సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

అక్టోబర్ 31, 2023న ప్రత్యేక స్వచ్ఛతా కార్యక్రమం 3.0 అమలు దశ విజయవంతంగా ముగిసినట్లు ప్రకటించిన డాక్టర్ జితేంద్ర సింగ్. స్వచ్ఛతను సంస్థాగతీకరించడం మరియు ప్రభుత్వంలో పెండెన్సీని తగ్గించడం కోసం భారతదేశం యొక్క అతిపెద్ద కార్యక్రమం అనేక ఉత్తమ పద్ధతులు మరియు మైలురాళ్లను చూసింది.


2021-2023 కాలంలో ప్రత్యేక స్వచ్ఛతా కార్యక్రమాలు 1.0, 2.0 మరియు 3.0 నుండి రూ.1100 కోట్ల ఆదాయాలు; అక్టోబర్ 2 నుండి 31 వరకూ స్పెషల్ క్యాంపెయిన్ 3.0లో రూ.500 కోట్లు ఆర్జించబడ్డాయి

ప్రధాని మోదీ స్ఫూర్తితో భారతదేశంలోని 2.53 లక్షల కార్యాలయాల్లో “స్వచ్ఛత”, ప్రత్యేక ప్రచారం 3.0 సంతృప్త విధానం అమలు చేయబడింది. తద్వారా 154 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ఖాళీ చేయబడింది, 46 లక్షల ఫైళ్లను సమీక్షించారు. 4.75 లక్షల పీజీ కేసులు పరిష్కరించబడ్డాయి.

అత్యుత్తమ ‘ప్రత్యేక స్వచ్ఛతా కార్యక్రమం 3.0’ని విజయవంతంగా నిర్వహించినందుకు డా. జితేంద్ర సింగ్ డిఏఆర్‌పిజిని అభినందించారు మరియు అన్ని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/ విభాగాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Posted On: 01 NOV 2023 12:26PM by PIB Hyderabad

అక్టోబర్ 31, 2023న స్పెషల్ క్యాంపెయిన్ 3.0 అమలు దశను విజయవంతంగా ముగించినట్లు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు. స్వచ్ఛతను సంస్థాగతీకరించడం మరియు పెండెన్సీని తగ్గించడం కోసం ప్రత్యేక ప్రచారం 3.0 భారతదేశం యొక్క అతిపెద్ద ప్రచారం అని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలలో మరియు అనేక ఉత్తమ పద్ధతులు మరియు మైలురాళ్లు ఈ కార్యక్రమంలో వెలుగుచూసాయి. ప్రధాని మోదీ ఆదేశాలతో స్ఫూర్తి పొంది భారతదేశంలోని మారుమూల ప్రాంతాల్లోని 2.53 లక్షల కార్యాలయాల్లో స్వచ్ఛత ప్రచారం కోసం ‘స్పెషల్ క్యాంపెయిన్ 3.0’లో సంతృప్త విధానాన్ని అవలంబించారు. 2021-23 నుండి ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక ప్రచారాల ద్వారా ఆఫీస్ స్క్రాప్ పారవేయడం ద్వారా రూ1100 కోట్ల ఆదాయం లభించింది. ప్రత్యేక ప్రచారం 3.0 అక్టోబర్ 2 నుండి 31 కాలంలో రూ.500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రత్యేక ప్రచారం 3.0లో 2.53 లక్షల కంటే ఎక్కువ సైట్‌లలో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టింది మరియు సమర్థవంతమైన కార్యాలయ వినియోగం కోసం 154 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఖాళీ చేయడంలో దోహదపడింది.  ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ 2022లో 1.01 లక్షల సైట్‌లు ఉండగా, 2023లో 2.53 లక్షల కంటే ఎక్కువ సైట్‌లతో ప్రత్యేక ప్రచారం యొక్క పరిమాణం మరియు స్థాయి పెరుగుతోందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

