రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ఫార్మాస్యూటికల్స్ విభాగంలో ప్రత్యేక ప్రచారం 3.0 కింద గణనీయమైన పురోగతి


3,924 భౌతిక ఫైళ్లుసమీక్ష, 820 ఫైళ్లు తొలగింపు, స్క్రాప్ మెటీరియల్స్
అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయం రూ.1,64,570

Posted On: 27 OCT 2023 2:57PM by PIB Hyderabad

ఫార్మాస్యూటికల్స్ విభాగం ప్రత్యేక ప్రచారం 3.0 లక్ష్యాలను చేరుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రచారం మూడవ వారంలోకి వెళ్లడంతో, డిపార్ట్‌మెంట్, దాని సంస్థలు నిర్వచించిన లక్ష్యాలను సాధించడంలో గణనీయమైన పురోగతిని సాధించాయి. 

  • శాఖలో ఎటువంటి అంతర్-మంత్రిత్వ సూచనలు, రాష్ట్ర ప్రభుత్వ సూచనలు, పీఎంఓ సూచన లేదా నిబంధనలు/ప్రక్రియల సడలింపుకు సంబంధించిన సూచనలు ఏవీ పెండింగ్‌లో లేవు.
  • అనుబంధిత కార్యాలయం (ఎన్పిపిఏ), స్వయంప్రతిపత్త సంస్థలు (ఎన్ఐపిఈఆర్ లు), పిఎస్యులు (హెచ్ఏఎల్,కేఏపిఎల్, బిసిపిఎల్), సొసైటీ (పిఎంబిఐ) కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి.
  • క్లీనింగ్ కోసం గుర్తించిన 9643 అవుట్‌డోర్ సైట్‌లలో, 6024 సైట్‌లు ఇప్పటివరకు కవర్ అయ్యాయి. తద్వారా సాధారణ ప్రజలలో చాలా విస్తృతమైన అవగాహన కలిపించి అందరిలో పరిశుభ్రమైన పర్యావరణం ప్రాముఖ్యతపై అవగాహనను ఏర్పరుస్తుంది.
  • 3924 ఫైళ్లను సమీక్షించగా 820 ఫైళ్లు తొలగించారు. 
  • ఇ-క్లీనింగ్‌లో భాగంగా, 3261 `పార్క్డ్' ఇ-ఫైళ్లు సమీక్షలో ఉన్నాయి.
  • మూడవ వారంలో ప్రారంభించిన ఉత్తమ అభ్యాసాలలో భాగంగా, మిగిలిపోయిన/ఉపయోగించని మందులను సేకరించడానికి లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజ్, మెడిఫ్లో సహకారంతో నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ద్వారా ఆఫీసు ప్రాంగణంలో ఒక బాక్స్‌ను అమర్చడం.
  • పిఐబి, పేస్ బుక్, ఎక్స్ (ట్విట్టర్), యుట్యూబ్, లింక్డిన్, ఇంస్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కార్యక్రమాల క్రియాశీల వ్యాప్తి, ప్రచారం. 

ప్రచారం ముగిసే సమయానికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు శాఖ సిద్ధంగా ఉంది.

 

***



(Release ID: 1972281) Visitor Counter : 43


Read this release in: English , Urdu , Hindi