వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పేదరికంతో పోరాడటానికి, మారుమూల ప్రాంతాలకు వస్తువులు మరియు సేవలను అందించడానికి మరియు భవిష్యత్తు కోసం శ్రామిక శక్తిని పునరుద్ధరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శక్తివంతమైన సాధనం: కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్
ఏఐలో భారతదేశం ప్రపంచ అగ్రగామిగా మరియు అంతర్జాతీయ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలో గుర్తింపు పొందింది: శ్రీ. గోయల్
భారతదేశ భవిష్యత్తు ఆర్థిక వృద్ధికి ఏఐని ప్రభావితం చేయడంలో ఆవిష్కరణ మరియు రీస్కిల్లింగ్‌పై దాని నిబద్ధతలో ఉంది: శ్రీ. గోయల్
విచారణ స్ఫూర్తి మరియు అభివృద్ధి కోసం నిరంతర తపన భారతదేశ స్టార్టప్ ఉద్యమం మరియు వ్యవస్థాపక ఆలోచనలకు ఆజ్యం పోసింది: శ్రీ. గోయల్
Posted On:
04 NOV 2023 7:41PM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్య & పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజాపంపిణీ, మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ..పేదరికంపై పోరాడేందుకు, సుదూర ప్రాంతాలకు వస్తువులు మరియు సేవలను అందించడానికి మరియు భవిష్యత్తు శ్రామికశక్తికి తిరిగి నైపుణ్యాన్ని అందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఒక శక్తివంతమైన సాధనం అని అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ‘స్లష్‌డి ప్రారంభ ఎడిషన్’లో జరిగిన స్ఫూర్తిదాయక ప్రసంగంలో మంత్రి ఈ విషయాన్ని తెలిపారు.
అత్యాధునిక సాంకేతికతలను ముఖ్యంగా ఏఐని స్వీకరించడానికి భారతదేశ నిబద్ధతను పునరుద్ఘాటించారు మరియు వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి మరియు జీవితాలను మెరుగుపరచడానికి ఏఐని స్వీకరించడాన్ని ప్రోత్సహించారు. ఏఐలో గ్లోబల్ లీడర్‌గా భారతదేశం యొక్క పాత్రను మంత్రి వివరించారు. అంతర్జాతీయ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలో దేశం యొక్క పెరుగుతున్న గుర్తింపును తెలిపారు. భారతదేశ బలాలు దాని పెద్ద, యువ జనాభా, విస్తారమైన డేటా వనరులు మరియు వ్యవస్థాపక సంస్కృతిలో ఉన్నాయని ఆయన నొక్కిచెప్పారు.
భారతీయ స్టార్టప్‌లు ప్రతిష్టాత్మకంగా ఉండాలని ఆవిష్కరణలను స్వాగతించాలని మరియు ముందున్న సవాళ్లను పరిష్కరించాలని మంత్రి ప్రోత్సహించారు. భారతదేశం చేయవలసింది కొంత ఉన్నప్పటికీ ఏఐ పట్ల దేశం యొక్క ఉత్సాహం ప్రోత్సహించబడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధికి ఏఐని ఉపయోగించుకునేందుకు ఇన్నోవేషన్ మరియు రీస్కిల్లింగ్‌కు కట్టుబడి ఉండటంలో భారతదేశ భవిష్యత్తు ఉందని ఆయన అన్నారు.
విభిన్న రంగాలలో రాణించే మరియు భారతదేశ బలానికి దోహదపడే దేశాన్ని "వాద భారతీయులు"గా సూచిస్తూ భారతదేశాన్ని వర్ణించే వైవిధ్యాన్ని ఆయన హైలైట్ చేశారు. శ్రీ పీయూష్ గోయల్ భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన బహిరంగ చర్చ, సంభాషణ మరియు చర్చల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ విచారణ స్ఫూర్తి మరియు అభివృద్ధి కోసం నిరంతర తపన భారతదేశం యొక్క స్టార్టప్ ఉద్యమం మరియు వ్యవస్థాపక ఆలోచనలకు ఆజ్యం పోశాయని ఇది శతాబ్దాలుగా ఉనికిలో ఉందని ఆయన పేర్కొన్నారు.
