నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
నూతన & పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ చేపట్టిన ప్రత్యేక ప్రచారం 3.0 కింద సాధించిన విజయాలు
Posted On:
03 NOV 2023 12:07PM by PIB Hyderabad
తన రెండు ప్రభుత్వ రంగ సంస్థలు (భారత పునరుత్పాదక ఇంధన అభివృద్ధి ఏజెన్సీ లిమిటెడ్ (ఐఆర్ఇడిఎ), సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఇసిఐ), మూడు స్వయం ప్రతిపత్తి సంస్థలు (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (ఎన్ఐఎస్ఇ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ (ఎన్ఐడబ్ల్యుఇ), సర్దార్ స్వర్ణ్ సింగ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయో ఎనర్జీ (ఎస్ఎస్ఎస్ - ఎన్ఐబిఇ)లతో కలిసి 2-31 అక్టోబర్ 2023 వరకు సాగిన ప్రత్యేక ప్రచారం కింద నూతన& పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ పలు పారిశుద్ధ్య కార్యకలాపాలను చేపట్టింది. సీనియర్ అధికారులు నియమిత కాలంలో పలు సమీక్షా సమావేశాలను చేపట్టారు. స్వచ్ఛతను మెరుగుపరిచేందుకు, పెండింగ్‌లో ఉన్న సమస్యలను 2021, 2022లలో నిర్వహించిన ప్రత్యేక ప్రచారాలకు అనుగుణంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ ప్రచారాన్ని చేపట్టింది. ప్రత్యేక ప్రచారం 3.0ను సేవల పంపిణీకి బాధ్యత వహించే క్షేత్ర, బయిట కార్యాలయాలపై లేదా ప్రజా వినిమయసీమను కలిగి ఉన్న వాటిపై దృష్టి సారించి నిర్వహించారు.
తుక్కును విసర్జించడం, పాత రికార్డులను, స్టేషనరీ తదితరాలను తొలగించడం, గౌరవ ఎంపీల నుంచి వచ్చిన ప్రస్తావనలను, పరిష్కరించడం, పార్లమెంటరీ హామీలను, రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తావనలను నెరవేర్చడం, ప్రజా ఫిర్యాదులు, ప్రధాని కార్యాలయపు ప్రస్తావనలు, రికార్డు నిర్వహణ, కార్యాలయంలో చోటును ఖాళీగా ఉంచడం, నిబంధనలను/ ప్రక్రియలను సరళీకరం చేయడం సహా కార్యాలయ ఆవరణలలో పారిశుద్ధ్యాన్ని నిర్వహించడంపై మంత్రిత్వ శాఖ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.
అక్టోబర్ 2-31, 2023వరకు నిర్వహించిన ప్రత్యేక ప్రచారం సందర్భంగా సాధించిన విజయాలు దిగువన పేర్కొనడం జరిగిందిః
దిగువన పేర్కొన్న కేటగిరీలలో 100% లక్ష్యాలను సాధించారు-
ప్రజా ఫిర్యాదులు
ప్రజా ఫిర్యాదుల అప్పీళ్ళు
భౌతిక ఫైళ్ళ సమీక్ష
ఇ-ఫైళ్ళ సమీక్ష
పారిశుద్ధ్య ప్రచారాల సంఖ్య
ఇతర విజయాలు ఈ విధంగా ఉన్నాయి -
ఎంపీల నుంచి వచ్చిన ప్రస్తావనల కేటగిరీలో 94.73% లక్ష్యాన్ని సాధించారు
3,473 భౌతిక ఫైళ్ళను సమీక్షించి, 866 ఫైళ్ళను తొలగించారు
4,185 ఇ-ఫైళ్ళను సమీక్షించి, 796 ఇ-ఫైళ్ళను పూర్తి చేసి, మూసివేశారు
తుక్కును విసర్జించడం ద్వారా రూ. 1,36,786 ఆదాయాన్ని ఆర్జించారు
తుక్కు విసర్జన, ఫైళ్ళను తొలగించడం వల్ల దాదాపు 250 చదరపు అడుగుల స్థలం ఖాళీ అయింది.
***
(Release ID: 1974597)