రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

బహుమతి ప్రదానోత్సవం - సర్దార్ కె.ఎం. పనిక్కర్ ‘నిబ్‌’ వ్యాసరచన పోటీ

प्रविष्टि तिथि: 28 OCT 2023 10:55AM by PIB Hyderabad

సర్దార్ కె.ఎం. పనిక్కర్ 'నిబ్‌' (నేవీ ఇంటెలెక్చువల్ బీకన్) వ్యాస రచన పోటీలో విజేతగా నిలిచిన కమాండర్‌ ఎం అరుణ్ చక్రవర్తికి, నౌకాదళాధిపతి (సీఎన్‌ఎస్‌) అడ్మిరల్‌ ఆర్‌ హరి కుమార్, తొలి ‘ఎఐబీ’ని బహూకరించారు. అడ్మిరల్‌ ఆర్‌ హరి కుమార్ ఛాంబర్‌లో జరిగిన చిన్నపాటి కార్యక్రమంలో బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు. వైస్‌ అడ్మిరల్‌, చీఫ్‌ ఆఫ్‌ పర్సనల్‌ కె. స్వామినాథన్, కమోడర్ (నేవల్ ఎడ్యుకేషన్) సీఎండీ జి రాంబాబు, ఇతర అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన సిబ్బందిలో చదవడం, రాయడం, విమర్శనాత్మక ఆలోచనలు, క్రమబద్ధమైన విశ్లేషణలను ప్రోత్సహించే లక్ష్యంతో భారతీయ నౌకాదళం ఈ పోటీని నిర్వహించింది.


సముద్ర వ్యూహాల్లో దిట్ట, భారతదేశ వృద్ధిలో సముద్ర శక్తి, నౌకాదళ విధానం ప్రాధాన్యత గురించి అనేక రచనలు చేసిన మేధావి సర్దార్ కె.ఎం. పనిక్కర్ జ్ఞాపకార్థం ఈ పురస్కారం ప్రవేశపెట్టారు.

 

***


(रिलीज़ आईडी: 1972481) आगंतुक पटल : 91
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil