రక్షణ మంత్రిత్వ శాఖ
రేపు భారతదేశం- అమెరికా 2+2 మంత్రిత్వ స్థాయి చర్చలు
అమెరికా రక్షణ మంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరపనున్న రక్షణ మంత్రి
Posted On:
09 NOV 2023 9:26AM by PIB Hyderabad
భారత్ అమెరికా 2+2 మంత్రిత్వ స్థాయి చర్చల సహ-అధ్యక్షుడు మరియు రక్షా మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించనున్నారు. అమెరికా రక్షణ శాఖ మంత్రి శ్రీ లాయిడ్ ఆస్టిన్ నవంబర్ 09 & 10, 2023న భారతదేశాన్ని సందర్శిస్తున్నారు. నవంబర్ 09న న్యూ ఢిల్లీకి చేరుకోనున్న సెక్రటరీ ఆస్టిన్కు పాలెం టెక్నికల్ ఏరియాలో త్రివిధ దళాల గార్డ్ ఆఫ్ హానర్తో స్వాగతం పలుకుతారు. అమెరికా సెక్రటరీ శ్రీ ఆస్టిన్ మరియు US సెక్రటరీ ఆఫ్ స్టేట్ శ్రీ ఆంటోనీ బ్లింకెన్తో నవంబర్ 10న రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ మరియు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌లు 2+2 చర్చలు జరపనున్నారు. ఆ తర్వాత సెక్రటరీ ఆస్టిన్, రక్షా మంత్రి మధ్య ద్వైపాక్షిక సమావేశం జరుగుతుంది. 2+2 చర్చలు మరియు ద్వైపాక్షిక సమావేశంలో అనేక వ్యూహాత్మక, రక్షణ మరియు సాంకేతిక అంశాలు చర్చించబడతాయని భావిస్తున్నారు. సెక్రటరీ ఆస్టిన్ చివరిసారిగా జూన్ 2023లో భారతదేశాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు.
****
(Release ID: 1976033)
Visitor Counter : 86