బొగ్గు మంత్రిత్వ శాఖ
100 మిలియన్ టన్నుల బొగ్గు పంపిణీని సాధించిన సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్
30 మిలియన్ టన్నులకు పైగా పంపిణీ చేసిన అతిపెద్ద బొగ్గు గని గెవ్రా
ఈ ఏడాది 197 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించడంపై దృష్టి
Posted On:
30 OCT 2023 1:36PM by PIB Hyderabad
ఆర్ధిక సంవత్సరం 2023-24కుగాను 100 మిలియన్ టన్నుల (ఎంటి) బొగ్గు పంపిణీని కోల్ ఇండియా అనుబంధ సంస్థ సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్ఇసిఎల్) సాధించింది. ప్రారంభమైనప్పటి నుంచీ ఈ ఛత్తీస్‌గఢ్ కు చెందిన కంపెనీ సాధించిన అత్యంత వేగవంతమైన 100 ఎంటిల బొగ్గు పంపిణీ ఇది. గత ఏడాది, ఇదే కాలంలో ఎస్ఇసిఎల్ దాదాపు 85 మిలియన్ టన్నుల బొగ్గునను పంపిణీ చేసింది. దీనితో ఈ ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ 17.65% వృద్ధిని నమోదు చేసింది.
మొత్తం పంపిణీ చేసిన బొగ్గులో 80%కి పైగా బొగ్గు విద్యుత్ రంగానికి వెళ్ళింది. కంపెనీ పంపిణీ చేసిన దాదాపు 81 మిలియన్ టన్నుల బొగ్గు దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ కేంద్రాలకు వెళ్ళింది. విద్యుత్ డిమాండ్ అత్యధికంగా ఉండనున్న పండుగల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ విజయాన్ని విశేషంగా భావించవలసి ఉంటుంది.
కోర్బా జిల్లాలోని గెవ్రా, దిప్కా, కుస్ముందాలో ఉన్న ఎస్ఇసిఎల్ మెగా ప్రాజెక్టులు మొత్తం 100 మిలియన్ టన్నుల బొగ్గు పంపిణీలో అత్యధిక శాతం దోహదం చేశారు. దేశంలోని అతిపెద్ద బొగ్గు గని అయిన గెవ్రా 30.3 ఎంటిలు, దిప్కా, కుస్ముందా వరుసగా 19.1 ఎంటిలు & 25.1 ఎంటిల బొగ్గుకు దోహదం చేశాయి. మొత్తం పంపిణీలో ఈ మూడు మెగా ప్రాజెక్టుల మొత్తం వాటా 74శాతానికి పైగా ఉంది.
ఇది కాకుండా, అత్యంత ప్రాచీన, భూగర్భ గనులు ఉన్న ఎస్ఇసిఎల్ కొరియా రేవా బొగ్గు క్షేత్రం కూడా గత ఏడాదితో పోలిస్తే బొగ్గు పంపిణీని 20% పెంచడం ద్వారా విశేషంగా దోహదం చేసింది.
కోల్ ఇండియాకు చెందిన అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి అనుబంధ సంస్థలలో ఎస్ఇసిఎల్ ఒకటి. ఆర్ధిక సంవత్సరం 2022-23లో సిఐఎల్ మొత్తం బొగ్గు ఉత్పత్తిలో నాలుగింట ఒక వంతు వాటానికి కలిగి కంపెనీ 167 ఎంటిల బొగ్గును (దాని చరిత్రలోనే అత్యధికం)ఉత్పత్తి చేసింది. ఈ ఏడాది కంపెనీ 197 ఎంటిల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది.
***
(Release ID: 1973226)
Visitor Counter : 85