ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ప్రపంచ ఆరోగ్య సంస్థ , ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ 76వ సెషన్, మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ ను ఉద్దేశించి ప్రసంగించిన డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్.
సార్వత్రిక ఆరోగ్యసేవల లక్ష్య సాధనలో కీలకమైన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేసే ఢిల్లీ డిక్లరేషన్ పై సంతకం.
సార్వత్రిక ఆరోగ్య సేవల అందుబాటు లక్ష్య సాధనకు సంబంధించి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై (పిహెచ్సి)
పెట్టుబడి తక్కువ ఖర్చుతో , అత్యంత సమ్మిళితత్వం, సమానత్వంతో కూడినది: డాక్టర్ భారతి ప్రవిణ్ పవార్
‘ భారతదేశపు బలమైన ఆరోగ్య వ్యవస్థ ‘మోత్తంగా ప్రభుత్వం’, ‘మొత్తంగా సమాజం’ అన్న విధానంపై ఆధారపడినది.
‘‘1.61 లక్షల ఆయుష్మాన్ భారత్ హెల్త్, వెల్నెస్ కేంద్రాలు (ఎబి–హెచ్.డబ్ల్యు.సి) సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవల అందుబాటులో పరివర్తనాత్మక మార్పును తీసుకు వస్తున్నాయి.
జననం నుంచి మరణం వరకు నిరంతర ఆరోగ్య సంరక్షణ సేవలను అన్ని వయసుల వారికి ఇవి సార్వత్రికంగా ఉచితంగా అందించేందుకు ఏర్పాటయ్యాయి.’’
‘‘ఇండియాలో అమలౌతున్న ఆశా కార్యక్రమం ప్రపంచంలోనే అతి పెద్ద కమ్యూనిటీ ఆరోగ్య కార్యకర్తల కార్యక్రమం’
‘‘ఇండియా ఈ స్థాయిలో సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడం, వాటిని మరింత విస్తరించడానికి కారణం,
నైపుణ్యం గల సిబ్బంది , శిక్షణ సదుపాయాలు, నాణ్యతా ప్రమాణాలు కలిగిన ఔషధాలు, సమీకృత సరఫరా చెయిన
Posted On:
31 OCT 2023 3:17PM by PIB Hyderabad
ప్రాథమిక ఆరోగ్యరంగంలో పెట్టుబడులు (పి.హెచ్.సి.) అత్యంత సమ్మిళితమైనది,ఇది అందరికీ ఉపయోగపడేది, తక్కువఖర్చుతో సార్వత్రిక ఆరోగ్య సంరక్షణను ఇచ్చేది’ అని కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి ఆగ్నేయాసియా రీజనల్ కమిటీ 76 వ సెషన్ లో వారు ఈ మాటలన్నారు.
సార్వత్రిక ఆరోగ్య కవరేజ్ సాధనకు, ప్రాథమిక ఆరోగ్యరంగాన్ని బలోపేతంచేసే దిశగా న్యూ ఢిల్లీడిక్లరేషన్ పై ఈ సందర్భంగా సంతకం చేశారు.
డబ్ల్యుహెచ్ఒ సీరో (రీజనల్ ఆఫీస్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏసియా) డైరక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్, మాల్దీవుల ఆరోగ్యశాఖ మంత్రి అహ్మద్ నసీమ్,తిమోర్ లెస్టీ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లియా అంటోనియో డి అరౌజోదాస్ రీస్ అమరాల్, శ్రీలంక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సీతా అరంబెపోలా, నేపాల్ ఆరోగ్య శాఖ మంత్రి మోహన్ బహదూర్ బస్ నెట్, డెమాక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా కు ఇండియాలో రాయబారి చో హుచి చోల్, బంగ్లాదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి జహిద్ మలెక్యూ,ఇండోనేసియా ఆరోగ్య మంత్రిత్వశాఖకు చెందిన డైరక్టర్ జనరల్, భూటాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖకు చెందిన తాత్కాలిక కార్యదర్శి పెంబా వాంగ్ చుక్,థాయిలాండ్ పబ్లిక్ హెల్త్ కుచెందిన గ్లోబల్ హెల్త్ అడ్వయిజర్ డాక్టర్ విరోజ్ తంగ్చరాసథియన్ లు ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో ఉన్నారు.
