిక సాంకేతికతలను అమలు చేయడానికి చర్యలు అమలు చేస్తోంది.
***
(Release ID: 1976217)
Visitor Counter : 216
Read this release in:
English
,
Khasi
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam