గనుల మంత్రిత్వ శాఖ
గనుల మంత్రిత్వ శాఖ,శాఖ సబార్డినేట్ కార్యాలయాల్లో విజయవంతంగా లక్ష్యాల మేరకు అమలు జరిగిన స్వచ్ఛత ప్రత్యేక ప్రచారం 3.0
పనికిరాని వ్యర్థాల అమ్మకాల ద్వారా రూ.10.9 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన మంత్రిత్వ శాఖ
ప్రజల అవసరాలు గుర్తించి పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించిన గనుల శాఖ
ప్రత్యేక ప్రచారం3.0 కింద 11033 ఇ-ఫైళ్లు అప్‌లోడ్ చేసిన మంత్రిత్వ శాఖ
Posted On:
01 NOV 2023 3:30PM by PIB Hyderabad
గనుల మంత్రిత్వ శాఖ,శాఖ సబార్డినేట్ కార్యాలయాల్లో విజయవంతంగా లక్ష్యాల మేరకు స్వచ్ఛత ప్రత్యేక ప్రచారం 3.0 అమలు జరిగింది. గనుల మంత్రిత్వ శాఖ, శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న అనుబంధ/సబార్డినేట్ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంష్తలు, స్వయంప్రతిపత్తి సంస్థలు స్వచ్ఛత ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాయి.పెండింగ్ లో ఉన్న పార్లమెంట్ సభ్యులు,ప్రధానమంత్రి కార్యక్రమం నుంచి అందిన సిఫార్సులు, ఇతర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందిన సూచనలు, ప్రజా ఫిర్యాదులను పరిష్కరించి పనికిరాని వ్యర్థాలను తొలగించడం లక్ష్యంగా కార్యక్రమం అమలు జరిగింది. గత సంవత్సరం సాధించిన విజయాన్ని కొనసాగించిన , గనుల మంత్రిత్వ శాఖ మరోసారి 100% లక్ష్యాలను సాధించింది.
ప్రత్యేక ప్రచారం 3.0 కింద గనుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో 382 కార్యక్రమాలు నిర్వహించింది. కార్యక్రమంలో భాగంగా గనుల మంత్రిత్వ శాఖ 89482 చదరపు అడుగుల స్థలాన్ని తిరిగి వినియోగం లోకి తెచ్చింది. ఖాళీ అయిన స్థలంలో ఉద్యోగుల కోసం వాలీబాల్ గ్రౌండ్, బ్యాడ్మింటన్ కోర్టు మొదలైన సౌకర్యాలు అభివృద్ధి చేశారు. పనికిరాని వ్యర్థాల అమ్మకాల ద్వారా రూ.10.9 కోట్ల ఆదాయాన్ని మంత్రిత్వ శాఖ పొందింది.
కార్యక్రమంలో భాగంగా పర్యావరణహిత కార్యక్రమాలను "గివింగ్ బ్యాక్ టు నేచర్" పేరుతో మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేసింది. పర్యావరణ స్పృహతో కూడిన ఈ కార్యక్రమంలో ప్రజల కోసం సరస్సు శుభ్రపరచడం, వ్యర్థాల నుండి కంపోస్ట్ పిట్‌ను రూపొందించడం, మైక్రోవేవ్ వినియోగం ద్వారా ఇంధనాన్ని ఆదా చేసే చర్యలు అమలు చేసిన మంత్రిత్వ శాఖ పక్షులకు ఆహరం అందించడానికి సౌకర్యాలు కల్పించి, , కార్యాలయ ఆవరణలో మూలికా మొక్కలు నాటడం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఫ్లెక్స్ బ్యానర్‌ల స్థానంలో డిజిటల్ స్క్రీన్‌లను ఏర్పాటు చేసిన గనుల మంత్రిత్వ శాఖ ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛత (పరిశుభ్రత) కిట్‌ల పంపిణీ చేసింది. ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. బహిష్టు సమయంలో ఆరోగ్యం/పరిశుభ్రత అంశాలపై బాలికలకు అవగాహన కల్పించడానికి కార్యక్రమాలు నిర్వహించింది.
స్వచ్ఛత ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా భౌతిక ఫైళ్లను ఈ-ఫైళ్లుగా గనుల మంత్రిత్వ శాఖ మార్చింది.
మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) క్షేత్ర పరిశోధనల సమయంలో సంవత్సరాలుగా సేకరించిన ఉపయోగించని భౌగోళిక నమూనాలు ఉపయోగించి కళాత్మక శిల్పాన్ని రూపొందించింది.
***
(Release ID: 1973977)
Visitor Counter : 43