సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సైబర్‌ భద్రతపై ఒక రోజు సదస్సును నిర్వహించిన సెంట్రల్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషన్‌

Posted On: 01 NOV 2023 4:36PM by PIB Hyderabad

సెంట్రల్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషన్‌ సైబర్‌ భద్రతపై నిన్న ఒక సదస్సును నిర్వహించింది. ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ శ్రీ సురేష్‌ చంద్ర ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ హీరాలాల్‌ సమారియా, శ్రీమతి సరోజ్‌ పున్హాని, శ్రీ ఉదయ్‌ మహుర్‌కర్‌ , పలువురు ఇన్ఫర్మేషన్‌ కమిషనర్లు ఇందులో పాల్గొన్నారు. సోమనాథ్‌ బెనర్జీ, సిఐఎస్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌ , కీలకోపన్యాసమిచ్చారు.
శ్రీమతి రష్మి చౌదరి, సెక్రటరీ, సిఐసి ప్రారంభోపన్యాసం చేస్తూ, సైబర్‌ భద్రత ప్రాధాన్యత గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. ఇందుకు సంబంధించిన చర్చలో క్రియాశీలంగా పాల్గొనాల్సిందిగా ఆమె , ఈ సదస్సులో పాల్గొన్న వారిని కోరారు.అలాగే ఈ సదస్సు ద్వారా ప్రయోజనం పొందాల్సిందిగా ఆమె కోరారు.
సిఐఎస్‌ఒ, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, గ్లోబల్‌ సర్వీసెస్‌ శ్రీ సోమనాథ్‌ బెనర్జీ కీలకోపన్యాసం ద్వారా, సైబర్‌భద్రత విషయంలో గల సవాళ్లను, ముప్పును ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి దృష్టికి తెచ్చారు.  సైబర్‌ భద్రత, సైబర్‌ ముప్పుకు సంబంధించి ఆసక్తికర వాస్తవాలు, గతంలో జరిగిన ఘటనలు వంటి వాటిని వారు వివరించారు.
  ఎన్‌.ఐ.సి` సి.ఇ.ఆర్‌.టి జాయింట్‌ డైరక్టర్‌ సయ్యద్‌ హసన్‌ మెహమూద్‌ మాట్లాడుతూ,ప్రభుత్వ ఉద్యోగులకు  సంబంధించి, సైబర్‌ భద్రతా మార్గదర్శకాలను వివరించారు.

సౖబర్‌ ప్రపంచంలో అనుసరించవలసిన, అనుసరించకూడని వాటి గురించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి వివరించారు. అలాగే సైబర్‌ జాగ్రత్త ల గురించి వివరించారు.
శ్రీమతి అంజనా చౌదరి, శ్రీ వాధ్వానా  సైబర్‌ సమస్యల విషయంలో పరిష్కారాల గురించి మాట్లాడారు.  అలాగే ఈ రంగంలో సమస్యలు, ముప్పు ఇబ్బందుల వంటి వాటిని గురించి చర్చించారు.
సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌(లీగల్‌), హెడ్‌(లిటిగేషన్‌) శ్రీ పవన్‌ కుమార్‌, ఆర్థిక అంశాలలలో సైబర్‌ భద్రత ప్రాధాన్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. సైబర్‌ నేరాల కేసులు, బ్యాంకు మోసాల కేసులలో సాక్ష్యాలను శాస్త్రీయంగా విశ్లేషించడం గురించి వారు వివరించారు.
శ్రీ శివకుమార్‌ సీనియర్‌ డైరక్టర్‌ (ఐటి ) మాస్టర్‌ ఆఫ్‌ ఈవెంట్‌గా వ్యవహరించారు. శ్రీమతి రూప్‌ అవతార్‌ కౌర్‌ అడిషనల్‌ సెక్రటరీ, సిఐసి కార్యక్రమ ముగింపు సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సదస్సుకు సుమారు 170 మంది అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.

 

***


(Release ID: 1973973) Visitor Counter : 76