బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సెప్టెంబ‌ర్ నెల‌లో 3.83 పాయింట్లు పెరిగిన జాతీయ బొగ్గు సూచీ

Posted On: 07 NOV 2023 2:50PM by PIB Hyderabad

జాతీయ బొగ్గు సూచీ (ఎన్‌సిఐ) సెప్టెంబ‌ర్ 2023లో స్వ‌ల్పంగా 3.83 పాయింట్లు పెరిగి 143.91కి చేరుకుంది. ఈ పెరుగుద‌ల ఏప్రిల్ 23 త‌ర్వాత తొలిసారి జ‌రిగింది. ప్ర‌పంచ మార్కెట్ల‌లో తాత్కాలికంగా పెరిగిన బొగ్గు ధ‌ర‌ల కార‌ణంగా ఈ ఎదుగుద‌ల ప్ర‌భావిత‌మైంది. 
జాతీయ బొగ్గు సూచీ (ఎన్‌సిఐ)ని బొగ్గు మంత్రిత్వ శాఖ 4 జూన్ 2020న ప్రారంభించింది. ఇది నిర్ణీత ఆధారిత సంవ‌త్స‌రానికి సాపేక్షంగా ఒక నిర్ధిష్ట నెల‌లో మారిన బొగ్గు ధ‌ర‌ను ప్ర‌తిబింబించే ధ‌ర‌ల సూచీ. 
మార్కెట్ ఆధారిత ప‌ద్ధ‌తి ఆధారంగా ప్రీమియం (ట‌న్నుకు ఒక ప్రాతిప‌దిక‌న‌) లేదా రెవిన్యూ వాటా (ప‌ర్సెంటేజ్ ప్రాతిప‌దిక‌న) నిర్ణ‌యించ‌డానికి ఎన్‌సిఐని ఉప‌యోగిస్తారు. భార‌తీయ మార్కెట్లో ముడి బొగ్గుకు సంబంధించిన అన్ని లావాదేవీల‌ను ఆవ‌రించేందుకు ఉద్దేశించిన సూచీ ఇది. ఇందులో నియంత్రిత (విద్యుత్ & ఎరువులు), నియంత్ర‌ణ లేని రంగాల‌లో వివిధ గ్రేడ్‌ల  కోకింగ్‌, నాన్ కోకింగ్ లావాదేవీలు ఉన్నాయి. ఈ లావాదేవీలలో నోటిఫై చేసిన ధ‌ర‌, బొగ్గు వేలాలు, బొగ్గు దిగుమ‌తులు ఉన్నాయి. 
దేశంలో రానున్న పండుగ‌ల కాలం, శీతాకాలం కార‌ణంగా బొగ్గు డిమాండ్ పెర‌గ‌డాన్ని ఎన్‌సిఐ ఊర్థ్వ క‌ద‌లిక సూచిస్తుంది.  అంతేకాకుండా పెరుగుతున్న ఇంధ‌న డిమాండ్‌ల‌ను తీర్చేందుకు దేశీయ బొగ్గు ఉత్ప‌త్తిని మ‌రింత పెంచ‌డం ద్వాఆరా బొగ్గు ఉత్ప‌త్తిదారు గ‌రిష్ట ప్ర‌యోజ‌నం పొందేలా ప్రోత్స‌హిస్తుంది. 

 

****
 


(Release ID: 1975533) Visitor Counter : 82