కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశం అంతటా పరిశుభ్రత , సమర్థత పట్ల నిబద్ధతను ప్రదర్శించిన డాట్ స్పెషల్ క్యాంపెయిన్ 3.0


డాట్ 100% ప్రజా ఫిర్యాదుల పరిష్కారాన్ని సాధించింది: స్పెషల్ క్యాంపెయిన్ 3.0 లో 10,000 ఫైళ్లను తొలగించింది.

డాట్ దేశవ్యాప్త పరిశుభ్రత డ్రైవ్ ద్వారా 91,813 చదరపు అడుగుల స్థలాన్ని చెత్త నుంచి ఖాళీ చేసింది: స్క్రాప్ అమ్మకం ద్వారా రూ. 23,39,650/- ఆర్జించింది

Posted On: 01 NOV 2023 2:05PM by PIB Hyderabad

స్వచ్ఛతను సంస్థాగతం చేయడానికి , ప్రభుత్వంలో పెండింగ్ ను తగ్గించడానికి ప్రధాన మంత్రి దార్శనికత నుండి ప్రేరణ పొంది, పరిపాలనా సంస్కరణలు , ప్రజా ఫిర్యాదుల విభాగం ప్రారంభించిన నెల రోజుల దేశవ్యాప్త స్వచ్ఛతా క్యాంపెయిన్ 3.0 లో టెలికమ్యూనికేషన్స్ విభాగం చురుకుగా పాల్గొంది.

టెలికమ్యూనికేషన్స్ విభాగం 02.10.2023 నుండి 31.10.2023 వరకు దేశవ్యాప్తంగా డాట్ ప్రధాన కార్యాలయం, దాని అనుబంధ ,  సబార్డినేట్ కార్యాలయాలు, ఫీల్డ్ ఆఫీసులు ,  పిఎస్ యు లలో స్పెషల్ క్యాంపెయిన్ 3.0 నిర్వహించింది. ఈ ప్రచారానికి ముందు 14.09.2023 నుండి 30.09.2023 వరకు సన్నాహక దశ జరిగింది. సన్నాహక దశలో-  పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాల్సిన ప్రాంతాలను గుర్తించేందుకు కార్యదర్శి (టెలికాం) వివిధ విభాగాలను పరిశీలించారు.

అక్టోబర్ 2వ తేదీ ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా ‘స్వచ్ఛత హి సేవ’లో భాగంగా దేశవ్యాప్తంగా పరిశుభ్రత డ్రైవ్‌కు నాయకత్వం వహించే గంటసేపు “శ్రమదాన్”తో డిపార్ట్‌మెంట్‌లో ప్రచార దశ ప్రారంభం అయింది. గాంధీ జయంతి సందర్భంగా 'దైనందిన జీవితంలో స్వచ్ఛత' అనే అంశంపై ఉద్యోగుల పిల్లల కోసం డాట్  ప్రధాన కార్యాలయం లో డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహించారు.

ఎంపీల రిఫరెన్సులు, రాష్ట్ర ప్రభుత్వ రిఫరెన్సులు, ఇంటర్ మినిస్టీరియల్ రిఫరెన్స్ (క్యాబినెట్ నోట్), పార్లమెంటరీ హామీలు, పీఎంవో రిఫరెన్స్ లు, పబ్లిక్ గ్రీవెన్స్ ,  పీజీ అప్పీళ్లకు సంబంధించి పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించడంపై ఈ క్యాంపెయిన్ దృష్టి సారించింది. వీటితో పాటు కార్యాలయ పరిసరాల్లో పరిశుభ్రత కోసం పలు స్పెషల్ డ్రైవ్ లు చేపట్టి ఫైళ్లను తొలగించడంతోపాటు కాలం చెల్లిన కార్యాలయ సామగ్రిని తొలగించారు.

గుర్తించిన అన్ని ప్రజా ఫిర్యాదులు, ప్రజా అప్పీళ్లు, పిఎమ్ ఒ రిఫరెన్స్ లు , రాష్ట్ర ప్రభుత్వ రిఫరెన్స్ లను డిపార్ట్ మెంట్ 100% పరిష్కరించింది. ఇంకా, 49667 భౌతిక ఫైళ్లను సమీక్షించారు . 10000 కంటే ఎక్కువ భౌతిక ఫైళ్లను తొలగించారు. 91,813 చదరపు అడుగుల స్థలాన్ని ఖాళీ చేయించారు. పాత సామాగ్రి అమ్మడం ద్వారా రూ.23,39650 ఆదాయం సమకూరింది. దేశవ్యాప్తంగా దాదాపు 400 చోట్ల ఈ క్యాంపెయిన్ నిర్వహించారు.

డిపార్ట్ మెంట్ ఈ కాలంలో అనేక ఉత్తమ పద్ధతులను కూడా అనుసరించింది, వాటిలో కొన్ని క్రింద పేర్కొనడం జరిగింది. పునరుత్పత్తి చేయబడ్డాయి

 

 

 

 న్యూఢిల్లీలోని సంచార్ భవన్ గ్రౌండ్ ఫ్లోర్ లో వికలాంగ ఉద్యోగులకు మరుగు దొడ్లు

    

 పీజీ కేసుల కోసం డాట్ డ్యాష్ బోర్డు రియల్ టైమ్ ప్రాతిపదికన రిపోర్టును జనరేట్ చేస్తుంది.

 వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించడంలో స్థానిక సమాజాన్ని భాగస్వామ్యం చేయడంపై స్పెషల్ క్యాంపెయిన్ 3.0లో భాగంగా స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ ఇస్రో, గుజరాత్ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (జియుజెసిఒఎస్ టి), గుజరాత్ సైన్స్ సిటీ సహకారంతో మిషన్ చంద్ర అనే సైన్స్ పోటీని గుజరాత్ లోని  సిసిఎ కార్యాలయంలో నిర్వహించారు. గుజరాత్ లోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలల నుంచి 300 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.

Description: C:\Users\hp\Downloads\WhatsApp Image 2023-10-15 at 8.45.08 PM.jpeg

డిపార్ట్ మెంట్,  దాని ఫీల్డ్ ఆఫీసుల ట్విట్టర్ (ఇప్పుడు X) హ్యాండిల్ ద్వారా సోషల్ మీడియా సందేశాలు చేయబడ్డాయి. పీఐబీ ద్వారా పత్రికా ప్రకటనలు చేశారు.

పరిశుభ్రత డ్రైవ్ ముందు తరువాత కొన్ని చిత్రాలు క్రింద ఇవ్వబడ్డాయి:

పరిశుభ్రత కు ముందు…

పరిశుభ్రత తరువాత…

బెంగళూరు ప్లాంట్ ఐటీఐ లిమిటెడ్

టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్ మెంట్ దేశవ్యాప్తంగా ఉన్న తన సంస్థల్లో స్పెషల్ క్యాంపెయిన్ లక్ష్యాలను కొనసాగించడానికి కట్టుబడి ఉంది.


(Release ID: 1973970) Visitor Counter : 53


Read this release in: English , Urdu , Hindi