రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
వైద్య ఉత్పత్తుల నియంత్రణ, వైద్య ఉత్పత్తుల నాణ్యతను పెంపొందించడంపై సహకరించుకోవడానికి ఉద్దేశించిన మెమోరాండంపై సంతకం చేసిన భారత్, నెదర్లాండ్స్
Posted On:
08 NOV 2023 4:22PM by PIB Hyderabad
ఇరు దేశాలకువైద్య ఉత్పత్తుల, ఆరోగ్య రక్షణ సేవల నాణ్యతను పెంపొందించడంపై, వైద్య ఉత్పత్తుల నియంత్రణ, క్రమబద్ధీకరణపై సహకరించుకునేందుకు మెమొరాండం ఆఫ్ ఇంటెంట్ (ఎంఒఐ)పై నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో భారత్, నెదర్లాండ్స్ సంతకాలు చేశాయి. ఈ ఎంఒఐపై కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖూబా కింగ్డమ్ ఆఫ్ నెదర్లాండ్స్ ఆరోగ్యమంత్రి, సంక్షేమం, క్రీడల మంత్రి ఎర్నస్ట్ క్యూపర్స్ తో సమావేశమైనప్పుడు సంతకాలు చేశారు.
హేగ్‌లో 6 నుంచి 8 నవంబర్ 2023 వరకు నిర్వహిస్తున్న రెండవ ప్రపంచ స్థానిక ఉత్పత్తి ఫోరం (డబ్ల్యుఎల్‌పిఎఫ్) సమావేశంలో పాల్గొనేందుకు శ్రీ ఖూబా నేతృత్వంలో భారతీయ బృందం నెదర్లాండ్స్‌లో ఉంది. ఔషదాలు, ఆరోగ్య సాంకేతికతల అందుబాటును పెంచాలన్న లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన చొరవలో భాగంగా సృష్టించిన వేదిక ప్రపంచ స్థానిక ఉత్పత్తి వేదిక.
మంత్రి యూరోపియన్ మెడిన్స్ ఏజెన్సీ (ఇఎంఎ)ను కూడా సందర్శించారు. దీనితో పాటుగా ఆయన ఫార్మస్యూటికల్స్ & మెడికల్ టెక్నాలజీ విభాగం డైరెక్టర్ కార్లా వాన్ రూయిజెన్‌ను కూడా కలిసి, ఫార్మాస్యూటికల్ & మెడికల్ టెక్నాలజీ పరిశ్రమలలో నియంత్రణల గురించి ఆమెతో ఫలవంతమైన చర్చ జరిపారు.
తన పర్యటనలో భాగంగా శ్రీ ఖూబా ఐరోపాలోని అతిపెద్ద ఓడరేవు అయిన పోర్ట్ ఆఫ్ రోట్టర్‌డామ్‌ను సందర్శించి, రేవులో హైడ్రొజెన్ హబ్ ప్రణాళికల గురించి సిఒఒ శ్రీబౌడ్విన్ సిమ్మన్స్, ఇతర అధికారులతో చర్చలు జరిపారు. రోట్టర్‌డామ్ హైడ్రొజన్ ఉత్పత్తి, రవాణాకు కేంద్రంగా మారడానికి సిద్దంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ సమర్ధవంతమైన నాయకత్వంలో భారత్ హరిత హైడ్రొజన్ మిషన్ గురించి, హరిత హైడ్రొజన్ లో ప్రపంచ నాయకత్వం వహించాలన్న భారత్ లక్ష్యం గురించి వివరించారు.
ప్రపంచ టీకాల ఉత్పత్తిదారు అయిన బిల్తోవెన్ బయొలాజికల్స్ (సైరస్ పూనావాలా గ్రూప్)ను కూడా శ్రీ ఖూబా సందర్శించారు.
***
(Release ID: 1975772)
Visitor Counter : 81