పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
నిశ్శబ్ద సంభాషణః ఉపాంతం నుంచి కేంద్రానికి అన్న ఇతివృత్తంతో న్యూఢిల్లీలో 3-5 నవంబర్ 2023వరకు ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ (ఎన్‌టిసిఎ)
Posted On:
29 OCT 2023 4:31PM by PIB Hyderabad
పర్యావరణం, అడవులు & పర్యావరణ మార్పు మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ (ఎన్‌టిసిఎ- జాతీయ పులుల సంరక్షణ ప్రాధికరణ సంస్థ) సంకల ఫౌండేషన్ తో కలిసి నిశ్శబ్ద సంభాషణః ఉపాంతం నుంచి కేంద్రానికి (సైలెంట్ కాన్వర్సేషన్ః ఫ్రమ్ మార్జిన్స్ టు ది సెంటర్) అన్న వీర్షికతో 3 నవంబర్ 2023 నుంచి 5 నవంబర్ 2023 వరకు న్యూఢిల్లీలోని ఇండియా హాబిటెట్ సెంటర్‌లో ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తోంది. నవంబర్ 3, 2023న సాయంత్రం 4 గంటలకు మొదలు కానున్న ప్రారంభోత్సవ వేడుకలో గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. కేంద్ర పర్యావరణం, అడవులు, పర్యావరణ మార్పు మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా, కేంద్ర పర్యావరణం, అడవులు, పర్యావరణ మార్పు సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ప్రాజెక్ట్ టైగర్ విజయవంతంగా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ద్వారా సంకల ఫౌండేషన్‌తో కలిసి ఎన్‌టిసిఎ ఘనంగా నివాళులర్పించి, సత్కరిస్తోంది. భారత జాతీయ జంతువు అయిన బెంగాల్ టైగర్‌ను పరిరక్షించి, సంరక్షించి, గత దశాబ్దాలలో అది ప్రమాదకర స్తాయిలో అంతరించిపోవడాన్ని తగ్గించే లక్ష్యంతో 1973లో భారత్ చేపట్టిన వన్యప్రాణి సంరక్షణ చొరవ ప్రాజెక్ట్ టైగర్. పులుల జనాభా, వాటి అనుబంధ పర్యావరణ వ్యవస్థలను సంరక్షించడానికి ప్రత్యేకంగా నిర్వహించే ప్రాంతాల ఎంపిక, సంరక్షణ పైప్రాజెక్టు దృష్టిసారిస్తుంది. గత కొద్ది సంవత్సరాలలో, టైగర్ రిజర్వ్‌ల సంఖ్య పెరిగింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 54 రిజర్వ్‌లు ఉన్నాయి. ప్రాజెక్ట్ టైగర్‌లో ముఖ్యమైన అంశం జీవనోపాధి అవకాశాలను అందించడం, మానవ- వన్యప్రాణుల సంఘర్షణలను తగ్గించడం ద్వారా పరిరక్షణ ప్రయత్నాలలో స్థానిక సంఘాలను భాగస్వాములను చేయడం.
ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ భారతదేశంలోని పులుల రిజర్వ్‌ల చుట్టూ నివసించే గిరిజన సంఘాలు, అడవిలో నివసించే ఇతరుల మధ్య ప్రత్యేకమైన సంబంధాన్ని, అటవీ, వన్యప్రాణులతో వారి లోతైన సంబంధాన్ని ప్రదర్శిస్తుంది. ఇవన్నీ వారి కళాకృతుల ద్వారా ప్రదర్శించనున్నారు. ఈ కళాఖండాలన్నీ కూడా పెయింటింగ్‌లు రూపంలో ఉండి, గోండ్లు, భిల్లులు,ఎన్నో ఇతర గిరిజన సమాజాలకు గల పాత బంధాలను ప్రతిఫలిస్తాయి. ఈ పెయింటింగ్‌లు కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా వచ్చిన మొత్తాలను నేరుగా కళాకారుల బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతాయి. ఈ ప్రదర్శన అంతటా, ఈ విభిన్న కళారూపాలు ప్రదర్శనలో ఉండటమే కాకుండా, అనేకమంది గిరిజన కళాకారులు కూడా ఢిల్లీకి వెళ్ళి కార్యక్రమంలో పాల్గొంటారు.ఈ సందర్భంగా సందర్శకులు, కళాభిమానులకు ప్రత్యక్షంగా ముచ్చటించుకునే అవకాశాన్ని కల్పిస్తారు.
జాతీయ పులుల సంరక్షణ ప్రాధికరణ సంస్థ (ఎన్‌టిసిఎ)ను 2006లో ఏర్పాటు చేశారు. భారతదేశంలో పులుల సంరక్షణ పనిలో ముందు వరుసలో ఈ సంస్థ ఉంది. దాని పని రంగం క్షేత్ర స్థాయి పరిరక్షణ చొరవల నుంచి శాస్త్ర ఆధారిత పులుల పర్యవేక్షణ, తాజా సాంకేతిక సాధనాలను ఉపయోగించి వాటి ఆవాసాల వరకు విస్తరించింది. పులుల నిల్వలను స్వతంత్రంగా అంచనా వేయడాన్ని పులుల నిల్వలను స్వతంత్రంగా అంచనా వేయడం, పులుల నిల్వలకు ఆర్ధిక, సాంకేతిక మద్దతు, అంతర్జాతీయ సహకారానికి సమాజ అబివృద్ధికి భరోసా ఇస్తూ వన్యప్రాణుల కోసం ఉల్లంఘనీయ స్థలాలను సృష్టించడం అనేవి ఎన్‌టిసిఎ థ్రస్ట్ ప్రాంతాలు. ఈ ప్రదర్శనను ఎన్‌టిసిఎ, సంకల ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. వివిధ భారతీయ నగరాలు, ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇటువంటి ప్రదర్శనల పరంపరలో ఇది మొదటిది.
***
(Release ID: 1973014)
Visitor Counter : 102