శ్రీ పీయూష్ గోయల్ భారతదేశ స్టార్టప్ ప్రయాణం మరియు దాని ఆకట్టుకునే వృద్ధి గురించి చర్చించారు. దేశంలో ఏడు సంవత్సరాల క్రితం సుమారుగా 450 స్టార్టప్‌లు ఉండగా ఈ ఏడేళ్లలో వాటి సంఖ్య 115,000 కు చేరిందని చెప్పారు. యువ పారిశ్రామికవేత్తలకు అందించిన చిన్న మూలధనం మరియు భారతదేశంలో వినూత్న ఆలోచనలను రియాలిటీగా మార్చడం ద్వారా సమృద్ధిగా డేటాను ఉపయోగించుకునే వారి సామర్థ్యానికి ఈ వృద్ధి నిదర్శనం అని ఆయన తెలిపారు.
అనేక స్టార్టప్‌లు ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు వైఫల్యాలను మంత్రి గుర్తించినప్పటికీ వారి దృఢత్వాన్ని మరియు ప్రయత్నాన్ని కొనసాగించాలనే సంకల్పాన్ని ప్రశంసించారు. భారతదేశ యువత పరివర్తన శక్తి మరియు దేశంలోని అనేక సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో వారి సామర్థ్యాన్ని ఆయన నొక్కిచెప్పారు.
ఆధునిక భారతీయ స్టార్టప్ సంప్రదాయ వ్యవస్థాపక మార్గాల ద్వారా నిర్బంధించబడదని శ్రీ గోయల్ ఉద్ఘాటించారు. నేటి స్టార్టప్‌లు తమ ఆవిష్కరణల సాధన, డేటాను ఉపయోగించుకోవడం మరియు ఇప్పటికే ఉన్న నిబంధనలకు మించి ఆలోచించడం ద్వారా వర్గీకరించబడతాయి అని అన్నారాయన.
యువత పెద్ద, సాహసోపేతమైన లక్ష్యాలను విశ్వసించడం కొనసాగించినట్లైతే భారతదేశ అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ చివరికి ప్రపంచంలోనే అతిపెద్దదిగా మారుతుందని శ్రీ పీయూష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశ వ్యవస్థాపక స్ఫూర్తి ఆవిష్కరణ, సృజనాత్మకత మరియు శ్రేయస్సుతో గుర్తించబడిన ఉజ్వల భవిష్యత్తు వైపు దేశాన్ని నడిపిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఫలవంతమైన చర్చలలో పాల్గొని ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించినందుకు నిర్వాహకులు మరియు ప్రేక్షకులను మంత్రి అభినందించారు. ఈ ఈవెంట్ భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలో డైనమిక్ మరియు విభిన్న భాగస్వాములను ఒకచోట చేర్చింది. స్లాస్‌డి ప్రారంభ ఎడిషన్ చర్చలు, నెట్‌వర్కింగ్ మరియు ప్రేరణ కోసం ఒక వేదికను అందించినందున శ్రీ గోయల్ యువ భారతీయ ప్రతిభావంతులను వారి ఆలోచనలను కొత్త ఆశయాలు మరియు మిషన్‌లుగా మార్చడానికి ప్రోత్సహించడం ద్వారా తన ప్రసంగాన్ని ముగించారు. భారతదేశ ఆర్థిక వృద్ధికి ఉత్ప్రేరకంగా ఏఐ యొక్క ప్రాముఖ్యతను మరియు భారతదేశానికి ప్రత్యేకమైన విక్రయ ప్రతిపాదనగా మారగల సామర్థ్యాన్ని ఆయన వివరించారు.
***
(Release ID: 1974907)
Visitor Counter : 79