కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
‘పీఎంఆర్‌టీఎస్, సీఎంఆర్‌టీఎస్ అనుమతుల నిబంధనలు, షరతుల సమీక్ష’పై ట్రాయ్ విడుదల చేసిన సంప్రదింపుల పత్రంపై వ్యాఖ్యలు, ప్రతివ్యాఖ్యల స్వీకరణకు చివరి తేదీలు పొడిగింపు
प्रविष्टि तिथि:
08 NOV 2023 4:44PM by PIB Hyderabad
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), 29.08.2023న, ‘పీఎంఆర్‌టీఎస్, సీఎంఆర్‌టీఎస్ అనుమతుల నిబంధనలు, షరతుల సమీక్ష’పై ఒక సంప్రదింపు పత్రాన్ని విడుదల చేసింది. ఆ సంప్రదింపు పత్రంలో ప్రస్తావించిన అంశాలపై సంబంధిత వర్గాల నుంచి రాతపూర్వక వ్యాఖ్యలు స్వీకరించడానికి చివరి తేదీని మొదట 26.09.2023గా, ప్రతివ్యాఖ్యలకు చివరి తేదీని 10.10.2023గా ట్రాయ్ నిర్ణయించింది.
వ్యాఖ్యలు సమర్పించేందుకు సమయం పొడిగింపు కోసం పరిశ్రమ వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థనలు దృష్టిలో పెట్టుకుని, రాతపూర్వక వ్యాఖ్యలు & ప్రతివ్యాఖ్యలు సమర్పించే చివరి తేదీలను వరుసగా 24.10.2023 & 07.11.2023 వరకు పొడిగించింది. ఆ తర్వాత మళ్లీ 07.11.2023 & 21.11.2023 వరకు పెంచింది.
పరిశ్రమ వర్గాల అభ్యర్థనల దృష్ట్యా, వ్యాఖ్యలు & ప్రతివ్యాఖ్యలను సమర్పించేందుకు చివరి తేదీలను మరోమారు వరుసగా 21.11.2023 & 05.12.2023 వరకు ట్రాయ్ పొడిగించింది. మరింత సమయం కోరుతూ వచ్చే అభ్యర్థనలను ట్రాయ్ ఇక స్వీకరించదు.
వ్యాఖ్యలు & ప్రతివ్యాఖ్యలను ట్రాయ్ సలహాదారు (నెట్‌వర్కులు, స్పెక్ట్రం & అనుమతులు) శ్రీ అఖిలేష్ కుమార్ త్రివేదికి advmn@trai.gov.in ఐడీకి ఈ-మెయిల్ చేయాలి. మరింత స్పష్టత లేదా సమాచారం కోసం, శ్రీ అఖిలేష్ కుమార్‌ను +91-11-23210481 టెలిఫోన్ నంబర్‌లో సంప్రదించవచ్చు.
***
(रिलीज़ आईडी: 1975766)
आगंतुक पटल : 96