కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

ఇ పి ఎఫ్ ఒ 71వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు


ఇపిఎఫ్ ఒ ఒక ఇబ్బంది లేని, సాంకేతిక ఆధారిత సంస్థగా మారాలి: శ్రీ భూపేందర్ యాదవ్

ఈ సంవత్సరం ఇపిఎఫ్ ఒ 8.15% ఈ ఏడాది వడ్డీని ఇస్తుండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన శ్రీ భూపేందర్ యాదవ్ : ఇప్పటికే 24 కోట్లకు పైగా ఖాతాలలో వడ్డీ జమ

ఉత్తమ పనితీరుకు గానూ భవిష్య నిధి అవార్డులు - 2023 ప్రదానం

Posted On: 01 NOV 2023 5:17PM by PIB Hyderabad

కేంద్ర కార్మిక, ఉపాధి, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ఈ రోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో  ఇపిఎఫ్ ఒ  71వ వ్యవస్థాపక దినోత్సవాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర కార్మిక, ఉపాధి, పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తేలీ, కార్మిక, ఉపాధి శాఖ కార్యదర్శి శ్రీమతి ఆర్తి అహుజా, సెంట్రల్ పిఎఫ్ కమిషనర్ శ్రీమతి నీలం షమీ రావు, ఈఎస్ఐసి డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.

గత కొన్నేళ్లుగా ఇపిఎఫ్ ఒ ఎదుగుతున్న తీరు, సభ్యుల పొదుపు నిధిని నిర్వహిస్తున్న తీరుపై భూపేందర్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి నెలా 27న జిల్లా స్థాయిలో ప్రతి ఇపిఎఫ్ ఒ  కార్యాలయం నిర్వహించే 'నిధి ఆప్కే నికత్' కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించారు. అక్టోబర్ 31, 2019 నుండి ఈ చట్టంలోని నిబంధనలను జమ్మూ కాశ్మీర్ కార్మిక వర్గానికి ఇపిఎఫ్ఓ విస్తరించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

ఇపిఎఫ్ ఒ ఇబ్బందులు లేని ,  టెక్నాలజీ ఆధారిత సంస్థగా మారాలని శ్రీ యాదవ్ ఉద్బోధించారు. ఈ ఏడాది ఇ పి ఎఫ్ ఒ  8.15 శాతం వడ్డీ ఇస్తోందని, ఇప్పటికే 24 కోట్లకు పైగా ఖాతాల్లో వడ్డీ జమ చేసిందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇపిఎఫ్ ఒ  71వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రామేశ్వర్ తేలీ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.  ఇంఫాల్, ఇటానగర్, ఐజ్వాల్, దిమాపూర్, గ్యాంగ్టక్ లోని ప్రత్యేక రాష్ట్ర కార్యాలయాల ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లోని సభ్యులు, వృద్ధ పెన్షనర్లకు సేవలను చేరువ చేయడానికి ఇపిఎఫ్ ఒ   తీసుకున్న చర్యలను ఆయన ప్రశంసించారు.

ఈ సందర్భంగా చాట్ బాట్, పునరుద్ధరించిన ఎంఐఎస్ 3.0తో సహా 71 సంవత్సరాల ఇ పి ఎఫ్ ఒ చరిత్రను వివరించే  "అమృత్ కాల్ - బెహతర్ కల్" అనే ఎగ్జిబిషన్ ను సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తేలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ 71 ఏళ్ల ప్రయాణంపై 'ఇ పి ఎఫ్ ఒ సాధించిన విజయాలు' అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించారు.

కమ్యూనికేషన్ ఫ్రేమ్ వర్క్ డాక్యుమెంట్, ఆడిట్ మాన్యువల్, రికవరీ మాన్యువల్, మినహాయింపు మాన్యువల్ పై స్టేట్ ప్రొఫైల్ బుక్ లెట్ 2023, ఎస్టాబ్లిష్ మెంట్ ఇ- రిపోర్ట్, 50 ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్, మాన్యువల్ ల రెండో ఎడిషన్ ను మంత్రి ఆవిష్కరించారు.

ఒడిశాలోని బెహ్రాంపూర్ ప్రాంతీయ కార్యాలయ భవనానికి వర్చువల్ విధానంలో సహాయ మంత్రి శంకుస్థాపన చేశారు.  కర్ణాటకలోని తుమకూరులో ప్రాంతీయ కార్యాలయ భవనాన్ని వర్చువల్ విధానంలో ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బసవరాజ్, తుమకూరు ఎమ్మెల్యే జి.బి.జ్యోతి గణేష్ పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని కిడావాయి నగర్ లో నూతన ప్రధాన కార్యాలయ భవనాన్ని కేంద్ర సహాయ మంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు.

మిషన్ Karmayogi@EPFO ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ పై ఒక చలన చిత్రాన్ని  ప్రదర్శించారు. ఇది ఇపిఎఫ్ ఒ అధికారుల శిక్షణ కు సంబంధించిన సంఘటనాత్మక ప్రయాణాన్ని ఆవిష్కరించింది.  

