నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav

ఎస్.డి.జి. లపై పురోగతిని వేగవంతం చేయడం, అభివృద్ధి కోసం డేటాను ఉపయోగించడం పై - నీతీ ఆయోగ్ ఆయోగ్ ద్వారా జి20 వర్క్‌షాప్ పరంపర

Posted On: 04 NOV 2023 6:17PM by PIB Hyderabad

న్యూఢిల్లీ నాయకుల ప్రకటన 2023 (ఎన్.డి.ఎల్.డి-2023) నుండి వెలువడిన ఎస్.డి.జి. లపై పురోగతిని వేగవంతం చేయడం, అభివృద్ధి కోసం డేటాను ఉపయోగించడం అనే ఇతివృత్తంతో ఒక విజయవంతమైన ఉపన్యాసానికి గుర్తు గా ప్రధాన ఆలోచనాపరులు, విద్యావేత్తలు, బహుముఖ సంస్థలు న్యూఢిల్లీలో సమావేశమయ్యాయి.  ఈ వర్క్‌షాప్ సీరీస్ నిర్వహణలో ఇందిరా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ (ఐ.జి.ఐ.డి.ఆర్) భాగస్వామిగా ఉంది.  ఈ నేపథ్యంలో ఎన్‌.డి.ఎల్‌.డి-2023 లో పేర్కొన్న కార్యాచరణ అంశాలకు సంబంధించి నీతి ఆయోగ్ ద్వారా నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌ సీరీస్ లో ఇది ఒక భాగం.    పర్యాటకం, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎస్.డి.జి. లు, ఇండియన్ డెవలప్‌మెంట్ మోడల్ వంటి వివిధ ఇతివృత్తాలతో ఇతర వర్క్‌షాప్‌ లు నిర్వహించడం జరుగుతోంది.   ఇవన్నీ - సమిష్టిగా, ఒక జాతీయ వర్క్‌షాప్‌ నిర్వహణకు అవసరమైన సమాచారం సమీకరించడానికి దోహదపడతాయి. 

 

 

డేటా ఫర్ డెవలప్‌మెంట్ (డి4డి) యొక్క ఏడు సూత్రాలకు సంబంధించిన 4 కీలక అంశాలను తాజ్ ప్యాలెస్‌ లో జరిగిన సమావేశంలో చర్చకు తీసుకోవడం జరిగింది.  భారతీయ నేపథ్యంలో డెవలప్‌మెంట్ కోసం డేటాను ఉపయోగించుకోవడం (డి4డి) యొక్క ఔచిత్యం, ప్రత్యేక అంశాలతో పాటు, జి20 సూత్రాలను అమలు చేసే మార్గాలపై ఈ పరస్పర చర్యలు  దృష్టి సారించాయి.

 

 

డేటా మరియు వాటి చారిత్రక ప్రాముఖ్యత తో పాటు నిర్ణయాలు, చర్యలకు సహాయపడే అంతరాలపై నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ అరవింద్ విర్మాణి ప్రారంభ చర్చతో వర్క్‌షాప్ ప్రారంభమైంది.  బలమైన డేటా సిస్టమ్‌లను నిర్మించడం, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న డేటా మూలాలను కలుపుకోవడంతో పాటు, డేటా నుండి నిర్ణయానికి,  అలాగే డేటా సేకరణ మార్గాలకు సంబంధించిన సమస్యల గురించి ఆలోచించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు.  డేటాను సేకరించడం, ఉపయోగించడం కోసం ప్రభుత్వం చేస్తున్న వివిధ ప్రయత్నాల గురించి చర్చించడంతో పాటు, దాని సవాళ్లు, నిరంతరం మారుతున్న సాంకేతిక ప్రకృతి దృశ్యం ప్రభావం గురించి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎం.ఈ.ఐ.టి.వై) కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణన్ వివరించారు.  కేంద్రీకృత డేటా విశ్లేషణతో వికేంద్రీకృత వినియోగం, గోప్యత, సైబర్ భద్రత సమస్యలను పరిష్కరించేటప్పుడు సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో సంక్లిష్టతలను గురించి ఆయన ప్రముఖంగా తెలియజేశారు.  ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్‌-వర్క్‌ తో సహా డేటా మరియు ఎస్.డి.జి. లకు సంబంధించిన నిర్దిష్ట ఆందోళనల గురించి కేంద్ర గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (ఎం.ఓ.ఎస్.పి.ఐ) డి.డి.జి. డా. అశుతోష్ ఓజా చర్చించారు.

