రక్షణ మంత్రిత్వ శాఖ
శరీర సమతుల్యత, తల తిరిగే వ్యాధులు గల రోగుల కోసం అత్యాధునిక సమగ్ర వెస్టిబ్యులార్ ప్రయోగశాలను ఏర్పాటు చేసిన ఢిల్లీ కాంట్‌లోని ఆర్మీ బేస్ ఆసుపత్రి
Posted On:
09 NOV 2023 1:22PM by PIB Hyderabad
సమగ్రమైన వెస్టిబ్యులార్ (శరీర సమతుల్యత, తల కదలికలకు బాధ్యురాలైన వ్యవస్థ) ప్రయోగశాలను ఏర్పాటు చేయడం ద్వారా ఇప్పటికే గల తన ఔషధాల, వైద్య సాంకేతికతకు మరొక అత్యాధునిక స్వస్థత చొరవకు ఢిల్లీ కాంట్‌లో గల ఆర్మీ బేస్ ఆసుపత్రి జోడించింది. ఈ ప్రయోగశాల శరీర సమతుల్యతకు సంబంధించిన వ్యాధి, తల తిప్పుడు రోగులకు అత్యంత లబ్ధి చేకూరుస్తుందని అంచనా. ఈ అత్యాధునిక సాంకేతికగల ప్రయోగశాలను లెఫ్టనెంట్ జనరల్ అరిందమ్ ఛటర్జీ, డిజిఎంఎస్ (సైన్యం), కల్నల్ కమాండెంట్ ఎఎంసి 7 నవంబర్ 2023న ప్రారంభించారు.
ఈ సందర్భంగా, అత్యాధునిక సమగ్ర వెస్టిబ్యులార్ ప్రయోగశాలను ఏర్పాటు చేసినందుకు ఢిల్లీ కాంట్‌లోని బేస్ హాస్పిటల్ బృందాన్ని లెఫ్టనెంట్ జనరల్ దిల్జీత్ సింగ్, డిజిఎఎఫ్ఎంఎస్ & సీనియర్ కల్నల్ కమాండెంట్ అభినందించారు. వెస్టిబ్యులార్ వ్యాధులను నిర్ధారించి, చికిత్స చేసే సామర్ధ్యాలను ముందుకు తీసుకువెళ్ళి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఆసుపత్రి విజయాన్ని సాధించాలని డిజిఎఎఫ్ఎంఎస్ ఆకాంక్షించారు.
ప్రయోగశాల నూతన నిర్ధారణ సీమలకు ద్వారాలను తెరిచి, ఇఎన్‌టి సర్జెన్ల శిక్షణను ఇవ్వడంలో ఉత్తమ ఆచరణలను పొందుపరచగలదని డిజిఎఎఫ్ఎంఎస్ అన్నారు. ఈ సౌకర్యం బహుళ ఎఎఫ్ఎంఎస్ ఇఎన్‌టి కేంద్రాలలో ఉన్నందున, బహుళ- కేంద్రీకృత పరిశోధనలకు అవకాశం కల్పించాలని డిజిఎంఎస్(సైన్యం) ఉద్బోధించారు.
***
(Release ID: 1976035)
Visitor Counter : 81