, ఏ పేద వ్యక్తినీ అభివ్రుద్ధిలొ వెనకపడనీయకుండా చూడాలన్న ప్రధానమంత్రి దార్శనికత అయిన అంత్యోదయ గురించి పునరుద్ఘాటిస్తూ డాక్టర్ భారతి ప్రవిణ్ పవార్, ఇండియా జి-20 నాయకత్వం, జాతీయ ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయవలసిన ప్రాధాన్యతను నొక్కి చెప్పిందని తెలిపారు. ఆరోగ్య సన్నద్ధత ప్రజాకేంద్రంగా ఉంటూ, సత్వరం స్పందించే విధంగా ఉండాలన్నారు.
భారతదేశ పటిష్ట ఆరోగ్య వ్యవస్థ మొత్తంగా ప్రభుత్వం, మొత్తం సమాజం అన్న విధానంపై ఆధారపడి ఉందని అన్నారు.ఇది సార్వత్రిక ఆరోగ్య సంరక్షణకు దోహదపడుతుందన్నారు. దీని లక్ష్యం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ను పటిష్టం చేయడం, కోవిడ్ మహమ్మారి ముందటి స్థఆయికి ఆరోగ్య వ్యవస్థలు, అత్యావశ్యక ఆరోగ్య సేవలను మెరుగుపరచడమని అన్నారు.భారతదేశపు కీలక సంస్కరణల ప్రభావం పై మాట్లాడుతూ డాక్టర్ ప్రవీణ్ పవార్ భారతి , 1.61 లక్షల ఆయుష్మాన్‌భారత్ హెల్త్ , వెల్‌నెస్ సెంటర్లు (ఎబి`హెచ్.డబ్ల్యుసి) సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సర్వీసులను పరివర్తన చెందిస్తున్నాయని , ఇవి సార్వత్రికంగా ఉచితంగా అందుబాటులో ఉన్నాయని అన్నారు. అన్ని వయసుల వారికి జననం నుంచి మరణం వరకు నిరంతర సంరక్షణ సేవలు అందిస్తున్నాయని అన్నారు. ఇది పెద్ద సంఖ్యలో ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి రావడానికి దోహదపడిరదన్నారు. దీనితో స్వంతజేబునుంచి ఆరోగ్య సేవలకు డబ్బు ఖర్చుచేసే ఇబ్బంది తొలగి పోయిందన్నారు. అలాగే ఉన్నత స్థాయి సేవలకు రద్దీ తగ్గిందని , అన్ని స్థాయిలలో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
ప్రాథమిక ఆరోగ్య రంగంలో తీసుకువచ్చిన విధానసపరమైన సంస్కరణలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, కేంద్ర సహాయమంత్రి, ప్రభుత్వం తీసుకువచ్చినపలు విధానపరమైన సంస్కరణలలో, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సిహెచ్.ఒ) కేడర్ ఒకటి. దీనిని ప్రాథమిక స్థాయిలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇండియా ఆషా కార్యక్రమం, అంతర్జాతీయంగా, అతి పెద్ద కమ్యూనిటీ ఆరోగ్య కార్యకర్తల కార్యక్రమం. అన్ని స్థాయిలలో అత్యవసర ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయని, భారతీయ ప్రజారోగ్య ప్రమాణాలను 2022లో సవరించడం జరిగిందని చెప్పారు. వాటిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ప్రాథాన్యతలతో అనుసంధానం చేయడం జరిగిందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నాణ్యతా అక్రిడిషన్ కూడా జరుగుతున్నట్టు తెలిపారు. దీనిని నేషనల్ క్వాలిటీ అస్సూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్.క్యు.ఎ.