ఈ కార్యక్రమంలో వివిధ కార్యాలయాలు, సంస్థలకు అవార్డులను ప్రదానం చేశారు. ప్రదానోత్సవం జరిగింది:-

  •   భవిష్య నిధి అవార్డు 2023 -ఉత్తమ ప్రాంతీయ కార్యాలయం (పెద్ద ) - ఆర్వో కోయంబత్తూరు
  •   భవిష్య నిధి అవార్డు 2023- ఉత్తమ ప్రాంతీయ కార్యాలయం (చిన్న) ఆర్వో రాజమహేంద్రవరం
  •   భవిష్య నిధి అవార్డు 2023 - ఉత్తమ జిల్లా కార్యాలయం - డి ఒ అలీఘర్
  •   భవిష్య నిధి అవార్డు 2023 - ఉత్తమ రిమోట్ ఆఫీస్ - ఆర్ ఒ.గౌహతి
  •   భవిష్య నిధి అవార్డు 2023 -. ఉత్తమ జోనల్ కార్యాలయం- జెడ్ ఒ హుబ్లీ (కర్ణాటక- గోవా)
  •   భవిష్య నిధి అవార్డు 2023 -. గ్రీవెన్స్ మేనేజ్ మెంట్ లో ఉత్తమ కార్యాలయం - ఆర్ ఒ అహ్మదాబాద్
  •   భవిష్య నిధి అవార్డు 2023 -. ప్రో-యాక్టివ్ సెటిల్మెంట్ లో ఉత్తమ కార్యాలయం - ఆర్ ఒ కొల్లాం
  •   భవిష్య నిధి అవార్డు 2023 - జీవన్ ప్రమాణ్ లో ఉత్తమ నిర్వహణ- ఆర్ఓ వాట్వా
  •   భవిష్య నిధి అవార్డు 2023 - ఉత్తమ ఎన్ ఎ ఎన్ 2.0 క్యాంపెయిన్ - ఆర్ ఒ  జమ్మూ
  •   భవిష్య నిధి స్వచ్ఛత అవార్డు 2023 - ఆర్ ఒ భోపాల్
  •   భవిష్య నిధి అవార్డు 2023-  ఉత్తమ ఆవిష్కరణ - ఆర్ ఒ నోయిడా
  •   భవిష్య నిధి అవార్డు 2023-  బెస్ట్ టెక్ ఇంటర్వెన్షన్ - ఎన్ డి సి  టెక్నికల్ టీమ్
  •   భవిష్య నిధి అవార్డు 2023-   కెపాసిటీ బిల్డింగ్ లో అత్యుత్తమ ప్రతిభ - పి డి ఎన్ ఎ ఎస్ ఎస్ ఇండక్షన్ ట్రైనింగ్ టీమ్
  •   భవిష్య నిధి అవార్డు 2023-  ఉత్తమ మినహాయింపు పొందిన ట్రస్ట్ -      మెసర్స్ జెన్సార్ టెక్ లిమిటెడ్ (పి యు పి యు ఎన్000398)
  •   భవిష్య నిధి అవార్డు 2023-  అత్యుత్తమ క్రీడా విజయాలు - జడ్ ఒ చెన్నై అండ్ పుదుచ్చేరి
  •   భవిష్య నిధి అవార్డు 2023-  స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ - శ్రీమతి రాధికా గుప్తా, ఎస్ఎస్ఎస్ఎ, ఆర్ ఒ కందివలి ఈస్ట్
  •   భవిష్య నిధి అవార్డు 2023-  స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ - మేల్-శ్రీ క్లెమెంట్ అగస్టిన్, ఎస్ఎస్ఎస్ఎ, ఆర్ ఒ కొట్టాయం
  •   భవిష్య నిధి అవార్డు 2023- స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ - శ్రీ పి.శివ కుమార్, ఎస్ఎస్ఎస్ఎ, ఆర్ ఒ  చెన్నై నార్త్

ఈ సందర్భంగా కార్మిక, ఉపాధి శాఖ కార్యదర్శి ఆర్తి అహుజా  అవార్డుల విజేతలను అభినందించారు. నిధి ఆప్కే నికత్ ఆధ్వర్యంలోని సంస్థ చేపట్టిన ఔట్ రీచ్ కార్యక్రమాలను ఆమె ప్రశంసించారు. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖలోని ఇతర విభాగాలతో సమన్వయంతో ఆమోదయోగ్యత, అందుబాటు, పారదర్శకతను మరింత పెంచాలని, తద్వారా ప్రభుత్వ కన్వర్జెన్స్ ప్రోగ్రామ్ కింద ఒకరి సామర్థ్యాలు, వనరుల నుంచి మరొకరు ప్రయోజనం పొందాలని ఆమె ఇ పి ఎఫ్ ఒ ను కోరారు. ఈ రోజు ఆవిష్కరించిన మాన్యువల్స్ ప్రక్రియలను ప్రామాణికీకరించడానికి , సంస్థలో ఏకరూపతను తీసుకురావడానికి సహాయపడతాయని ఆమె అన్నారు.