ప్రత్యేక స్వచ్ఛతా కార్యక్రమం 3.0ని కేబినెట్ మంత్రులు, రాష్ట్ర మంత్రులు, క్యాబినెట్ సెక్రటరీ మరియు భారత ప్రభుత్వ కార్యదర్శులు అమలులో నాయకత్వం మరియు మార్గదర్శకత్వం అందించారు. ప్రత్యేక స్వచ్ఛతా కార్యక్రమం 3.0 యొక్క పురోగతి ప్రతిరోజూ ప్రత్యేక పోర్టల్ (https://scdpm.nic.in/)లో పర్యవేక్షించబడింది. సీనియర్ స్థాయిలలో రెగ్యులర్ సమీక్షా సమావేశాలు ప్రత్యేక ప్రచారం 3.0కి అద్భుతమైన ఊపును అందించాయి. మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్ల ద్వారా 75,000కి పైగా సోషల్ మీడియా పోస్ట్‌లు, డిఏఆర్‌పిజి హ్యాండిల్ ద్వారా 800 ట్వీట్లు, #SpecialCampaign3.0లో 1100 ఇన్ఫోగ్రాఫిక్స్ మరియు 258 పిఐబీ స్టేట్‌మెంట్‌ల జారీతో స్పెషల్ క్యాంపెయిన్ 3.0 సోషల్ మీడియాలో గణనీయమైన ట్రాక్‌ను పొందింది. పోర్టల్‌లో మంత్రిత్వ శాఖలు నివేదించిన ప్రాథమిక డేటా ప్రకారం, కార్యక్రమం యొక్క ఫలితాలు క్రింది విధంగా ఉన్నాయి:

 

క్రమ సంఖ్య

కొలమానం

ఫలితాలు

1.

స్వచ్ఛతా ప్రచార సైట్లు లక్షల్లో )

2.53

2.

ఆర్జించిన ఆదాయం (రూకోట్లలో)

499.68

3.

స్పేస్ ఫ్రీడ్ లక్ష చ.. )

153.70

4.

సమీక్షించబడ్డ రికార్డ్స్ మేనేజ్‌మెంట్ ఫైల్‌లు (ఫిజికల్ ఫైల్‌లు -ఫైల్స్)

46,11,117

5.

రికార్డ్ మేనేజ్‌మెంట్ (తొలగించబడ్డ భౌతిక ఫైల్‌లు +మూసివేయబడ్డ -ఫైళ్లు)

23,08,895

6.

పరిష్కరించబడ్డ ప్రజా ఫిర్యాదులు అప్పీళ్లు

4,74,742


స్వచ్ఛతను సంస్థాగతీకరించడంలో ప్రత్యేక స్వచ్ఛతా కార్యక్రమం 3.0లో ఉద్భవించిన ఉత్తమ అభ్యాసాల జాబితా క్రింది విధంగా ఉంది:

