ఆయుష్
వరల్డ్ ఫుడ్ ఇండియా లో , ఆయుష్ స్టార్టప్ లు అభివ్రుద్ధి చేసిన ’ఆయుష్ ఆహార్ ‘ ఉత్పత్తుల ప్రదర్శన
.- 2023 నవంబర్ ,3 ,4 , 5 తేదీలలో జరగనున్న వరల్డ్ ఫుడ్ ఈవెంట్ లో భాగస్వామిగా పాల్గొననున్న ఆయుష్ మంత్రిత్వ శాఖ.
-దేశవ్యాప్తంగా గల ఆయుష్ స్టార్టప్ లు కొత్తగా అభివ్రుద్ధి చేసిన ఆయుష్ ఆధార్ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి.
- కొత్త గా అభివ్రుద్ధి చేసిన 30కి పైగా ఆయుష్ ఉత్పత్తులను వరల్డ్ ఫుడ్ ఇండియాలో ప్రదర్శించనున్నారు.
Posted On:
02 NOV 2023 4:42PM by PIB Hyderabad
ఆయుష్ స్టార్టప్ లకు సంబంధించిన వినూత్న ఆయుష్ ఆహార్ ఉత్పత్తులను, వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 ఈవెంట్ లో ప్రదర్శించనున్నారు. వీటిని ప్రగతి మైదాన్లో ఆయుష్ మంత్రిత్వశాఖ పెవిలియన్ లో ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. మొత్తం ఈ ఎగ్జిబిషన్ లో, 18 స్టార్టప్ సంస్థలు, 30 ఆయుష్ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి.
వరల్డ్ ఫుడ్ ఇండియా లో ఆయుష్ ఆహార్ స్పెషల్ సెషన్ ను కూడా నిర్వహించనున్నారు. ఈ సెషన్ లో ఆయుష్ ఆహారం, ఆయుష్ ఆహారం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు తదితరాలను చర్చించనున్నారు. అలాగే ఈ సెషన్ లో ఆయుర్వేదాన్ని ప్రపంచవ్యాప్తంగా గల సామాన్య ప్రజల జీవన విధానంలో భాగంగా చేయడాన్ని కూడా చర్చిస్తారు. ఆయుర్వేద రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడం, యూనికార్న్ లతో సంప్రదింపులు, ఆయుష్ రంగంలో కొత్త స్టార్టప్ ల ప్రవేశం గురించి చర్చించనున్నారు.
ఆయుష్ ఉత్పత్తుల అమ్మకాలు, మార్కెటింగ్ ను అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించేందుకు ఆయుష్ మంత్రిత్వశాఖ నిరంతర క్రుషి చేస్తుంది. వరల్డ్ ఫుడ్ ఇండియా ప్రత్యేక సెషన్ లో, ఆయుష్ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ ను గుర్తించడంతోపాటు, ఇండియా నుంచి ఆయుష్ ఉత్పత్తుల ఎగుమతులకు సంబంధించి లోతైన చర్చ జరగనుంది.
సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ హొమియోపతి (సిసిఆర్ హెచ్) ని ఈ ఈవెంట్ కోసం ఆయుష్ మంత్రిత్వశాఖ నియమించింది. ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎఐఐఎ), నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, జైపూర్, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి, పూణే, సిసిఆర్ ఎ ఎస్, మోరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ యోగా, ఆయుష్ ఎక్సిల్ (ఆయుష్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి), ఇన్వెస్ట్ ఇండియా సంస్థలు వరల్డ్ ఫుడ్ ఇండియా ఈవెంట్ కు తమ మద్దతునందిస్తున్నాయి.
(Release ID: 1974329)
Visitor Counter : 60