రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
అస్సాంలోని గౌహతి లో 17,500 కోట్ల రూపాయల విలువైన 26 జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన - శ్రీ నితిన్ గడ్కరీ
Posted On:
31 OCT 2023 4:22PM by PIB Hyderabad
అస్సాంలోని గౌహతి లో 17,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడులతో 26 జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈరోజు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి జనరల్ శ్రీ వీ.కే. సింగ్, అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ తో పాటు, పలువురు రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ఎన్.హెచ్.ఐ.డి.సి. అధికారులు కూడా పాల్గొన్నారు.
ఎగువ అస్సాం - అరుణాచల్ ప్రదేశ్ మధ్య అంతర్రాష్ట్ర అనుసంధానతను మెరుగుపరచడం, వ్యూహాత్మక ఉనికిని పెంచడంతో పాటు, వాణిజ్యం, పర్యాటకాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా దిబ్రూఘర్-టిన్సుకియా-లెడో ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. అదేవిధంగా, బరాక్ వ్యాలీని మిజోరాం తో కలిపే సిల్చార్ నుండి లైలాపూర్ సెక్షన్ ప్రాజెక్టు సామాజిక-ఆర్థిక వృద్ధిని, ధేమాజీ జిల్లాలోని ఎన్ .హెచ్-515 ప్రాజెక్టు - ఉత్తర అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ మధ్య అనుసంధానతను మెరుగుపరుస్తాయి.
ఎన్.హెచ్-137 ప్రాజెక్టు దిమా హసావో ప్రాంతంలో అనుసంధాతను మెరుగుపరచడంతో పాటు, పశ్చిమ మణిపూర్ కు ప్రత్యామ్నాయ మార్గాన్ని అందిస్తుంది. పైకాన్ నుండి గౌహతి విమానాశ్రయం విభాగం ప్రాజెక్టు జోగిఘోపాలో మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ పార్క్ కు వెళ్ళే మార్గాన్ని సులభతరం చేస్తుంది. అదేవిధంగా, కొత్త వంతెనల నిర్మాణం వల్ల రద్దీ తగ్గడంతో పాటు, ఈ ప్రాంతంలో వాణిజ్యం, పర్యాటకం, సామాజిక-ఆర్థిక పురోగతి మెరుగవుతుంది.
*****
(Release ID: 1973598)
Visitor Counter : 164