ఎస్) చొరవ కింద చేపట్టడం జరిగింది. భారతదేశంలో ఆరోగ్య రంగ పురోగతిని ప్రశంసిస్తూ డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలు అందుబాటులోకి రావడానికి కారణం నైపుణ్యంగల సిబ్బంది అందుబాటులో కూడా ఉండడమన్నారు. అలాగే నాణ్యమైన మందుల సరఫరాకు అవకాశం , మౌలికసదుపాయాలు, వంటి వన్నీ ఇందుకు దోహదపడినట్టు చెప్పారు. డిజిటల్ ఆరోగ్య సేవలు, కమ్యూనిటీని సమీకృతం చేయడం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించడం, వంటివి సర్వీసు డెలివరీకి కీలకమైన అంశాలుగా ఉంటూ వచ్చాయి.ఆరోగ్య రంగంలో ప్రభుత్వ దృఢసంకల్పం గురించి ప్రస్తావిస్తూ మంత్రి, అనారోగ్యం నుంచి ,ఆరోగ్య సంరక్షణ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. యోగా, సైక్లిథాన్, వాక్ `ఎ` థాన్, ఫిట్ ఇండియా , ఆరోగ్యవంతమైన ఆహారం వంటి ప్రచార కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టినట్టు తెలిపారు. ‘‘టెలిమెడిసిన్ వేదికలు, వైద్య పరమైన సలహాలను ఈ సంజీవని ద్వారా అందిస్తున్నాయి. దీనివల్ల నిపుణుల సలహాలు సూచనలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.ఇండియాలో ఆరోగ్యం నయం చేయించుకోండి అనే నినాదం కింద,అందుబాటు ధరలో , సమగ్ర, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ సేవలు ప్రపంచానికి అందిస్తున్నట్టు చెప్పారు.
ఆరోగ్య సేవలకు సంబంధించి, భవిష్యత్ ప్రణాళికను ప్రస్తావిస్తూ, కేంద్ర మంత్రి, ఎబిహెచ్‌డబ్ల్యుసిలు , మానసిక ఆరోగ్యం, వయోధికుల ఆరోగ్యం, నొప్పినివారణ వంటి విషయాలలో గల లోటుపాట్లను సవరించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఎబిడిఎం) సమగ్ర డిజిటల్ ఆరోగ్య సంరక్షణకు వీలు కల్పిస్తుందన్నారు. అలాగే ప్రమాణాల ఆధారిత డిజిటల్ ఆరోగ్య పరివర్తనకు పెట్టుబడులు సమకూర్చే దిశగా చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
ఎబి`హెచ్.డబ్లుయసిలలో ఇండియాలోప్రాథమిక స్థాయిలో సమగ్ర ఆరోగ్య సంరక్షణ చర్యలు అందుబాటులో ఉండడం పట్ల డాక్టర్ పూనం హర్షం వ్యక్తం చేశారు. ఈ కేంద్రాలలో అందుబాటులో ఉన్న ఆరోగ్య సేవలు, ముఖ్యంగా వ్యాధి నిరోధక సేవలు చూసి ఆశ్చర్యం కలిగింది అని ఆమె అన్నారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కేడర్‌ను ఏర్పాటు చేయడం ఎంతో మంచి చర్యగా ఆమెఅభివర్ణించారు. అనారోగ్యం నుంచి ఆరోగ్య సంరక్షణ దిశగా తీసుకుంటున్న చర్యలను ఆమె ప్రశంసించారు. ఇలా మనం ముందుకు సాగిపోవాలని ఆమె ఆకాంక్షించారు.
సీనియర్ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు, లండన్ స్కూల్‌ఆఫ్ హైజిన్, ట్రాపికల్ మెడిసిన్ ప్రొఫెసర్ అన్నే మిల్లిస్ తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.
***
(Release ID: 1974642)
Visitor Counter : 76