వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
మొజాంబిక్ నుంచి అంతరాయం లేకుండా బఠాణి ఎగుమతి అయ్యేలా చేసేందుకు మొజాంబిక్ హైకమిషనర్‌తో వాణిజ్య సంబంధిత చర్యలు నిర్వహించిన కేంద్రం మొజాంబిక్ ఓడరేవుల వద్ద బఠాణి ఎగుమతులకు త్వరితగతిన అనుమతి మంజూరు చేయాలని మొజాంబిక్ హైకమిషనర్ ను కోరిన వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి
భారతదేశంలో వినియోగదారులకు అవసరమైన బఠాణి లభించేలా చూసేందుకు చర్యలు తీసుకుంటున్న కేంద్రం లభ్యత మరియు స్థోమతను నిర్ధారిస్తూ టర్ లభ్యతను పెంపొందించడానికి క్లియరెన్స్
Posted On:
27 OCT 2023 2:19PM by PIB Hyderabad
బఠాణి రవాణాకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలను చర్చించి పరిష్కరించేందుకు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ రోహిత్ కుమార్ సింగ్ ఈరోజు మొజాంబిక్ హైకమిషనర్ ఎర్మిండో ఎ. పెరీరా.తో చర్చలు జరిపారు సమావేశంలో బఠాణి సంబంధించిన వాణిజ్యం, సంబంధిత సమస్యలు చర్చకు వచ్చాయి.
బఠాణి రవాణాకు సంబంధించి మొజాంబిక్‌లో 2023 జులై, 2023 నుంచి ఎదురవుతున్న విధానపరమైన అడ్డంకులపై శ్రీ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.మొజాంబిక్ నుంచి దేశానికి నౌకల ద్వారా రావాల్సి ఉన్నబఠాణి రవాణాలో జాప్యం జరుగుతోందని మొజాంబిక్ హైకమిషనర్ కి ఆయన తెలిపారు.. దిగుమతులు సజావుగా, ఎలాంటి అంతరాయం లేకుండా చేయడానికి భారతదేశం అవసరమైన విధానపరమైన చర్యలు రూపొందించిందని ఇదే తరహాలో మొజాంబిక్ నుండి ఎలాంటి అవాంతరాలు లేకుండా బఠాణి ఎగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన హైకమిషనర్‌ను కోరారు. బఠాణి తో మొజాంబిక్ రేవుల్లో అనుమతుల కోసం ఎదురుచూస్తున్న నౌకల వివరాలను మొజాంబిక్ హైకమిషనర్ కు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి అందించారు. ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకుని అనుమతులు జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బఠాణికి సంబంధించి రెండు దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాన్ని అమలు చేసి రెండు దేశాల ఉత్పత్తిదారులు, వినియోగదారుల ప్రయోజనాలు రక్షించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
తమ దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దోహదపడతాయని మొజాంబిక్ హైకమిషనర్ ఎర్మిండో ఎ. పెరీరా అన్నారు. బఠాణి రవాణాకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మొజాంబిక్ నుండి భారతదేశానికి ఎగుమతులు సజావుగా సాగేలా చేయడానికి అవసరమైన చర్యలు ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
మొజాంబిక్ హైకమిషనర్ తో వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిర్వహించిన చర్చల వల్ల రాబోయే నెలల్లో బఠాణి అందుబాటులోకి వస్తుంది. భారతీయ వినియోగదారులకు అవసరమైన బఠాణి లభిస్తుంది.
***
(Release ID: 1972429)
Visitor Counter : 74