గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వచ్ఛ దీపావళి నిర్వహణకు అదర్శం గా నిలుస్తున్న విశాఖ నగరం


పరిశుభ్రత, ఇంటి వ్యర్థాల ద్వారా కంపోస్ట్ తయారీ , నీటి సంరక్షణ, ప్లాస్టిక్ రీసైక్లింగ్ మొదలైన పర్యావరణ హిత చర్యలను ప్రోత్సహించడానికి ఎకో-వైజాగ్ కార్యక్రమానికి నడుంకట్టిన నగరం .

Posted On: 09 NOV 2023 5:32PM by PIB Hyderabad

చెత్త రహిత నగరాల లక్ష్యాన్ని సాధించేందుకు, దీపావళి వేడుకలను పరిశుభ్రంగా.. పర్యావరణహితంగా మార్చడానికి, పౌరులు, ప్రభుత్వసంస్థలు మాత్రమే కాకుండా, నగరాల్లోని వాణిజ్య సంస్థలు కూడా తమ వంతు పాత్రను పోషించడానికి ముందుకు రావడం అత్యవసరం. హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న తినుబండారాల అంగళ్లు   వంటి ఇతర వాణిజ్య సంస్థలు వంటి భారీ వ్యర్థాల ఉత్పత్తిదారులు, పెద్ద ఎత్తున పరిశుభ్రతను నిర్ధారించడంలో ముందుంటే ఆ  స్పృహతో.. వారు పెద్ద పాత్ర పోషించడం ద్వారా పరిస్థితిని మార్చే ప్రయత్నాలను విజయవంతం చేయగలరు,. ప్రతి రోజు 100 కిలోల ఘన వ్యర్థాలను ఉత్పత్తి చేసే సంస్థలు  ఈ ప్రయత్నానికి తోడుగా నిలిచాయి.   ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరం  ఎకో-వైజాగ్ అనే పర్యావరణ హిత  కార్యక్రమాన్ని ప్రారంభించింది, ఇది పర్యావరణ సుస్థిరత, స్థిరమైన వృద్ధి కనబరుస్తున్న  విశాఖపట్నం నగరాన్ని ఐకానిక్ సిటీగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మొదలైన కార్యక్రమం. ఈ సందర్భంగా దృష్టి సారించిన పర్యావరణం సంబంధ ఐదు కీలక అంశాలు.
శుభ్రత :  సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణతో పరిసరాలు, ఎకో-గ్రీన్: నగర పచ్చదనాన్ని మొక్కల పెంపకం ద్వారా కాపాడడం  , సంస్థలు, బృందాల సహాయంతో వనాల పెంపకం , ఇంట్లో వ్యర్థాలతో కంపోస్టు ఎరువు తయారీ,
ఎకో-బ్లూ: రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, క్లీన్ బీచ్‌లు, నీటి సంరక్షణ, ఎకో-జీరో ప్లాస్టిక్: పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలు, ప్లాస్టిక్ రీసైక్లింగ్, ఎకో- శూన్య కాలుష్యం: కాలుష్య నియంత్రణ.

 

 

ఈ కార్యక్రమ అమలు నిమిత్తం  ప్రచారం కోసం  కార్యాచరణ బృందాలు (ఎన్‌ఫోర్స్‌ మెంట్ టీమ్‌లు) ఏర్పడ్డాయి, వీటి  పని వ్యర్థాల ఉత్పాదకులైన హోటళ్లు, రెస్టారెంట్‌లతో సహా ఇతర  వ్యాపారాలపై తనిఖీ చేయడం, ప్రత్యామ్నాయ పర్యావరణ అనుకూల ఉత్పత్తులను (పేపర్, స్టీల్, గ్లాస్  వాడకం మొదలైనవి) ప్రచారం చేయడం..సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించడం. . సింగిల్ యూజ్ ప్లాస్టిక్, పిఇటి బాటిళ్ల వాడకం, ట్విన్ డబ్బాల ఉనికి, ఘన వ్యర్థాల మూలాన్ని వేరుచేయడం, ఆహారాన్ని అందించడానికి/ప్యాకింగ్ చేయడానికి అల్యూమినియం ఫాయిల్ వాడకం, ఎకో-వైజాగ్ ప్రచారానికి సంబంధించిన అవగాహన ప్రదర్శనలు వంటి వివిధ పారామితులపై ఈ బృందాలు మూల్యాంకనం చేస్తాయి.  చెక్క, ఉక్కు లేదా గాజు.. ఇలా మరెన్నో ప్రత్యామ్నాయ పద్దతుల్లో  తయారు చేసే కత్తిపీటల వాడకం ను ప్రోత్సహిస్తారు. పరిశుభ్ర నగర కార్యక్రమం  క్లీన్ అండ్ గ్రీన్ వైజాగ్‌కు సహకరించినందుకు గాను గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహిస్తున్న  హోటళ్లు.., రెస్టారెంట్‌లకు ప్రశంసా పత్రాన్ని అందజేస్తుంది. నోవోటెల్ వరుణ్ బీచ్, రాడిసన్ బ్లూ రిసార్ట్, వెల్‌కమ్ హోటల్ దేవీ గ్రాండ్ బే, ది గేట్‌వే హోటల్, డాల్ఫిన్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, షెరటాన్- ఫోర్ పాయింట్స్ , మారియట్- ఫెయిర్‌ఫీల్డ్., .ది పార్కర్ పర్యావరణ చర్యలను పెంపొందించడంలో వారి ప్రయత్నాలు ఆధారంగా ధృవీకరించిన సంస్థల జాబితాలో ఉన్నాయి. ఇవి  పర్యావరణ అనుకూల పద్ధతులు..ఎకో-వైజాగ్ కార్యక్రమం ను ప్రోత్సహించడం కోసం తీసుకున్న నిర్ణయం.

 

***


(Release ID: 1976032) Visitor Counter : 72


Read this release in: English , Urdu , Hindi