ఇ పి ఎఫ్ ఒ  71వ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరైన ప్రముఖులందరికీ ఇ పి ఎఫ్ ఒ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ శ్రీమతి నీలం షమీరావు స్వాగతం పలికారు. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

కేంద్ర కార్మిక, ఉపాధి, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ అధ్యక్షతన అక్టోబర్ 31న న్యూఢిల్లీలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఇ పి ఎఫ్  234వ సమావేశం కూడా జరిగింది.

కేంద్ర కార్మిక, ఉపాధి, పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తేలీ ఉపాధ్యక్షత వహించగా, కార్మిక, ఉపాధి శాఖ కార్యదర్శి శ్రీమతి ఆర్తి అహుజా, సహాధ్యక్షత వహించారు. కేంద్ర పిఎఫ్ కమిషనర్ సభ్య కార్యదర్శి శ్రీమతి నీలం షమీరావు పాల్గొన్నారు.

A15A7497.JPG

ఈ సమావేశంలో ఈ కింది నిర్ణయాలు తీసుకున్నారు:-

  1.  2022-23 సంవత్సరానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇ పి ఎఫ్ ఒ ) పనితీరుపై 70వ వార్షిక నివేదికను పార్లమెంట్ ముందుంచడానికి బోర్డు ఆమోదం తెలిపింది.
  2.  ఇ పి ఎఫ్ అండ్ ఎంపీ యాక్ట్, 1952లోని సెక్షన్ 17(4) ప్రకారం తగిన ప్రభుత్వానికి 13 సంస్థల మినహాయింపును సరెండర్ చేసే ప్రతిపాదనను, ఆరు సంస్థల మినహాయింపు రద్దు ప్రతిపాదనను బోర్డు ఆమోదించింది.
  3.  ఇ పి ఎఫ్ ఒ కు చెందిన వివిధ హెచ్ఆర్ అంశాలను బోర్డు పరిగణనలోకి తీసుకుంది.
  4.  డిప్యుటేషన్, రిక్రూట్మెంట్, పదోన్నతులకు అవకాశం కల్పించే ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ డివిజన్ల ప్రోగ్రామర్, అసిస్టెంట్ డైరెక్టర్ (ఐఎస్), డిప్యూటీ డైరెక్టర్ (ఐఎస్), జాయింట్ డైరెక్టర్ (ఐఎస్) పోస్టులకు టెక్నికల్ కేడర్ల రిక్రూట్మెంట్ రూల్స్ సవరణలకు బోర్డు ఆమోదం తెలిపింది.
  5.  ఇ పి ఎఫ్  స్కీమ్ 1952లోని పేరాగ్రాఫ్ 26(6) కింద జాయింట్ రిక్వెస్ట్ లను పొందే ప్రక్రియకు బోర్డు ఆమోదం తెలిపింది.
  6. నెక్ట్స్-జనరేషన్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ , కార్యాచరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
  7. కమ్యూనికేషన్ ఫ్రేమ్ వర్క్ డాక్యుమెంట్ ను బోర్డు ఆమోదించింది, ఇది ఇపిఎఫ్ ఒలో , దాని వాటాదారులతో సమాచారాన్ని సమర్థవంతంగా,  సకాలంలో వ్యాప్తి చేయడానికి సహాయపడుతుంది.
  8. ఆడిట్ ప్రక్రియలను ప్రామాణీకరించడానికి, ఉద్యోగులకు శిక్షణ వనరును అందించడానికి, నిర్ణయాలు తీసుకోవడాన్ని సులభతరం చేయడానికి , ఇపిఎఫ్ ఒ లో ఆడిట్ సమాచారాన్ని ఏకీకృతం చేయడానికి సహాయపడే ముసాయిదా ఆడిట్ మాన్యువల్ ను బోర్డు ఆమోదించింది.     
  9.  రికవరీ ప్రక్రియలను ప్రామాణీకరించడానికి, శిక్షణా వనరుగా పనిచేయడానికి, నిర్ణయం తీసుకోవడానికి సూచనను అందించడానికి మరియు రికవరీ సమాచారాన్ని ఏకీకృతం చేయడానికి సహాయపడే ముసాయిదా రికవరీ మాన్యువల్ ను బోర్డు ఆమోదించింది.
  10. ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి, శిక్షణ ఇవ్వడానికి , సమాచారాన్ని క్రోడీకరించడానికి సహాయపడే ముసాయిదా మినహాయింపు మాన్యువల్ ను బోర్డు ఆమోదించింది ఇంకాఅనేక ఇతర అంశాలపై నిర్ణయం తీసుకుంది.

 

***



(Release ID: 1973993) Visitor Counter : 64