  1. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ –సిబిడిటికి చెందిన సిపిజిఆర్‌ఏఎంఎస్‌పై ఐ-గాట్‌ ప్రారంభం
  2. పరిపాలనా సంస్కరణలు & ప్రజా ఫిర్యాదుల విభాగం – ఇంటెలిజెంట్ గ్రీవెన్స్ మానిటరింగ్ సిస్టమ్ (ఐజిఎంఎస్‌) ప్రారంభం 2.0
  3. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ - కృషి భవన్‌లో వర్టికల్ గార్డెన్స్
  4. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ & ఎంట్రప్రెన్యూర్‌షిప్ –ఐటీఐ  బెర్హంపూర్‌లో ప్లాస్టిక్ బాటిళ్ల నుండి ఏనుగు విగ్రహం
  5. ఉన్నత విద్యా శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ -విఎన్‌ఐటీ, నాగపూర్ వద్ద ప్లాస్టిక్ వ్యర్థాల నుండి చెక్ డ్యామ్‌లు
  6. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ – ఇ-వ్యర్థాల నుండి విలువైన లోహాలను సమర్ధవంతంగా తీయడానికి చక్రాలపై రీసైక్లింగ్
  7. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం - "రోజువారీ జీవితంలో స్వచ్ఛత" అనే అంశంపై పిల్లలకు పెయింటింగ్ పోటీ
  8. పాఠశాల విద్య & అక్షరాస్యత శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ - భారతదేశం అంతటా సిబిఎస్‌ఈ పాఠశాల విద్యార్థులచే స్వచ్ఛతా ప్రచారంలో శ్రమదాన్, ఒడిశాలోని అంబపువాలోని కేంద్రీయ విద్యాల బెర్హంపూర్‌లో 'దైవిక గోడ' సృష్టి, వాతావరణ చర్య కింద ప్లగింగ్‌లో సేకరించిన 5500+ ప్లాస్టిక్ క్యాప్‌లతో రూపొందించబడింది.
  9. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్: బెంగుళూరు పోస్టాఫీసులో వాల్ ఆర్ట్, బెంగుళూరులోని సర్కిల్ పోస్టాఫీసులో క్రెష్ స్థాపించబడింది
  10. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ: ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లోని ట్రీ హౌస్
  11. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్: ఇండిపెండెంట్ పబ్లిక్ గ్రీవెన్స్ డ్యాష్‌బోర్డ్
  12. భూ వనరుల విభాగం: ఆరోగ్యం & శ్రేయస్సుపై ఉపన్యాసాలు
  13. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ: మహాబలిపురంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశంలో పరిశుభ్రత
  14. కొత్త & పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ: ఉర్జా భవన్‌లో అధికారులందరికీ కొత్త జిమ్ ప్రారంభించబడింది
  15. బొగ్గు మంత్రిత్వ శాఖ:ఎస్‌ఈసిఎల్ అనుప్పూర్‌లో స్క్రాప్ (“కాబాద్ సే కళాకృతి”)తో చేసిన శిల్పాలు
  16. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ:ఎయిమ్స్‌ మంగళగిరి ఓపిడి వెయిటింగ్ ఏరియాలో ఎంబిబిఎస్‌ విద్యార్ధులతో ఫ్లాష్ మాబ్ ద్వారా అవగాహన మరియు  ప్రసంగం, ప్రతిజ్ఞ
  17. జలవనరుల శాఖ, నదుల అభివృద్ధి మరియు గంగా పునరుజ్జీవనం: ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్‌లో గంగానది స్వచ్ఛ ప్రతిజ్ఞ
  18. రక్షణ మంత్రిత్వ శాఖ: “వేస్ట్ టు వెల్త్”: అరుణాచల్ ప్రదేశ్‌లో రోడ్ల నిర్మాణానికి 200 ఎంటీ స్టీల్ స్లాగ్ ఉపయోగించబడింది
  19. రెవెన్యూ డిపార్ట్‌మెంట్:సిబిఐసి, కోల్‌కతా క్యాంపస్ 1985-2013 మధ్య కొనుగోలు చేసిన 28 పాత వాహనాలను తొలగించింది
  20. రక్షణ మంత్రిత్వ శాఖ: హెడ్ క్వార్టర్ ఐడిఎస్‌ ఎంఎస్‌టిసి ద్వారా 870 కిలోల ఐటీ స్క్రాప్‌ను పారవేసింది


ప్రత్యేక స్వచ్ఛతా కార్యక్రమం 3.0 కింద కేంద్ర సెక్రటేరియట్‌లో పెండింగ్‌ను తగ్గించడం, చాలా మంత్రిత్వ శాఖలు/విభాగాలు నివేదించిన లక్ష్యాలలో 90-100 శాతం సాధించడం అభినందనీయమని డా. జితేంద్ర సింగ్ అన్నారు. ప్రత్యేక స్వచ్ఛతా ఉద్యమం 3.0ని ఏడాది పొడవునా కొనసాగించి దానిని జీవన విధానంగా మార్చుకోవాలని అధికారులందరికీ పిలుపునిచ్చారు. ప్రత్యేక స్వచ్ఛతా ఉద్యమం 3.0  అక్టోబర్ 31 , 2023న అత్యుత్తమ ఫలితాలతో ముగిసింది.మొత్తం డేటాను క్రోడీకరించిన తర్వాత మూల్యాంకన దశ నవంబర్ 10, 2023 నుండి ప్రారంభమవుతుంది.
 

***


(Release ID: 1973994) Visitor Counter : 49


Read this release in: English , Urdu , Hindi , Tamil