వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
బహిరంగ మార్కెట్ విక్రయ పథకం (దేశీయ) ద్వారా నవంబర్1, 2023 నుంచి 200 ఎంటిల గోధుమలను బిడ్డర్లు కొనుగోలు చేసేందుకు అనుమతి
ప్రతి ఇ-వేలం ద్వారా అందిస్తున్న మొత్తం గోధుమల పరిమాణం 2ఎంటిల నుంచి 3 ఎంటిలకు పెంపు
గోధుమలను నిల్వలను నిరోధించేందుకు 1627 తనిఖీల నిర్వహణ
Posted On:
27 OCT 2023 2:18PM by PIB Hyderabad
బహిరంగ మార్కెట్‌లో గోధుమల అందుబాటును పెంచేందుకు, గోధుమ ధరలను 1.11.2023 నుంచి స్థిరీకరించేందుకు, బహిరంగ మార్కెట్ విక్రయాల పతకం (దేశీయ) (ఒఎంఎస్ఎస్ -డి) కింద బిడ్డర్ కొనుగోలు చేయగల పరిమాణాన్ని 100 ఎంటి నుంచి 200 ఎంటిలకు పెంచడమే కాక, దేశవ్యాప్తంగా ఇ-వేలం ద్వారా అందించనున్న మొత్తం పరమాణాన్ని 2ఎల్ఎంటిల నుంచి 3 ఎల్ఎంటిలకు పెంచింది.
బియ్యం, గోధుమ, గోధుమ పిండి చిల్లర ధరలను నియంత్రించేందుకు మార్కెట్ జోక్యం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన చొరవలో భాగంగా గోధుమ, బియ్యం ఇ-వేలాన్ని ప్రతివారం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా, 2023-24లో 18వ ఇ-వేలాన్ని 26-10-2023న నిర్వహించారు. దేశవ్యాప్తంగా గల ద444 డిపోల నుంచి 2.01 ఎల్ఎంటిల గోధుమలను వేలానికి ఉంచారు.
ఈ ఇ-వేలంలో 2763 మంది జాబితాలో గల కొనుగోలుదారులు గోధుమల కోసం పాల్గొనగా, 2318 విజయవంతమైన బిడ్డర్లకు 1.92 ఎల్ఎంటిల గోధుమలను విక్రయించారు.
ఎఫ్ఎక్యూ గోధుమలకు దేశవ్యాప్తంగా గల క్వింటాలుకు రూ. 2150 రిజర్వు ధరకు వ్యతిరేకంగా తూనిక సగటు అమ్మకపు ధర క్వింటాలుకు రూ. 2251.57 కాగా, యుఆర్ఎస్ గోధుమ రిజర్వు ధర క్వింటాలుకు రూ. 2125 కాగా, తూనిక సగటు విక్రయ ధర క్వింటాలుకు రూ. 2317.85గా ఉంది.
సరుకును నిల్వ పెట్టుకోకుండా వ్యాపారులను ఒఎంఎస్ఎస్(డి) కింద గోధుమ విక్రయాల పరిధి నుంచి దూరంగా ఉంచడమే కాక, ఒఎంఎస్ఎస్ (డి) కింద గోధుమ కొనుగోలు చేసిన ప్రాసెసర్ల పిండి మిల్లులను క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 26.10.23 వరకు 1627 తనిఖీలను నిర్వహించారు.
***
(Release ID: 1972275)
Visitor Counter : 58