చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఒడిశాలోని కరపల్లి బజార్‌లో ‘వినియోగదారుల హక్కుల అవగాహన ప్రచారం’ నిర్వహించిన బెర్హంపూర్ విశ్వవిద్యాలయం న్యాయ విభాగం

Posted On: 08 NOV 2023 3:28PM by PIB Hyderabad

బెర్హంపూర్ విశ్వవిద్యాలయంలోని న్యాయ విభాగం, ఒడిశాలోని కరపల్లి బజార్‌లో ‘వినియోగదారుల హక్కుల అవగాహన ప్రచారం’ నిర్వహించింది. కేంద్ర న్యాయ విభాగానికి చెందిన న్యాయబంధు ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రోబోనోక్లబ్‌తో కలిసి, నవంబర్ 7, 2023న ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 

ImageImage

ImageImage

వినియోగదార్ల హక్కులు, వినియోగదార్ల వివాద పరిష్కార సంస్థలు, వినియోగదార్ల సహాయ కేంద్రాల ఫోన్‌ నంబర్ల గురించి ఈ కార్యక్రమంలో ప్రచారం చేశారు. వినియోగదార్ల సహాయ కేంద్రాలు, జిల్లా వినియోగదార్ల వివాదాల పరిష్కార కమిషన్ నుంచి ఎలా సాయం పొందొచ్చో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒక వీధి నాటకాన్ని కూడా ప్రదర్శించారు.

ImageImageImage

 

 

***


(Release ID: 1975809) Visitor Counter : 62


Read this release in: English , Urdu , Hindi , Tamil