వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2023-24లో 9.33 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తూ 161.47 ఎల్‌ఎంటీ వరి ధాన్యం సేకరణ
Posted On:
02 NOV 2023 4:55PM by PIB Hyderabad
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కేఎంఎస్) 2023-24 సాఫీగా కొనసాగుతోంది. 01.11.2023 వరకు, 161.47 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) వరి ధాన్యాన్ని సేకరించారు. దీని ద్వారా, దాదాపు 9.33 లక్షల మంది రైతులకు కనీస మద్దతు ధర వద్ద (ఎంఎస్‌పీ) ₹35,571.14 కోట్ల విలువైన ప్రయోజనం చేకూరింది.
2023-24 ఖరీఫ్ సీజన్‌లో 521.27 ఎల్‌ఎంటీ వరి ధాన్యం సేకరించాలన్నది లక్ష్యం. ఇందులో 20.76% (108.23 ఎల్‌ఎంటీ) ఇప్పటికే సేకరించారు. పంజాబ్ (66.42 ఎల్‌ఎంటీ), హరియాణా (36.11 ఎల్‌ఎంటీ), తమిళనాడు (3.26 ఎల్‌ఎంటీ) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

***
(Release ID: 1974336)
Visitor Counter : 91