 

 

ఎస్.డి.జి. లను చేరుకోవడంలో మా పనిని వేగవంతం చేయడానికి డి.4డి. ఉపయోగించుకునే విషయంలో భారతదేశానికి సంబంధించిన విస్తృత-శ్రేణి అంశాలను ఈ వర్క్‌-షాప్ వెలికితీసింది.  ఈ సదస్సు సందర్భంగా - డేటాను ఎవరు ఉపయోగించుకుంటున్నారు;  డి.4.డి. జోక్యాల రూపకల్పన లో ఎవరి అభివృద్ధి ముఖ్యమైనది; ఈ రోజు డేటాను ఎవరు అర్థం చేసుకుంటారు, ఎవరు అర్థం చేసుకోగలరు; సమతుల్య పబ్లిక్ డేటా విధానాలను రూపొందించడంలో ప్రపంచానికి సహాయం చేయడానికి భారతదేశం ఎందుకు దారి చూపాలి; డిజిటల్ డేటా విధానాలను కేవలం వారసత్వ పేపర్-ఆధారిత విధానాలను మెరుగుపరిచే వ్యవస్థగా ఎందుకు ఉండకూడదు; అత్యవసర డేటా ఫ్రేమ్‌-వర్క్‌లు;  డేటా నాణ్యతతో సవాళ్లు; డేటాపై అతి ఎక్కువగా లేదా తక్కువగా ఆధారపడడం తో సవాళ్లు; ఏ.ఐ./ఎం.ఎల్. సాధనాల వాగ్దానం మరియు పరిమితులతో పాటు, కొత్త సాంకేతికతలు, వ్యవస్థలు ఇంతవరకు పేర్కొన్న అంశాలన్నింటినీ ఎలా మారుస్తున్నాయి వంటి వాటికి మాత్రమే పరిమితం కాకుండా, అనేక ముఖ్యమైన ఇతర ఇతివృత్తాలు కూడా ఉద్భవించాయి, 

 

 

ఈ సదస్సులో - నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్.సి.ఏ.ఈ.ఆర్); బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ (బి.ఎం.జి.ఎఫ్); డిజిటల్ ఇండియా ఫౌండేషన్; సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ స్టడీస్; గ్రాంట్ థోర్న్ టన్ భారత్ ఎల్.ఎల్.పి; ప్రథమ్ ఇన్ఫోటెక్ ఫౌండేషన్; ఎఫ్.హెచ్.ఎం. ఎంగేజ్; యు.ఎన్. విమెన్; యు.ఎన్.డి.పి; ఐ.టి. ఫర్ చేంజ్; డిజిటల్ గ్రీన్; ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్; కార్నెగీ ఇండియా; ఐ స్పిరిట్; సెంటర్ ఫర్ కమ్యూనికేషన్స్ గవర్నెన్స్ (ఎన్.ఎల్.యు); రిలయన్స్ ఫౌండేషన్ వంటి ఇరవైకి పైగా సంస్థల ప్రతినిధులు పాల్గొని తమ అమూల్యమైన సమాచారాన్ని పరస్పరం తెలియజేసుకున్నారు. 

 

 

ఈ సదస్సులకు నీతీ ఆయోగ్ నుండి, స్టార్ట్-అప్ 20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ (జి.20) అధిపతి, మరియు నీతీ ఆయోగ్ కు చెందిన అటల్ ఇన్నోవేషన్ మిషన్,  మిషన్ డైరెక్టర్ డాక్టర్ చింతన్ వైష్ణవ్ తో పాటు,   నీతి ఆయోగ్ సంయుక్త కార్యదర్శి శ్రీ కె.ఎస్. రెజిమోజ్ అధ్యక్షత వహించారు.  ఈ వర్క్‌-షాప్‌ నిర్వహణ లో వీరికి ఐ.జి.ఐ.డి.ఆర్. కు చెందిన ప్రొఫెసర్ మనీషా జైన్, ప్రొఫెసర్ భారతి నంద్వానీ తో పాటు, కోల్‌కతా లోని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓ.ఆర్.ఎఫ్) డిప్యూటీ డైరెక్టర్ శ్రీ అనిర్బన్ శర్మ సహకరించారు. 

 

 

భారతదేశ నేపథ్యంలో ఎస్.డి.జి. లపై పురోగతిని వేగవంతం చేయడం, అభివృద్ధి కోసం డేటాను ఉపయోగించడం కోసం ముందుకు వెళ్లే మార్గాన్ని చర్చించి తుది పత్రాన్ని ఈ వర్క్‌ షాప్ రూపొందిస్తుంది.  ఈ పత్రం రాబోయే జాతీయ వర్క్‌ షాప్‌ కు తగిన సమాచారాన్ని అందించే ఇన్‌-పుట్‌ గా పనిచేస్తుంది.

 

 

*****

 


(Release ID: 1974917) Visitor Counter : 86